Sunrisers Hyderabad: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఫిబ్రవరిలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీంతో ఫ్రాంచైజీలు ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నాయి. తమకు అనుకూలమైన ఆటగాళ్లను కొనుగోలు చేయాలని చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సన్ రైజర్స్ తమ జట్టు కూర్పు కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది. సమర్థులైన ఆటగాళ్లను చేర్చుకోవాలని భావిస్తోంది. ఇందుకోసం పటిష్ట వ్యూహాలు రచిస్తోంది. 2023లో టైటిల్ ఫేవరేట్ గా బరిలో దిగాలని ప్రణాళికలు రూపొందిస్తోంది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ తో పాటు పలువురిని మార్చాలని చూస్తోంది.

వచ్చే ఏడాది ఐపీఎల్ 16వ ఎడిషన్ కు ముందస్తు చర్యలు చేపడుతోంది. ఆటగాళ్లను వేలంలో కొనుగోలు చేసుకోవడానికి ముందుకొస్తోంది. ఈ క్రమంలో పలువురు ఆటగాళ్ల పేర్లు బయటకు వస్తున్నాయి. కెప్టెన్ విలియమ్సన్ ను మార్చాలని నిర్ణయించింది. భువనేశ్వర్ కుమార్ వినిపించినా తరువాత యువ బ్యాటర్ అభిషేక్ శర్మ పేరు తెరమీదకు వస్తోంది. కానీ ఇప్పుడు మళ్లీ కొత్త పేరు రేసులోకి వచ్చింది. జట్టు కెప్టెన్ గా దక్షిణాఫ్రికా ఆటగాడు మార్క్ రమ్ ను నియమించుకోవాలని చూస్తోందనే వాదనలు కూడా వస్తున్నాయి.
అభిమానులు కూడా జట్టును మార్చాల్సిందేనని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆటగాళ్ల మార్పు అనివార్యంగా కనిపిస్తోంది. కెప్టెన్ బాధ్యత తలకు మించిన భారమేనని మార్క్ రమ్ అంటున్నాడు. అతడికి జట్టును సమర్థంగా నడిపించే సత్తా ఉందని ఫ్రాంచైజీ నిర్వాహకులు ఆలోచిస్తున్నారు. దీంతోనే అతడిని కెప్టెన్ గా తీసుకోవాలని ప్రయత్నాలు ప్రారంభించింది. అంతర్జాతీయ స్థాయిలో అతడికి ఉన్న అనుభవం దృష్ట్యా మార్క్ రమ్ ను కెప్టెన్ గా తీసుకుంటామని చెబుతున్నారు.

సన్ రైజర్స్ ను విజేతగా నిలపాలనే తపన ఉండటంతో ఈ సారి ఎలాగైనా కప్ గెలవాలనే ఆశ అందరిలో వస్తోంది. తమ జట్టును ముందు వరుసలో నిలిపే ఆటగాళ్లు కావాలని ఉద్దేశిస్తోంది. దక్షిణాఫ్రికా టీ20 లీగ్ లో కూడా జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించిన మార్క్ రమ్ సేవలు మన జట్టుకు అవసరమని చెబుతున్నారు. భవిష్యత్ లో జట్టు కూర్పు బలంగా ఉండాలనే కసరత్తు ప్రారంభిస్తోంది. విజయాల బాట పట్టేందుకు కావాల్సిన అస్త్ర శస్త్రాలు సిద్ధం చేసుకుంటోంది. ఇందుకు గాను మంచి ఆటగాళ్లను తీసుకోవాలని ముమ్మరంగా చర్యలు తీసుకుంటోంది.