Breakfast: చదువుల్లో రాణించాలని విద్యార్థులు.. డబ్బు సంపాదించాలని ఉద్యోగులు.. నేటి కాలంలో నిత్యం బిజీ లైఫ్ తో గడుపుతున్నారు. ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి పొద్దు పోయే వరకు తమ పనులతోనే గడుపుతున్నారు. ఈ తరుణంలో ఆరోగ్యం గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. ఫలితంగా చిన్న వయసులోనే పిల్లలకు.. వయసు పూర్తి కాకముందే ఉద్యోగులు తీవ్ర అనారోగ్యం పాలవుతున్నారు. ముఖ్యంగా ఆహారం తీసుకోవడలో క్రమపద్ధతి లేకపోవడంతో కొత్త కొత్త రోగాలను కొని తెచ్చుకుంటున్నారు. ఉదయం లేవగానే ప్రెషప్ అయిన తరువాత చాలా మంది టీ తాగుతూ ఉంటారు. రోజంతా లైఫ్ ఉల్లాసంగా ఉండడానికి టీ మంచి పానీయం అని భావిస్తారు. కానీ టీ తాగే కంటే ముందే టిఫిన్ కచ్చితంగా చేయాలని కొందరు ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అలా చేయకపోతే ఏం జరుగుతుందో తెలుసా?
ఉదయం లేవగానే కొంత మందికి టీ తాగడం అలవాటు. మరికొందరు బెడ్ పైనే కాఫీ తాగేస్తుంటారు. ఇలా చేయడం వల్ల రోజంతా ఉల్లాసంగా ఉంటామని అనుకుంటారు. కానీ పరగడుపున టీ లేదా కాఫీ తాగడం వల్ల అనేక వ్యాధులు సంక్రమిస్తాయి. ముందుగా జీర్ణ సమస్యలు మొదలవుతాయి. టీ లో ఉండే పదార్థం ముందుగానే జీర్ణం కాకుండా వ్యవస్థను పాడు చేస్తుంది. ఆ తరువాత ఎటువంటి ఆహారం తీసుకున్నా సమస్య వస్తుంది. అందువల్ల ముందుగా బ్రేక్ ఫాస్ట్ చేసిన తరువాత టీ తీసుకుంటే మంచిది.
ఇక ఆరోగ్యం పేరిట చాలా మంది తృణ ధాన్యాలు తినడం ఈమధ్య ప్రారంభించారు. అయితే ఇవి వైద్యుల సలహా మేరకే తీసుకోవాలి. కొందరు వీటిని వేయించి తీసుకుంటున్నారు. మార్నింగ్ ఇలాంటి వేపుడు తినడం వల్ల కడుపు లో మంట లాంటి సమస్యలు వస్తాయి. క్రమంగా ఎసిడీటీ ఏర్పడుతుంది. ఆ తరువాత కొన్ని ప్రత్యేక ఆహారాలను పూర్తిగా మానేయాల్సి వస్తుంది. అందువల్ల పొద్దున్నే వేపుడు జోలికి వెళ్లకుండా సాఫ్ట్ గా ఉండే టిఫిన్స్ మాత్రమే ఆరగించాలి. దీంతో స్టమక్ క్లియర్ గా ఉండి ఆ తరువాత ఎటువంటి ఆహారం తీసుకున్నా సమస్య రాదు.
టిఫిన్ తినమన్నారుగా.. అని కొందరు రెండు, మూడు ప్లేట్లు ఆరగిస్తారు. ఇలా చేయడమూ కరెక్ట్ కాదు. కాస్త ఎనర్జీ కోసం లైట్ ఫుడ్ మాత్రమే తీసుకోవాలి. ఇప్పటికే అజీర్తి సమస్యలు ఉన్నవారు ఇడ్లీ లాంటివి మాత్రమే తీసుకోవడం బెటర్. డైజేషన్ సమస్య మరీ ఎక్కువగా ఉన్నవాళ్లు జ్యూస్ లాంటివి తీసుకోవాలి. ఇలా ఏ రకంగానైనా సాఫ్ట్ ఫుడ్ ను ఉదయం కచ్చితంగా తీసుకోవాలి. అలా కాకుండా ఒకేసారి మధ్యాహ్నం ఎక్కువ అన్నం తీసుకుంటామంటే కొత్త రకమైన ఆరోగ్యసమస్యలు తెచ్చుకున్నవారవుతారు.