Homeలైఫ్ స్టైల్Summer Heat Remedies: మండే ఎండల్లో వీటిని ఓ పట్టు పట్టండి.. శరీరానికి ఎంత మంచిదంటే..

Summer Heat Remedies: మండే ఎండల్లో వీటిని ఓ పట్టు పట్టండి.. శరీరానికి ఎంత మంచిదంటే..

Summer Heat Remedies: ఎండలు మండిపోతున్నాయి. బయటికి వెళ్లాలంటేనే జంకె పరిస్థితులు కనిపిస్తున్నాయి. అత్యవసరమై బయటికి వెళ్తే.. ఇంట్లోకి వచ్చేసరికి ఒళ్ళు మొత్తం పెనం మీద పెట్టినట్టు అవుతోంది. భరించలేని వేడి.. దానికి తగ్గట్టుగా ఉక్కపోత ఇబ్బంది పెడుతోంది. ఫ్రిడ్జ్ లో వాటర్ తాగితే ఆ చల్లదనం అప్పటి వరకే పరిమితమవుతోంది. కూలర్లను ఆశ్రయిస్తే ఒంట్లో వేడి తగ్గడం లేదు. ఏసీల కింద అదే పనిగా ఉంటే.. మరొక రకమైన సమస్య..

ఎండాకాలంలో కేవలం వేడి మాత్రమే కాదు.. అనేక రకాల సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. వేడి వల్ల శరీరంలో రకరకాల మార్పులు వస్తుంటాయి. చెమటకాయలు.. అరికాళ్ళు పగలడం.. మూత్రం పోస్తున్నప్పుడు మంట.. విపరీతంగా దాహం వేయడం.. ఏది కూడా తినాలి అనిపించకపోవడం.. వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి.

ఎండాకాలంలో దేహంలో ఉన్న వేడిని తగ్గించుకోవాలంటే చలువ పదార్థాలు తినాలి అంటారు. చలువ అంటే కృత్రిమంగా చేసిన పదార్థాలు కావు.. వాటి వల్ల శరీరానికి ఎటువంటి ప్రయోజనం లభించదు. ప్రకృతి ప్రసాదించిన చలవపదార్థాలు వేసవికాలంలో చాలనే లభిస్తాయి. ఇందులో ప్రధానమైనవి తాటి ముంజలు. ఇవి వేసవికాలంలో లభిస్తాయి. మార్చి నుంచి జూన్ వరకు అందుబాటులో ఉంటాయి. ఇవి లేతగా ఉన్నప్పుడు తింటే చాలా రుచిగా ఉంటాయి. ఇందులో విటమిన్స్, శరీరానికి చల్లదనాన్ని ఇచ్చే పదార్థాలు చాలా ఉంటాయి. అందువల్ల వీటిని తింటే శరీరానికి ఎంతో ప్రయోజనం ఉంటుంది..

తాటి ముంజల పై తొక్కలో విపరీతమైన ఫైబర్ ఉంటుంది. అది జీర్ణక్రియను పెంపొందిస్తుంది. తద్వారా గట్ హెల్త్ చాలా బాగుంటుంది. విటమిన్ కే రక్తం గడ్డ కట్టడానికి సహాయపడుతుంది. తాటి ముంజలలో ఉండే విటమిన్స్ మూత్రపిండాలు, కాలేయం, హృదయం వంటి వాటి పనితీరును మెరుగుపరుస్తాయి. శరీరంలో ఉన్న మలినాలను బయటికి పంపిస్తాయి..

అందువల్ల ఎండాకాలంలో విరివిగా లభించే తాటి ముంజలను ఎక్కువగా తినాలి. వీటిని తింటే పెద్దగా నష్టం కూడా ఉండదు. కాకపోతే మధుమేహం, రక్తపోటు వంటి వాటితో బాధపడేవారు వీటిని వైద్యుల సలహా మేరకు తీసుకోవాల్సి ఉంటుంది. తాటి ముంజలు లేతగా ఉన్నప్పుడు తింటేనే రుచిగా ఉంటాయి. ముదిరిపోతే తింటే కడుపునొప్పి.. ఇతర సమస్యలు వస్తుంటాయి. అందువల్లే తాటి ముంజలను తినేటప్పుడు జాగ్రత్తలు వహించాలి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version