Homeక్రీడలుTeam India : వన్డేల్లో, టి20 లో మనమే నెంబర్ వన్.. ఇక టెస్టులే మిగిలాయి

Team India : వన్డేల్లో, టి20 లో మనమే నెంబర్ వన్.. ఇక టెస్టులే మిగిలాయి

Team India : టీమిండియా సూపర్ ఫామ్ కొనసాగిస్తోంది.. శ్రీలంక, న్యూజిలాండ్ తో జరిగిన వన్డే సిరీస్ లను వైట్ వాష్ చేసి స్వదేశంలో మేము ఎప్పటికీ పులులమే అని నిరూపించింది. కివీస్ తో జరిగిన సిరీస్ విజయంతో దీనిని మరోసారి సగర్వంగా చాటి చెప్పింది.. న్యూజిలాండ్ జట్టులో సీనియర్లు లేరని చాలామంది అంటున్నారు. కానీ వారి బ్యాటింగ్ తీరు చూసిన తర్వాత అలా అనడానికి లేదు.. మన జట్టు వారి జట్టుతో పోల్చినప్పుడు బలంగా కనిపించినప్పటికీ సిరీస్ క్లీన్ స్వీప్ చేయడం పెద్ద విషయమే. వరుసగా రెండు వన్డే సిరీస్ లు క్లీన్ స్వీప్ చేయడం అంటే ఏ జట్టుకైనా కష్టమే. ఇక టీమిండియా ఈ ఏడాది మొదట్లో మొదట శ్రీలంకను, తర్వాత న్యూజిలాండ్ ను అవలీలగా క్లీన్ స్వీప్ చేసి పారేసింది.. ఫలితంగా ప్రస్తుతం టి20 లో, వన్డేల్లో టీమిండియా నెంబర్ వన్ గా ఉంది.. ఇక టెస్టుల్లోనూ అగ్రస్థానం అందుకుంటే ముచ్చటగా మూడు ఫార్మాట్ లలోనూ ఏక కాలంలో నెంబర్ వన్ జట్టుగా నిలిచిన అరుదైన గౌరవాన్ని సాధిస్తుంది.

ఓపెనర్లు సూపర్

శ్రీలంక, న్యూజిలాండ్ తో జరిగిన సీరిస్ ల్లో భారత ఓపెనర్లు తడాఖా చూపారు.. రెచ్చిపోయి బ్యాటింగ్ చేశారు…మరీ ముఖ్యంగా గిల్ దూకుడుగా ఆడుతున్నాడు.. ఒకప్పటి వీరేంద్ర సేహ్వాగ్ ను తలపిస్తున్నాడు. ఎటువంటి భయం లేకుండా షాట్లు ఆడుతున్నాడు.. అతడి ఆట తీరు చూసి ఇండియన్ కెప్టెన్ రోహిత్ శర్మ ముగ్దుడవుతున్నాడు. న్యూజిలాండ్ తో జరిగిన మూడో వన్డేలో గిల్ రోహిత్ శర్మను మించిపోయి బ్యాటింగ్ చేయడమే ఇందుకు ఉదాహరణ.. అంతే కాదు మొదటి వన్డేలో అతడు ఏకంగా డబుల్ సెంచరీ సాధించాడు.. చివరి వన్డేలో సెంచరీ కొట్టాడు. దురదృష్టవశాత్తు అవుట్ అయ్యాడు కానీ లేకుంటే పరిస్థితి మరో విధంగా ఉండేది. ఓపెనర్లు గాడిలో పడ్డారు అనుకుంటే… మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ అంతగా రాణించడం లేదు.. హార్దిక్ పాండ్యా న్యూజిలాండ్ తో జరిగిన చివరి వన్డేలో అర్థ శతకం సాధించాడు కానీ… అంతకుముందు మ్యాచ్లో అతడు తేలిపోయాడు.. విరాట్ కోహ్లీ కూడా న్యూజిలాండ్ టోర్నీలో విఫలమయ్యాడు.. ఇక సూర్య కుమార్ యాదవ్ వన్డే ఫార్మాట్ కు అలవాటు పోవడం లేదు..

బౌలర్లు మారాలి

ఇక ఆరంభంలో వికెట్లు తీస్తున్న భారత బౌలర్లు… దానిని చివరి వరకు కొనసాగించలేకపోతున్నారు. ఇది మ్యాచ్ ఫలితాలపై ప్రభావాన్ని చూపిస్తోంది.. చివరి ఓవర్లలో ధారాళంగా పరుగులు ఇవ్వడం వల్ల జట్టుపై ఒత్తిడి పెరుగుతోంది.. ముఖ్యంగా న్యూజిలాండ్తో జరిగిన మొదటి మ్యాచ్లో భారత్ భారీ స్కోర్ చేసినప్పటికీ.. బ్రేస్ వెల్ క్రీజు లో ఉన్నంతవరకు మ్యాచ్ గెలుస్తామని ఆశ టీం లో లేదు.. ఇక మరికొద్ది రోజుల్లో ఆస్ట్రేలియాతో టెస్టులు, వన్డేలు ఆడాల్సి ఉంది.. ఈ క్రమంలో భారత్ ప్రదర్శనను మరింత మెరుగుపరుచుకోకుంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది.. దీని తర్వాత వరల్డ్ కప్ ప్రారంభమవుతుంది.. ఈసారి ఎలాగైనా కప్ ఒడిసి పట్టాలని టీమిండియా యోచిస్తోంది.. ప్రస్తుతం టీమిండియా వన్డే, టి20 ఫార్మాట్లో నెంబర్ వన్ గా ఉన్నప్పటికీ… దానిని కాపాడుకోవాలంటే ఈ ప్రదర్శన సరిపోదు.. అంతకుమించి ఆడితేనే వరల్డ్ కప్ మూడోసారి దక్కుతుంది..

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version