https://oktelugu.com/

Sugar: అమ్మో షుగర్ ఎక్కువగా తింటే ఇంత ప్రమాదమా?

షుగర్ ఎక్కువగా తినడం వల్ల కేవలం మధుమేహం మాత్రమే కాకుండా.. వృద్ధాప్య ఛాయలు కూడా తొందరగా వస్తాయని నిపుణులు అంటున్నారు. ఇందులో గ్లైకేషన్ అనే ప్రక్రియ వల్ల చక్కెర మీ చర్మాన్ని దెబ్బతీస్తుంది. రక్త ప్రవాహంలో ఉండే చక్కెరలు ప్రొటీన్‌లకు అటాచ్ చేసి అడ్వాన్స్‌డ్ గ్లైకేషన్ ఎండ్ ప్రొడక్ట్స్ అని పిలిచే హానికరమైన రాడికల్‌లను ఉత్పత్తి చేస్తాయి. దీనివల్ల చర్మం తొందరగా దెబ్బతింటుంది.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 29, 2024 / 02:12 AM IST

    Sugar

    Follow us on

    Sugar: తీపి నోటికి రుచిని కలిగిస్తుందేమో.. కానీ ఆరోగ్యానికి అంత మంచిది కాదు. దీన్ని తినడం వల్ల బోలెడన్నీ అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తుంటారు. తీపిని అధికంగా తీసుకోవడం వల్ల మధుమేహం వస్తుందని నిపుణులు హెచ్చరిస్తుంటారు. అయిన కూడా కొందరు తీపి ఎక్కువగా తినడానికి ఇష్టపడతారు. అయితే షుగర్ ఎక్కువగా తినడం వల్ల కేవలం మధుమేహం మాత్రమే కాకుండా.. వృద్ధాప్య ఛాయలు కూడా తొందరగా వస్తాయని నిపుణులు అంటున్నారు. ఇందులో గ్లైకేషన్ అనే ప్రక్రియ వల్ల చక్కెర మీ చర్మాన్ని దెబ్బతీస్తుంది. రక్త ప్రవాహంలో ఉండే చక్కెరలు ప్రొటీన్‌లకు అటాచ్ చేసి అడ్వాన్స్‌డ్ గ్లైకేషన్ ఎండ్ ప్రొడక్ట్స్ అని పిలిచే హానికరమైన రాడికల్‌లను ఉత్పత్తి చేస్తాయి. దీనివల్ల చర్మం తొందరగా దెబ్బతింటుంది. గ్లైకేషన్ ప్రక్రియ చర్మంపై ఉండే కొల్లాజెన్, ఎలాస్టిన్‌లను పూర్తిగా దెబ్బతీస్తుంది. దీనివల్ల చర్మంపై తొందరగా ముడతలు వస్తాయి. అయితే ఈ కొల్లాజెన్‌లో కూడా మూడు రకాలు ఉంటాయి. టైప్ 1, టైప్ 2, టైప్ 3 అనేవి ఉంటాయి. ఇవి చర్మాన్నే కాకుండా శరీరాన్ని కూడా పూర్తిగా బలహీనంగా చేస్తాయి.

    చక్కెర అధికంగా తీసుకోవడం వల్ల మీకు తెలియకుండానే చర్మ రంగు మారుతుంది. అలాగే చర్మంపై ఎక్కువగా పగుళ్లు రావడం, ముడతలు రావడం వంటివి చేస్తాయి. చక్కెర అధికంగా తీసుకుంటే స్థితిస్థాపకతను కోల్పోతారు. దీంతో చర్మ సంబంధిత సమస్యలు అన్ని పెరుగుతాయి. అలాగే చక్కెర వల్ల ఒత్తిడి పెరుగుతుంది. దీంతో గుండె పోటు కూడా వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ చక్కెర వల్ల కొన్నిసార్లు కాలేయం కూడా దెబ్బ తింటుంది. అయితే కేవలం చక్కెర అనే కాకుండా వాటితో ప్రాసెస్ చేసిన పదార్థాలను కూడా తీసుకోకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇవి రక్తంలో చక్కెర వేగాన్ని తొందరగా పెంచుతాయి. దీంతో మీ రక్తంలో చక్కెర స్థాయిలు తొందరగా పెరుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

    చక్కెరను అధికంగా తీసుకోవడం వల్ల దంత క్షయం కూడా వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొందరు ఆహారం తిన్న తర్వాత తీపిగా ఉండే స్వీట్లు తింటారు. వీటివల్ల నోటిలో బ్యాక్టీరియా ఏర్పడుతుంది. దీనివల్ల దంతక్షయం వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే చక్కెరను చాలా తక్కువ మోతాదులో మాత్రమే తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మోతాదుకి మించి చక్కెరను అధికంగా తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చక్కెర కంటే బెల్లం ఇంకా తినడం ఆరోగ్యానికి మంచిది. బెల్లాన్ని తీసుకోవడం వల్ల మధుమేహం రాకుండా ఉండటంతో పాటు ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి చక్కెర కాకుండా బెల్లం వినియోగాన్ని పెంచడం ముఖ్యం.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.