Tamarind Seeds: చింతపండు గురించి అందరికీ తెలిసిందే. దీన్ని ఎక్కువగా రసం, పప్పు చారు, కూరల్లో వాడుతుంటారు. పూర్వ కాలంలో ఎక్కువగా చింత పండు చిగురుతో కూడా రకరకాల వంటలు చేసేవారు. అయితే ఈ చింతపండును వాడిన తర్వాత చాలా మంది ఆ గింజలను పడేస్తారు. చింత పండు, వాటి చిగురు వల్ల శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఈ గింజలతో కూడా అన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ చింత పండు గింజల్లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆర్థరైటిస్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దీంతో పాటు ఎలాంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా కాపాడుతుంది. ఈ గింజల్లో ఉండే పోషకాలు జీర్ణ వ్యవస్థను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే బరువు తగ్గాలనుకునే వారికి ఈ గింజలు బాగా ఉపయోగపడతాయి.
కొందరు కడుపు సంబంధిత సమస్యలతో ఎక్కువగా ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారికి ఈ చింత పండు గింజలు బాగా సహాయపడతాయి. ఇందులోని కాల్షియం, భాస్వరం కడుపు సంబంధిత సమస్యలు రాకుండా ఉపయోగపడతాయి. అలాగే ఎముకలను బలపరచడంతో పాటు ఆర్థరైటిస్ వంటి వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. దీంతో పాటు కీళ్ల నొప్పుల నుంచి విముక్తి చెందేలా కూడా సాయపడతాయి. ఈ గింజలు పురుషులు, మహిళలు ఇద్దరిలో లైంగిక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. అలాగే శరీరంలోని ఏదైనా భాగంలో వాపును తగ్గించడంతో పాటు నొప్పి నుంచి కూడా ఉపశమనం పొందేందుకు పనిచేస్తుంది. దీనిని రోజూ డైట్‌లో ఉపయోగించడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరకుండా ఆరోగ్యంగా ఉంటారు.
ఈ చింతపండు గింజలను బాగా ఎండబెట్టుకోవాలి. ఆ తర్వాత వాటితో పొడి చేసుకోవాలి. ఈ పొడిని పాలు లేదా నీటిలో కలిపి తాగడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. ఇందులోని పోషకాలు శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి బాగా సాయపడతాయి. రోజులో ఏదో ఒక సమయంలో ఈ గింజల పొడిని తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. ఈ గింజల పొడినే కాకుండా చింత పండు రసాన్ని కూడా కొందరు ఎక్కువగా తీసుకుంటారు. అయితే ఈ రసాన్ని ఎక్కువగా ఉత్తర భారత దేశంలో కంటే దక్షిణ భారత దేశంలోనే వండుకుని తింటారు. చింతపండును తప్పకుండా అన్నింట్లో వండుతారు. ముఖ్యంగా చింత పండు లేకపోతే అసలు సాంబార్ టేస్ట్ కూడా రాదు. కొందరు కూరల్లో కూడా చింత పండు రసాన్ని వాడుతుంటారు. అలాగే చింత చిగురుతో కొందరు పులిహోర వంటివి చేస్తుంటారు. ఇవి ఆరోగ్యానికి మంచివని నిపుణులు అంటున్నారు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.