Summer Trip : వేసవికాలం రాగానే చాలామంది దూర ప్రయాణాలు చేయాలని అనుకుంటారు. కొందరు ఈ వేసవి పూర్తి అయ్యేవరకు చల్లటి ప్రదేశాలకు వెళ్లాలని అనుకుంటారు. అయితే అనుకున్న ప్రదేశానికి అనుకున్న సమయానికి వెళ్లాలంటే మిగతా ట్రావెల్స్ తో ఇబ్బందిగా ఉంటుంది. ఒకవేళ అద్దెకు వాహనాలు తీసుకుంటే ఖర్చు ఎక్కువగా మారుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో కొంతమంది సొంతంగా వెహికల్ కొనుగోలు చేయాలని చూస్తారు. అయితే ఫ్యామిలీకి అనుగుణంగా ఉండే వెహికల్ ఉంటే బాగుంటుందని అనుకునే వారు చాలామంది ఉన్నారు. ఇలాంటి వారి కోసం కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా ఫ్యామిలీకి ఉపయోగపడేలా కాళ్లు అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. వీటిలో ఒక కంపెనీకి చెందిన కారు ఫ్యామిలీ టూర్కు అనుగుణంగా ఉంటూ.. అత్యంత భద్రతను ఇస్తుంది. అంతేకాకుండా తక్కువ ధరలో ఇది అందుబాటులో ఉండడంతో చాలామంది దీని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇంతకీ ఆ కారు ఏదంటే?
Also Read : వేసవి ట్రిప్: హైదరాబాద్ కు తక్కువ దూరంలో ఉండే పర్యాటక ప్రదేశాలు ఇవే..
ఆటోమొబైల్ రంగంలో దేశంలో నెంబర్ వన్ పొజిషన్లో ఉన్న మారుతి కంపెనీకి ఢీకొట్టడానికి టాటా కంపెనీ నిత్యం ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఈ క్రమంలో మారుతి సుజుకి కంపెనీకి చెందిన నెంబర్ వన్ కారు వ్యాగన్ఆర్ కు గట్టి పోటీ ఇస్తుంది టాటా టియాగో. ప్రస్తుతం టాటా టియాగో అమ్మకాలు పుంజుకుంటున్నాయి.. ఈ కారు మార్కెట్లోకి వచ్చి 10 ఏళ్లు పూర్తి అయినా ఇంకా దీనిపై ఎవరికి మోజు తగ్గడం లేదు. ఇది ఒక హాచ్ బ్యాక్ కారు అయినప్పటికీ డిజైన్ తో పాటు సేఫ్టీలో ఎంతో బెటర్ అని చాలామంది భావిస్తున్నారు. అంతేకాకుండా అతి తక్కువ ధరలో ఇది అందుబాటులో ఉంటుంది.
టాటా టియాగో కారు ప్రస్తుతం మార్కెట్లో రూ 5 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. టాప్ ఎండ్ వేరియంట్ 8.45 లక్షలు గా ఉంది. ఈ కారులో 1.2 లీటర్ త్రీ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ ను కలిగి ఉంది. ఈ ఇంజన్ 86 bhp పవర్ తో 113NM టార్కును ఉత్పత్తి చేస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో పనిచేసే ఇందులో ఎల్ఈడి హెడ్ లాంప్స్, క్రూయిజ్ కంట్రోల్, హిల్ ఓల్డ్ కంట్రోల్ వంటి ఆప్షన్ లో ఉన్నాయి. అలాగే ఇందులో వైర్లెస్ ఆండ్రాయిడ్, ఆటో మరియు ఆపిల్ కార్ ప్లే తో కూడిన 10.26 టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం అమర్చి ఉంది.
ఈ కారు డిజైన్ పరంగానే కాకుండా సేఫ్టీ పరంగా కూడా అత్యద్భుతం అని చాలామంది అంటున్నారు. 2020లో నిర్వహించిన గ్లోబల్ క్రాస్ టెస్టింగ్ లో ఈ మోడల్ ఫోర్ స్టార్ రేటింగ్ పొందింది. పరిమాణంలో చిన్నదిగా కనిపించిన ఫ్యామిలీ మొత్తం కలిసి ఇందులో దూర ప్రయాణాలు చేసిన ఎటువంటి ఇబ్బంది ఉండదని ఆటోమొబైల్ రంగం నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా సొంతంగా కారు ఉండాలని అనుకునేవారు కొత్తగా కారు కొనాలని భావించేవారు టాటా టియాగో బెస్ట్ ఆప్షన్ అని పేర్కొంటున్నారు. ఇక ఈ కారు ఎలక్ట్రిక్ వేరియంట్ కూడా అందుబాటులో ఉంది.