https://oktelugu.com/

Stress: ఒత్తిడికి గురైతే స్వీట్లు తినాలనిపిస్తుంది? ఎందుకో మీకు తెలుసా?

ఎక్కువ శాతం మంది బాగా ఒత్తిడికి గురైతే కొన్ని పదార్థాలను తింటారు. అందులో ముఖ్యంగా స్వీట్లు తింటారు. సాధారణంగా వీటిని తినడానికి ఇష్టపెట్టుకోరు. కానీ బాగా ఒత్తిడికి గురైతే మాత్రం తప్పకుండా తింటారు. అసలు ఒత్తిడికి గురైతే ఎందుకు స్వీట్లు తింటారు? దీనికి గల కారణం ఏంటో తెలియాలంటే స్టోరీ మొత్తం చదివేయండి.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 14, 2024 / 02:02 AM IST

    Eating Sweets

    Follow us on

    Stress: స్వీట్లు తినడం అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. ఎవరో కొందరు లావు అవుతారని భావించి స్వీట్లు పెద్దగా తినరు. అంతే కానీ సాధారణంగా అందరూ కూడా స్వీట్లు తింటారు. అయితే వీటిలో ఉండే షుగర్ వల్ల కొందరు వీటిని తినడానికి పెద్దగా ఇష్టపెట్టుకోరు. ఇదంతా పక్కన పెడితే ఈ రోజుల్లో చాలా మంది చిన్న విషయాలకు ఎక్కువగా ఆలోచించి ఒత్తిడికి లోనవుతున్నారు. ఏదైనా చిన్న సమస్య వస్తే చాలు.. ఇక పెద్దగా ఆలోచించి ఆందోళన చెంది డిప్రెషన్‌లోకి వెళ్తున్నారు. అయితే కొందరు బాగా ఒత్తిడితో ఉంటే కొన్ని ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం లేకపోతే పూర్తిగా తినడం మానేస్తారు. ఎక్కువ శాతం మంది బాగా ఒత్తిడికి గురైతే కొన్ని పదార్థాలను తింటారు. అందులో ముఖ్యంగా స్వీట్లు తింటారు. సాధారణంగా వీటిని తినడానికి ఇష్టపెట్టుకోరు. కానీ బాగా ఒత్తిడికి గురైతే మాత్రం తప్పకుండా తింటారు. అసలు ఒత్తిడికి గురైతే ఎందుకు స్వీట్లు తింటారు? దీనికి గల కారణం ఏంటో తెలియాలంటే స్టోరీ మొత్తం చదివేయండి.

     

    ఒత్తిడి అనేది తప్పకుండా ప్రతీ ఒక్కరూ కూడా రుచి చూస్తారు. ఏదో ఒక సమయంలో ఒత్తిడికి గురవుతుంటారు. అయితే ఒత్తిడికి గురైనప్పుడు కార్డినల్ హార్మోన్ విడుదల అవుతుంది. ఇది శరీరంలో కొవ్వును, కార్బోహైడ్రేట్ జీవక్రియను ప్రేరేపిస్తుంది. దీంతో ఎక్కువగా తీపి పదార్థాలు తినాలనిపిస్తాయి. అయితే ఈ అలవాటు ఎక్కువగా ఉండటం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే షుగర్ అసలు ఆరోగ్యానికి మంచిది కాదు. వీటివల్ల డయాబెటిస్ రావడంతో బరువు కూడా పెరుగుతారు. అలాగే కొన్ని రకాల అనారోగ్య సమస్యలు కూడా వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఈ అలవాటు ఎక్కువ రోజులు ఉండకుండా ఈ సమస్య నుంచి బయటకు రావాలని నిపుణులు సూచిస్తున్నారు. ఒత్తిడితో ఉన్నప్పుడు స్వీట్ తినాలనిపించిన కూడా తినవద్దని సూచిస్తున్నారు. అలా ఉండలేకపోతే ఒత్తిడికి గురికాకుండా ఉండాలని నిపుణులు అంటున్నారు.

     

    ఆహారం, నిద్ర లేకపోయిన కూడా కొందరు ఒత్తిడికి గురి అవుతుంటారు. ఇలా కాకుండా ఉండాలంటే ఒత్తిడి నుంచి విముక్తి పొందేందుకు కొన్ని చిట్కాలు పాటించాలి. ఎలాంటి ఒత్తిడి లేకుండా ఉండాలంటే చిన్న విషయాలకు ఎక్కువగా ఆలోచించకూడదు. అలాగే యోగా, మెడిటేషన్ వంటివి చేస్తుండాలి. వీటితో పాటు వ్యాయామం, రన్నింగ్ వంటివి చేయడం వల్ల కాస్త ఒత్తిడి నుంచి విముక్తి పొందవచ్చు. అయితే ఇవి చేసే సమయం లేకపోతే ఎక్కువగా పుస్తకాలు చదవడం, మీకు నచ్చిన కామెడీ సీన్స్ చూడటం వంటివి చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే పోషకాలు ఉండే ఫుడ్ ఎక్కువగా తీసుకోవడంతో పాటు బాడీకి సరిపడా నిద్రపోవాలి. అప్పుడే ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఒత్తిడికి గురికాకుండా ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి తప్పకుండా ఈ నియమాలు పాటిస్తూ ఒత్తిడి నుంచి విముక్తి పొందండి.

     

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.