Tips to refresh your mind: ప్రతి ఒక్కరూ తమ జీవితం సంతోషంగా ఉండాలని కోరుతూ ఉంటారు. అయితే ఉదయం నుంచి రాత్రి వరకు ఏదో ఒక పనితో బిజీగా మారిపోతారు. ఉద్యోగ, వ్యాపార రీత్యా తమ కార్యకలాపాలకు వెళ్లిన వారు తిరిగి సాయంత్రం రాగానే వెంటనే కాసేపు విశ్రాంతి తీసుకుని ఆ తర్వాత పడుకోవడం వంటివి జరుగుతాయి. ఇలా వారం రోజుల పాటు జరిగిన తర్వాత ఏడో రోజు కాస్త విశ్రాంతి తీసుకుని బయటకు వెళ్లేసరికి సమయం గడిచిపోతుంది. ఇలా చేయడం వల్ల లైఫ్ రొటీన్ గా మారిపోతుంది. చాలామంది జీవితంలో ఇలా జరగడంతో తమ లైఫ్ బోర్ కొడుతుంది అని అంటుంటారు. ఈ క్రమంలో మానసికంగా కూడా ఉత్సాహం అనిపించదు. అయితే ప్రతి వారానికి ఒక కొత్త పనిని చేపట్టి మనసును ఉల్లాసంగా ఉంచుకోవడంతో కొత్త ఉత్సాహం ఏర్పడుతుంది. దీంతో వీక్ లో మొదటి రోజు ఎంతో హాయిగా ఉంటుంది. మరి ప్రతి వారం ఎలాంటి ప్లాన్ చేసుకోవాలి?
కుకింగ్:
కొంతమంది మగవారు వారంలో చాలా రోజులపాటు బయట ఫుడ్ తిని గడిపిస్తారు. మరికొందరు ఇంట్లో ఫుడ్ తింటూ.. ఇది నచ్చకపోతే వారిని నిందిస్తూ ఉంటారు. ఇలాంటి సమయంలో రొటీన్ కు భిన్నంగా వారంలో ఒకరోజు ఆ బాధ్యతను మీరు తీసుకోండి. ఆ ఒక్కరోజు పూర్తిగా ఇంటి పనులు చేయాలని నిర్ణయించుకోండి. ఇందులో భాగంగా కొత్త వంటకాన్ని తయారుచేసి ఇంట్లో వారికి మీ చేతి రుచి చూపించండి. నీతో మీతో పాటు ఇంట్లో వాళ్ళు కూడా కొత్తదానాన్ని ఆస్వాదిస్తారు. ఫలితంగా ఆ రోజు మీకు రొటీన్ కు భిన్నంగా గడిచిపోతుంది.
టూర్:
ఎప్పుడు ఒకే చోట ఉండడంవల్ల మానసికంగా అభివృద్ధి చెందే అవకాశం ఉండదు. వారం రోజులపాటు ఒకే చోట ఉద్యోగం లేదా వ్యాపారం చేయడం వల్ల మనసు అలసిపోతుంది. దీంతో వీకెండ్ డే లో ఇతర ప్రదేశాలకు వెళుతూ ఉండాలి. ఇవి మానసికంగా ఉల్లాసాన్ని ఇచ్చే ప్రదేశం అయి ఉండాలి. ఇలా వారానికి డిఫరెంట్ టూర్ ప్లాన్ చేయడంతో కొత్త ఉత్సాహం ఏర్పడుతుంది. అయితే ఈ టూర్ ఫ్యామిలీతో వేయడం వల్ల మరింత సంతోషంగా ఉండగలుగుతారు.
ఫ్రెండ్స్:
కొంతమంది ఇన్నాళ్లు తమతో కలిసి ఉన్న స్నేహితులను ఉద్యోగం కారణంగా కలవలేక పోతుంటారు. ఈ క్రమంలో వారంలో ఒకరోజు వారిని ఇంటికి ఆహ్వానించండి. రోజంతా వారితో కలిసి మెలిసి ఉంటూ ఒక డిన్నర్ ఏర్పాటు చేయండి. ఇలా ప్రతి స్నేహితుడు తమ ఇంట్లో డిన్నర్ ఏర్పాటు చేసి ఒక ఈవెంట్ లాగా ఉండడంవల్ల అందరూ ఒకచోట చేరి ఉల్లాసంగా ఉండగలుగుతారు. దీనివల్ల సంబంధాలు మెరుగుపడతాయి.
ఫోన్:
ప్రతిరోజు ఏదోరకంగా ఫోన్ చూడడం ఉంటుంది. అయితే వారంలో ఒకరోజు ఫోన్ మొత్తానికి వాడకుండా ఉండండి. కేవలం కాల్స్ రిసీవ్ అండ్ కాలింగ్ మాత్రమే అనుకొని ఎలాంటి ఇంటర్నెట్ ఉపయోగించకుండా ఉండండి. దీంతో ఒక్కరోజైనా ఫోన్కు దూరంగా ఉండి మానసికంగా ఉల్లాసంగా ఉంటారు.