India vs Sri Lanka: బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ ను వైట్ వాష్ చేసిన టీమిండియా… మరో ఆసక్తికర టోర్నీకి సిద్ధమవుతోంది.. ఈసారి స్వదేశంలో శ్రీలంకతో మూడు వన్డేలు, మూడు టి20 మ్యాచ్ లు ఆడనుంది.. జనవరి 3 నుంచి టి20 సిరీస్, పది నుంచి వన్డే సిరీస్ ప్రారంభమవుతాయి.. అయితే ఈ సిరీస్ కోసం భారత క్రికెట్ సమాఖ్య ఇంకా జట్లను ప్రకటించలేదు.. కానీ డిసెంబర్ 27న చేతన్ శర్మ సారథ్యంలో సెలక్షన్ కమిటీ తమ చివరి అసైన్మెంట్ గా ఈ రెండు సిరీస్ లకు జట్లను ప్రకటించే అవకాశం ఉంది.. అయితే ఈసారి భారీ మార్పులు చేపడతారని ప్రచారం జరుగుతున్నది.

హిట్ మ్యాన్ ఔట్
బంగ్లాదేశ్ తో జరిగిన వన్డే సిరీస్ లో బొటనవేలి గాయం బారిన పడిన కెప్టెన్ రోహిత్ శర్మ ఈ సిరీస్ లో ఆడేది అనుమానంగానే ఉంది.. రోహిత్ శర్మ పూర్తిగా కోలుకోకపోవడమే ఇందుకు కారణం.. రోహిత్ శర్మ అందుబాటులో లేకపోతే వైస్ కెప్టెన్ గా ఉన్న కేఎల్ రాహుల్ సారధ్య బాధ్యతలు చూడాల్సి ఉంటుంది. అయితే రాహుల్ వరుసగా విఫలమవుతున్న నేపథ్యంలో అతనిపై వేటు వేయాలని భారత క్రికెట్ క్రీడా సమాఖ్య భావిస్తున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి రాహుల్ ఈమధ్య చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడి చాలా రోజులైంది. మెన్స్ వరల్డ్ కప్ టి 20 సిరీస్ లో అతడు దారుణంగా విఫలమయ్యాడు. అయితే త్వరలో తనకు అంతియా తో వివాహం జరగనున్న నేపథ్యంలో తానే ఈ సిరీస్ లకు దూరంగా ఉంటానని బీసీసీఐ అధికారులకు చెప్పినట్లు సమాచారం.. ఈ నేపథ్యంలో శ్రీలంకతో టి20 సిరీస్ కు టీం ఇండియా కెప్టెన్ గా హార్దిక్ పాండ్యాను ఎంపిక చేస్తారని ప్రచారం జరుగుతోంది.. ఇక ఈ సిరీస్ కు సంబంధించి స్టార్ స్పోర్ట్స్ టి20 సిరీస్ ప్రోమో కూడా అందుకు బలాన్ని చేకూరుస్తోంది.. శ్రీలంకతో మూడు టి20ల సీరిస్ ను ప్రమోట్ చేస్తూ స్టార్ స్పోర్ట్స్ ఒక వీడియోను రూపొందించింది. ” కొత్త సంవత్సరంలో శ్రీలంకతో సిరీస్ ఆడేందుకు హార్దిక్ పాండ్యా సిద్ధమవుతున్నాడు.. సరికొత్త టీమిండియా యాక్షన్ చూసేందుకు సిద్ధం అవ్వండి” అంటూ స్టార్ స్పోర్ట్స్ ఒక ట్వీట్ చేసింది.
కోహ్లీకి విశ్రాంతి
వచ్చే సంవత్సరం సొంత గడ్డపై ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తో భారత్ సిరీస్ లు ఆడాల్సి ఉంది.. ఈ నేపథ్యంలో స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీకి విశ్రాంతి ఇవ్వాలని బీసీసీఐ భావిస్తోంది.. ముఖ్యంగా డబ్ల్యూటీసి ఫైనల్ బెర్త్ ఖరారు కావాలి అంటే ఆస్ట్రేలియాను ఓడించడం టీం ఇండియాకు అత్యవసరం.. అయితే దీనిని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీసీసీఐ సీనియర్ ఆటగాళ్ల గాయాలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది.. ఈ నేపథ్యంలో మ్యాజిక్ బౌలర్ బుమ్రా, జడేజాలను కూడా దూరంగా పెట్టినట్టు సమాచారం.

పంత్ పై వేటు
టి20 మ్యాచ్ లలో పేలవమైన ఫామ్ కనబరుస్తున్న రిషబ్ పంత్ పై కూడా వేటు పడే అవకాశం కనిపిస్తోంది.. సంజు శాంసన్, బంగ్లాదేశ్ పై డబుల్ సెంచరీ హీరో ఇషాన్ కిషన్ టి20 సిరీస్ లో చోటు దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక విధ్వంసకర ఓపెనర్ పృథ్వీ షా కు కూడా ఈ సిరీస్ కు పిలుపు అంది అవకాశాలు కనిపిస్తున్నాయి.. ఆస్ట్రేలియాలో టి20 మెన్స్ వరల్డ్ కప్ ఓటమి తర్వాత జట్టులో చాలా మార్పులు చేశామని చెబుతున్న బీసీసీఐ… ఫలితాలు మాత్రం ఆ స్థాయిలో అందుకోలేక పోతోంది.. ఎందుకంటే న్యూజిలాండ్ తో వన్డే సిరీస్, బంగ్లాదేశ్ తో వన్డే సిరీస్ భారత్ కోల్పోయింది.. టి20, టెస్ట్ సిరీస్ మాత్రం నెగ్గింది.. ఇక జనవరి 3 నుంచి 15 దాకా శ్రీలంకతో భారత్ t20, వన్డే సిరీస్ ఆడనుంది.