Son Doong : మనకు అజంతా గుహలు తెలుసు. ఎల్లోరా గుహలు తెలుసు.. ఎప్పుడైనా సన్ డుంగ్ కేవ్స్ గురించి విన్నారా? పోనీ ఎప్పుడైనా డిస్కవరీ ఛానల్ లో చూశారా? తెలియదంటారా… అయితే మేం చెప్తాం చదవండి.. ఈ ప్రకృతి మనకు చాలా ఇచ్చింది. ఇస్తూనే ఉంది. అందుకే మన జీవితం ఇంత సుఖమయంగా సాగుతోంది. మనం ప్రకృతి మీద పెత్తనం చలాయిస్తున్నాం కాబట్టే అప్పుడప్పుడు తన ప్రకోపాన్ని మన మీద చూపుతున్నది.. ఇక ఈ జగత్తులో మనకు తెలియని ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. కొన్ని వెలుగులోకి వస్తే… వెలుగులోకి రానివి చాలా ఉన్నాయి.. అలా వెలుగులోకి వచ్చిందే సన్ డూంగ్ కేవ్. ఇది వియత్నాంలో ఉంది. సాధారణంగా గుహలు అంటే అజంతా, ఎల్లోరా, బొర్రా వరకే మనకు తెలుసు. కానీ సన్ డూంగ్ కేవ్ అంటే ఏమిటి? అసలు ఇందులో ప్రత్యేకత ఏమిటి అంటే…

ఇది ప్రపంచంలోనే అతి పొడవైన గుహ. ఇందులో నదులు, కొండలు, చెట్లు, జీవరాశులు వంటివి ఉంటాయి. వియత్నాం సరిహద్దులోని లావోస్ ప్రాంతంలో ఉంది . దీనిలో పెద్దదైన భూగర్భ నది ఉంది.. ఇది సున్నపు రాయితో తయారయింది.. దీనిని 1991లో హో ఖాన్ అనే వ్యక్తి కనుగొన్నాడు. ఇందులో నది ప్రవాహాల ఉధృతి ఉండడం వల్ల అందులోకి వెళ్ళేందుకు స్థానికులు భయపడేవారు.. 2009లో బ్రిటిష్ కేవ్ రీసెర్చ్ అసోసియేషన్ నుంచి వచ్చిన శాస్త్రవేత్తల బృందం ఈ గుహను సందర్శించింది. అప్పటినుంచి ఇది అంతర్జాతీయ ఖ్యాతి ఆర్జించింది.. 2009 ఏప్రిల్ 10 నుంచి 14 మధ్య ఫోంగ్ న్హ _కే బెంగ్ లో ఒక నిర్వహించారు. వారు 60 మీటర్ల ఎత్తు గల కాల్ సైట్ గోడను చూశారు. ఈ గోడను గ్రేట్ వాల్ ఆఫ్ వియత్నాంగా నిర్ధారించారు.. అప్పటినుంచి దానిని ఆ పేరుతో పిలవడం ప్రారంభించారు.
వారు చేసిన సర్వేలో ఆ గోడ ఐదు కిలోమీటర్ల పొడవు, 650 అడుగుల ఎత్తు, 490 అడుగుల వెడల్పు ఉందని తేలింది. అంతేకాదు ఇప్పటివరకు పొడవైన గుహగా పేరుపొందిన మలేషియాలోని డీర్ కేవ్ ను పక్కనపెట్టి ప్రపంచ ప్రసిద్ధిగాంచింది. ఈ గుహను వియత్నాంలో గుర్తించిన ఫొంగ్ గుహ కంటే ఐదురెట్లు పెద్దది.. అన్నింటికీ మించి ఈ గుహలో అతిపెద్ద చాంబర్ 5 కిలోమీటర్ల పొడవు ఉంది.. 200 మీటర్ల ఎత్తు ఉంది.. 150 మీటర్ల వెడల్పు కలిగి ఉంది..ఈ కొలతలతో ఇది మలేషియాలోని అతి పెద్ద గుహగా గుర్తింపు పొందిన డీర్ కేవ్ ను సులభంగా అధిగమించింది.. అంతేకాదు ప్రపంచంలోనే అతి పెద్ద గుహగా నిలిచింది..

ఇక ఈ గుహను 2009 నుంచి వివిధ దేశాల వారు అధ్యయనం చేస్తూనే ఉన్నారు.. అయితే దీని పొడవు ఇంకా పూర్తిగా తెలియ రాలేదు.. మామూలు విషయం కాదు.. సూర్యకాంతి కేవలం మందు బాగానే పడుతుంది. తర్వాత మొత్తం చిమ్మ చీకటి. లోపల పెద్ద పెద్ద కొండలు 40 అడుగుల ఎత్తున ఉంటాయి. అడుగుభాగం మొత్తం ఒక నది ప్రవహిస్తూ ఉంటుంది.. అందులో వివిధ రకాల జలచరాలు ఉంటాయి.. కొన్ని ప్రాణాంతకమైనవి కూడా ఉంటాయి.. ప్రాణాలకు తెగించే సాహసకిలు తాళ్ళు, టార్చ్ లైట్ ల ఆధారంగా లోపలికి వెళ్తారు. అయితే కొందరు ఊపిరి ఆడక కన్నుమూశారని సమాచారం.. అయితే ఎంతమంది చనిపోయారని వివరాలు బయటకు తెలియకపోయినప్పటికీ… అడ్వెంచర్ ను కోరుకునే వాళ్లకు ఈ గుహ ఒక బెస్ట్ ఆప్షన్. ఈ గుహ వెలుగులోకి రావడంతో వియత్నాం పర్యాటక ప్రాంతంగా భాసిల్లుతోంది.