https://oktelugu.com/

Tea: రోజూ ఉదయం ఈ టీ తాగితే.. జలుబు సమస్యలన్నీ మాయం

శరీరంలో ఉండే చెడు టాక్సిన్లను బయటకు పంపించడంలో అశ్వగంధ టీ బాగా పనిచేస్తుంది. ఉదయం, సాయంత్రం వేళలో అశ్వగంధం పొడితో తయారు చేసిన టీ తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. మరి అవేంటో తెలియాలంటే ఆలస్యం చేయకుండా ఆర్టికల్ చదివేయండి.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 3, 2024 / 03:33 AM IST

    ashwagandha tea

    Follow us on

    Tea:ఉదయం లేచిన వెంటనే టీ తాగకపోతే కొందరికి అసలు రోజూ కూడా గడవదు. సాధారణంగా ఎవరికైనా సూర్యోదయంతో డే స్టార్ట్ అయితే.. కొందరికి మాత్రం టీతోనే స్టార్ట్ అవుతుంది. టీ ప్రేమికులు రోజులో ఎన్నిసార్లు టీ తాగుతారో అసలు లెక్క ఉండదు. సమయం సందర్భం లేకుండా టీ, కాఫీలు తాగుతుంటారు. అయితే ఈ టీలు ఎక్కువగా తాగడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే టీ, కాఫీలకు బదులు అశ్వగంధం టీ తాగితే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని పోషకాలు ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరకుండా చేస్తాయి. ముఖ్యంగా సీజనల్ సమస్యల నుంచి విముక్తి కలిగిస్తాయి. అలాగే శరీరంలో ఉండే చెడు టాక్సిన్లను బయటకు పంపించడంలో అశ్వగంధ టీ బాగా పనిచేస్తుంది. ఉదయం, సాయంత్రం వేళలో అశ్వగంధం పొడితో తయారు చేసిన టీ తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. మరి అవేంటో తెలియాలంటే ఆలస్యం చేయకుండా ఆర్టికల్ చదివేయండి.

    ఆందోళన నుంచి విముక్తి
    డైలీ అశ్వగంధం టీ తాగడం వల్ల మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. బాగా ఒత్తిడితో బాధపడుతున్నట్లయితే ఈ టీ సహాయపడుతుంది. ఇందులోని పోషకాలు ఒత్తిడి, ఆందోళన నుంచి విముక్తి కల్పిస్తుంది. అలాగే నిద్ర లేమి సమస్యలతో బాధపడే వారు కూడా ఈ టీ తాగితే సమస్య క్లియర్ అవుతుంది.

    తక్షణమే శక్తి
    కొందరు చాలా నీరసంగా ఉంటారు. అలాంటి వారు రోజూ ఉదయం అశ్వగంధ టీ తాగడం వల్ల రోజంతా యాక్టివ్‌గా ఉంటారు. ఈ టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఎలాంటి వ్యాధులు దరిచేరనివ్వకుండా చేస్తాయి. ముఖ్యంగా సీజనల్ సమస్యలు అయిన విరేచనాలు, జలుబు, దగ్గు వంటి వ్యాధులను నివారిస్తాయి.

    మధుమేహం నియంత్రణ
    రోజూ ఉదయం ఈ టీ తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. ఇందులోని పోషకాలు ఇన్సులిన్‌ను తగ్గిస్తాయి. అలాగే శరీరంలో ఉండే కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా తగ్గిస్తాయి. దీనివల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. దీంతో గుండె ప్రమాదాలు తగ్గుతాయి.

    చర్మ ఆరోగ్యం
    కొందరు ముఖంపై మొటిమలు వంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారు ఈ టీ తాగితే ముఖం కాంతివంతంగా మెరిసిపోతుంది. ముఖ్యంగా వృద్ధాప్య లక్షణాలు ఆలస్యంగా వచ్చేలా చేస్తాయి. దీంతో యంగ్ లుక్‌లో కనిపిస్తారు.

    క్యాన్సర్ సమస్యల నుంచి ఉపశమనం
    ఈ అశ్వగంధలోని పోషకాలు క్యాన్సర్ కణాలను నిరోధిస్తాయి అలాగే మెదడు పనితీరును మెరుగుపరడంలో బాగా సహాయపడతాయి. ముఖ్యంగా అల్జీమర్స్ వంటి సమస్యలను తగ్గించడంలో కూడా ఇది బాగా పనిచేస్తుంది. డైలీ రెండు పూటలు తాగడం వల్ల క్యాన్సర్ కణాలు పెరిగే కణజాలాన్ని తగ్గించవచ్చు.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.