https://oktelugu.com/

Hyundai India: హైదరాబాద్ లో హ్యుందాయ్.. ఈవీల వృద్ధే లక్ష్యం..

భారత మార్కెట్లలో హైదరాబాద్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని ఇక్కడ హ్యుందాయ్-కియా నమ్యాంగ్ ఆర్ అండ్ డీ సెంటర్ తో కలిసి టెస్టింగ్ సదుపాయాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు.

Written By:
  • Srinivas
  • , Updated On : August 9, 2023 / 10:40 AM IST

    Hyundai India

    Follow us on

    Hyundai India: భారత దేశంలో కార్ల వినియోగదారులు రోజురోజుకు పెరిగిపోతున్నారు. ఇందుకు అనుగునంగా ఆటోమోబైల్ మార్కెట్లో కొత్త మోడళ్లను తీసుకొచ్చేందుకు కంపెనీలు సిద్ధమవుతున్నాయి. దక్షిణ కొరియా కు చెందిన హ్యుందాయ్ కంపెనీ త్వరలో భారత్ లో కార్ల పరిశ్రమలను నెలకొల్పేందుకు రెడీ అవుతోంది. భవిష్యత్ అంతా ఈవీ దే మార్కెట్. దీంతో 2032 నాటికి దేశీయంగా 5 కొత్త ఈవీలను ప్రవేశపెట్టాలని చూస్తోంది. వచ్చే 10 ఏళ్లలో రూ20 వేల కోట్లకు పైగా పెట్టుబడి చేయనున్నట్లు గత మే నెలలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా హైదరాబాద్ లో హ్యుందాయ్ మోటార్ ఇంజనీరింగ్ తో పాటు చెన్నైలో తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు.

    కార్ల వినియోగదారులు ఎక్కువ శాతం ఎస్ యూవీలను కోరుకుంటున్నారు. ఇదే సమయంలో ఈవీలను వృద్ధి చేయాలని హ్యుందాయ్ లక్ష్యంగా పెట్టుకుంది. వచ్చే నాలుగేళ్లలో ఈవీ చార్జింగ్ సెంటర్ల సంఖ్య 439 ని ఏర్పాటు చేయనున్నారు. భారత కార్ల పరిశ్రమ 2030 నాటికి 50 లక్షల యూనియట్లు దాటే అవకాశం ఉంది. ఇందులో 48 శాతం ఎస్ యూవీలదే కాగా మిగతా 10 శాతం ఎలక్ట్రిక్ వెహికిల్స్ చేర్చనున్నారు. 2022-23 సంవత్సరంలో అన్ని కంపెనీలు కలిసి 48,104 యూనిట్ల ఈవీలను విక్రయించారు. ఇవి ప్రతీ ఏడాది పెరిగే అవకాశం ఉంది.

    భారత మార్కెట్లలో హైదరాబాద్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని ఇక్కడ హ్యుందాయ్-కియా నమ్యాంగ్ ఆర్ అండ్ డీ సెంటర్ తో కలిసి టెస్టింగ్ సదుపాయాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఈ మేరకు హ్యుందాయ్ మోటార్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ యూసన్ ఛంగ్ భారత పర్యటనలో భాగంగా హైదరాబాద్ లోని హ్యుందాయ్ సెంటర్ ను సందర్శించారు. ఎస్ యూవీలతో పాటు ఈవీ మోడళ్లను విస్తరించడమే లక్ష్యంగా పెట్టుకోవాలని ఆయన వివరించారు.

    హ్యూందాయ్ గ్రూప్ లో భాగమైన కియా 2025 నుంచి మినీ ఈవీలను ఉత్పత్తి చేయనుంది. ప్రస్తుతం ఉన్న 300 షో రూంలను రెండింతలు చేయనుంది. కొత్త మోడళ్ల పరిచయం, కస్టమైస్డ్ వెహికిల్స్ ను అందించి వినియోగదారులను ఆకట్టుకోనుంది. ఇప్పుడు హ్యూందాయ్ తో కలిసి ఈవీలను అభివృద్ధి చేయడంలో ముందడుగు వేస్తోంది. అనుకున్నట్లే జరిగితే భారత్ లో 2030 నాటికి ఈ వీలు వృద్ది చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చర్చ సాగుతోంది.