https://oktelugu.com/

Sweets: భోజనం తర్వాత స్వీట్లు తింటున్నారా.. వామ్మో ఇంత ప్రమాదమా!

సాధారణంగా స్వీట్లు అంటే అందరికీ ఇష్టమే. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ కూడా స్వీట్లు తింటారు. మధుమేహం ఉన్నవారు మాత్రమే తినరు. వారికి కూడా తినాలని ఉంటుంది. కానీ అనారోగ్య సమస్యల కారణంగా తినకుండా ఉంటారు. అయితే కొందరు మాత్రం తప్పకుండా రాత్రి భోజనం తర్వాత స్వీట్లు తింటారు. కేవలం స్వీట్లు అనే కాకుండా ఏవైనా తీపి పదార్థాలు తింటుంటారు.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 4, 2025 / 08:48 PM IST

    Eating Sweets

    Follow us on

    Sweets: సాధారణంగా స్వీట్లు అంటే అందరికీ ఇష్టమే. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ కూడా స్వీట్లు తింటారు. మధుమేహం ఉన్నవారు మాత్రమే తినరు. వారికి కూడా తినాలని ఉంటుంది. కానీ అనారోగ్య సమస్యల కారణంగా తినకుండా ఉంటారు. అయితే కొందరు మాత్రం తప్పకుండా రాత్రి భోజనం తర్వాత స్వీట్లు తింటారు. కేవలం స్వీట్లు అనే కాకుండా ఏవైనా తీపి పదార్థాలు తింటుంటారు. అయితే ఇలా భోజనం తర్వాత స్వీట్లు తినడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని కొన్నింటి వల్ల శరీర ఆరోగ్యం దెబ్బతింటుంది. కొందరు కేవలం స్వీట్లు అనే కాకుండా చాక్లెట్, ఐస్ క్రీం, డీజర్ట్, పాయసం ఇలా ఏదైనా తీపి వస్తువులు తింటారు. వీటివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇందులోని స్వీట్ వల్ల తొందరగా మధుమేహం కూడా వస్తుంది. అయితే డైలీ రాత్రి భోజనం తర్వాత స్వీట్లు తినడం వల్ల కలిగే నష్టాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

    బరువు పెరగడం
    రోజూ రాత్రి భోజనం తర్వాత స్వీట్లు తినడం వల్ల తొందరగా బరువు పెరుగుతారు. మీ బాడీ ఎక్కువగా కొవ్వుతో నిండుతుంది. దీంతో మీరు తొందరగా బరువు పెరుగుతారు. భోజనం తర్వాత అంతగా తీపి పదార్థాలు తినాలని అనిపిస్తే అవసరమైతే బెల్లం తినడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా దరిచేరవు. ఇందులోని పోషకాలు బరువును నియంత్రణలో ఉంచుతాయి. అదే మీరు స్వీట్లు తింటే టైప్ 2 డయాబెటిస్ కూడా వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

    మధుమేహం
    ఎక్కువగా స్వీట్లు రాత్రి భోజనం తర్వాత తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. దీనివల్ల కొన్నిసార్లు సమస్య తీవ్రం అయ్యి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చక్కెర వల్ల బాడీకీ ఎలాంటి శక్తి లభించదు. ఇంకా అనారోగ్య సమస్యలు తీవ్రం అవుతాయి. నిద్రపోయే ముందు స్వీట్లు తినడం వల్ల నిద్రకు భంగం కలుగుతుంది. దీనివల్ల మీ ఆరోగ్యం దెబ్బతింటుంది. అలాగే కాలేయం కూడా దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

    ఫుడ్‌పై ఇంట్రెస్ట్ పెరగడం
    రాత్రి భోజనం తర్వాత స్వీట్లు తినడం వల్ల చక్కెర పదార్థాలు తినాలనే కోరిక పెరుగుతుంది. ఇందులోని తీపి మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. భోజనం తర్వాతే స్వీట్లు తినాలనిపిస్తే మధ్యాహ్న సమయంలో కొంచెం మాత్రమే తినండి. తీపి తినాలనే ఇంట్రెస్ట్ పెరగడంతో పాటు దంత సమస్యలు కూడా వస్తాయి. చక్కెరలోని తీపి యాసిడ్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనివల్ల దంత క్షయం రావడంతో పాటు బ్యాక్టీరియా సమస్యలు కూడా పెరుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

    మానసిక ఆరోగ్యం
    తీపి పదార్థాలు ఎక్కువగా తినడం వల్ల మానసిక సమస్యలు వస్తాయి. వికారం, చిరాకుగా ఉంటుంది. మానసికంగా కాస్త ఒత్తిడితో ఉంటారు. దీనివల్ల పోషక అసమతుల్యత కూడా వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే విటమిన్లు, ఖనిజాల లోపాలకు కూడా కారణమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి రాత్రి భోజనం తర్వాత స్వీట్లు తీసుకోకపోవడం మంచిది. ఒకవేళ తీసుకున్న బెల్లంతో చేసిన పదార్థాలు తినడం ఆరోగ్యానికి బెటర్.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. వీటిని పాటించే ముందు తప్పకుండా వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.