Stomach Issues: ప్రస్తుతం రోజుల్లో చాలా మంది జీర్ణ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. భోజనం చేసిన తర్వాత వ్యాయామం చేయకపోవడం వంటి కారణాల వల్ల చాలా మంది జీర్ణ సమస్యల(Digest Issues) బారిన పడుతున్నారు. ఈ సమస్యలు వస్తే ఎక్కువగా ఇబ్బంది పడతారు. ఏ ఫుడ్ తిన్నా కూడా జీర్ణం కాదు. వాంతులు అవుతాయి. కడుపు నొప్పి(Stomach Issues) వంటివి వస్తుంటాయి. అయితే ఈ సమస్య నుంచి విముక్తి చెందాలంటే మన వంటింట్లో ఉండే జాజికాయ బాగా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. జాజికాయలో(Nutmeg) ఉండే పోషకాలు వెంటనే జీర్ణ సమస్యలను తగ్గిస్తాయని నిపుణులు అంటున్నారు. రెగ్యులర్ డైట్‌లో వీటిని తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అయితే కొందరికి వీటిని తినడం నచ్చదు. కానీ ఈ సమస్యలు ఉన్నవారు ఏదో విధంగా జాజికాయను తినడం వల్ల కడుపు సమస్యలన్నింటి నుంచి కూడా విముక్తి పొందుతారని నిపుణులు చెబుతున్నారు. జాజికాయలోని పోషకాలు కీళ్ల సమస్యలను తగ్గించడంతో పాటు లైంగిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి. చాలా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి జాజికాయ ఇక దివ్యౌషధంగా చెప్పవచ్చు.
జీర్ణ సమస్యలు వస్తే కొందరు వాటిని లైట్ తీసుకుంటున్నారు. దీంతో పేగు ఆరోగ్యం దెబ్బతింటుంది. అలాంటి వారు ఆరోగ్యంగా ఉండాలంటే జాజికాయను తినాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు అపానవాయువు, కడుపు ఉబ్బరం, గ్యాస్, అతిసారం వంటి సమస్యలు అన్నింటిని కూడా క్లియర్ చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఉదయం పూట ఖాళీ కడుపుతో జాజికాయను తినడం లేదా పొడి చేసుకుని వాటర్‌లో కలిపి తాగడం వల్ల జీర్ణ సమస్యలు అన్ని కూడా క్లియర్ అవుతాయి. కిందరు ఆకలి సమస్యలతో కూడా ఇబ్బంది పడుతుంటారు. ఎన్ని రోజులు తినకపోయిన కూడా వీరికి ఆకలి వేయదు. అలాంటి వారు డైలీ జాజికాయను తినడం వల్ల ఆకలి వేస్తుంది. ఇవే కాకుండా డయేరియా సమస్యలను తగ్గించడంలో కూడా జాజికాయ బాగా ఉపయోగపడుతుంది. ఇందులోని యాంటీ మైక్రోబయల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు డయేరియాను తగ్గిస్తాయి. అలాగే ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా చేస్తాయి. మానసిక ఒత్తిడి, జలుబు, దగ్గు సమస్యల నుంచి కూడా విముక్తి కలుగుతుందని నిపుణులు అంటున్నారు.
కొందరు మలబద్ధకం సమస్యతో బాధపడుతుంటారు. ఇలాంటి వారు జాజికాయను తినడం లేదా వాటర్ తాగడం వల్ల తొందరగా ఉపశమనం కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే క్యాన్సర్, మూత్రపిండాలు, గుండె సమస్యలను కూడా జాజికాయ తగ్గిస్తుందని నిపుణులు అంటున్నారు. బరువుగా ఉన్నవారు తగ్గడానికి కూడా దీన్ని వాడవచ్చు. ఈజీగా బరువు తగ్గడంతో పాటు ఆరోగ్యంగా కూడా ఉంటారు. కొందరికి కడుపులో నులి పురుగులు అయిపోతాయి. అలాంటి వారు వీటిని తినడం వల్ల వెంటనే ఆ సమస్య క్లియర్ అవుతుంది. మళ్లీ నులి పురుగుల సమస్య ఉండదు. కాబట్టి డైలీ లైఫ్‌లో ఈ జాజికాయను తినడం అలవాటు చేసుకోవడం ఉత్తమం.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. వీటిని పాటించే ముందు తప్పకుండా వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.