Suryakumar Yadav: టీ20 ప్రపంచ కప్ లో ఆఖరి సూపర్ 12 స్టేజిలో జరిగిన మ్యాచ్ లో జింబాబ్వేను ఓడించింది. సూర్యకుమార్ యాదవ్ తన బ్యాట్ తో విధ్వంసం సృష్టించాడు. 25 బంతుల్లో 61 ( 6 ఫోర్లు, 4 సిక్సర్లు) సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. అద్భుతమైన రికార్డులు సొంతం చేసుకున్నాడు. జింబాబ్వే బౌలర్లతో ఆడుకున్నాడు. ఏ బంతి అయినా బౌండరీ దాటిస్తూ వారిలో కంగారు పుట్టించాడు. సూర్య ఆడుతున్నంత సేపు అభిమానుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. అలా తన బ్యాట్ తో చెలరేగిపోయాడు.

మిడిలార్డర్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ తన కెరీర్ లో అద్భుతమైన ఫామ్ కొనసాగిస్తున్నాడు. ఏడాది కాలంగా పరుగుల దాహం తీర్చుకుంటున్నాడు. అనేక రికార్డులు నెలకొల్పుతున్నాడు. 360 డిగ్రీల ప్లేయర్ గా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. వరల్డ్ కప్ లో తన సత్తాతో టీమిండియాకు విజయం తెచ్చిపెట్టాడు. జింబాబ్వేతో జరిగిన మ్యాచ్ లో సూర్యకుమార్ ప్రతి బంతిని తనదైన శైలిలో ఆడుకున్నాడు. అతడి ఆటను చూసిన వారికి కనుల పండుగే అయింది.
సూర్యకుమార్ యాదవ్ తన బ్యాట్ తో విన్యాసాలు చేశాడు.
దీంతో ఎన్నో రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. ఒక సంవత్సరంలో టీ20ల్లో వెయ్యికి పైగా పరుగులు చేసిన రెండో బ్యాటర్ గా రికార్డు సృష్టించాడు. ఈ ఘనత సాధించిన క్రీడాకారుడిగా సూర్య ఖ్యాతి గడించాడు. మొదట ఈ రికార్డు అందుకున్నది పాక్ ఓపెనర్ రిజ్వాన్. 2021 క్యాలెండర్ ఇయర్ లో రిజ్వాన్ 1326 పరుగులు చేశాడు. ప్రస్తుతం సూర్య కుమార్ యాదవ్ టీ20 టోర్నీల్లో వేగంగా పరుగులు రాబడుతూ రికార్డులు సాధిస్తున్నాడు. ఇలా రికార్డుల పరంపర సృష్టిస్తున్నాడు.

23 బంతుల్లోనే అర్థ శతకం పూర్తి చేసుకున్నాడు. యువరాజ్ 12 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసి టాప్ స్థానంలో ఉండగా కేఎల్ రాహుల్ 2021లో స్కాట్లాండ్ పై 18 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసి రెండో స్థానంలో ఉన్నాడు. సూర్యకుమార్ యాదవ్ చేసిన విన్యాసాలతో అద్భుతాలు చేశాడు. వేగంగా పరుగులు చేసి జింబాబ్వే బౌలర్లను ఆడుకున్నాడు. చివరి ఐదు ఓవర్లలో ఏకంగా 56 పరుగులు రాబట్టాడు. టీ20ల్లో ఐదు ఓవర్లలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా సూర్య నిలిచిపోయాడు.