cab drivers : కొందరు cab Driverలు ఇలా చేస్తారు జాగ్రత్త.. అలెర్ట్ గా ఉండండి
ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ Cab వాడుకుంటున్నారు. ముఖ్యంగా సిటీల్లో దూర ప్రయాణాలు చేయాలంటే క్యాబ్ అనుగుణంగా ఉంటుంది. కార్యాలయాలకు వెళ్లేవారు ప్రతిరోజూ క్యాబ్ బుక్ చేసుకుంటారు. క్యాబ్ లోప్రయాణం చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఆన్ లైన్ లో క్యాబ్ ను బుక్ చేసుకునే సౌకర్యం ఉంటుంది. ఎప్పుడు.. ఎక్కడికి కావాలంటే అక్కడికి క్యాబ్ వస్తుంది. క్యాబ్ ల వల్ల అనేకమంది ఉపాధి పొందుతున్నారు. కొన్ని కంపెనీలో పోటీ పడి కస్టమర్లకు తమ సేవలను అందిస్తూ ఆకర్షిస్తున్నారు. అయితే కొందరు డ్రైవర్లు మాత్రం ఇదే అదునుగా ప్రయాణికుల నుంచి అందినంత దోచుకుంటున్నారు. వారికి తెలియకుండా అదనంగా బిల్లులు వేసి ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారు. అదెలాగంటే?
cab drivers : Cabలో ప్రయాణం చేసేముందు దీనిపై అవగాహన ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కొందరు డ్రైవర్లు ఇష్టమొచ్చినట్లు ఛార్జీలు వసూలు చేస్తారు. వాస్తవానికి క్యాబ్ ను బుక్ చేసుకునే ముందే ఎంత దూరం ప్రయాణించాలని అనుకుంటున్నారో.. ఆ దూరానికి సంబంధించిన ఛార్జీలు ముందే డిస్ ప్లే అవుతాయి. దీనిని బట్టే ప్రయాణికులు క్యాబ్ ను బుక్ చేసుకుంటారు. అయితే యాప్ లో చూపించిన ఛార్జీలకు అదనంగా పార్కింగ్, ఓ ఆర్ఆర్ టోల్ చార్జీల పేరిట వసూలు చేస్తుంటారు. అయితే ఈ ఛార్జీలు కలిపి ముందే ఛార్జీలు ఉంటాయి. కానీ వీటిని అదనంగా వసూలు చేస్తారు. ఎలాగంటే?
ఉదాహరణకు ఒక వ్యక్తి హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్టు నుంచి తన నివాసానికి చేరుకోవడానికి Cab బుక్ చేసుకున్నారు. ఈ దూర ప్రయాణానికి ఛార్జలు రూ. 1,000 అయింది. ఈ ఛార్జీలు బుక్ చేసుకునే ముందే చూపించింది. కానీ ప్రయాణం పూర్తి అయిన తరువాత వీటికి Parking Fees రూ.250, Toll Charge రూ. 70 రూపాయలు అదనంగా వేస్తున్నారు. అంటే మొత్తం రూ.1,320 వసూలు చేస్తున్నారు.
వాస్తవానికి Cab బుక్ చేసుకునే ముందు చూపించిన ఛార్జీల్లోనే ఇవి Include అయి ఉంటాయి. కానీ కొందరు Cab డ్రైర్లు అదనంగా వీటిని వసూలు చేస్తారు.అయితే ఈ ఛార్జీలు అస్సలు చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ విషయంలో డ్రైవర్లు గొడవ పడితే సదరు కంపెనీకి కంప్లయింట్ బుక్ చేయొచ్చు. లేదా 1800114000 కాల్ చేయొచ్చు. అయితే దీనిపై అవగాహన లేకపోతే ఎన్నో ప్రయాణాల్లో అదనంగా ఛార్జీలు చెల్లించి భారీగా నష్టపోతుంటారు. ముఖ్యంగా రెగ్యులర్ గా కార్యాలయాలకు వెళ్లేవారు, ఇతర ప్రయాణాల చేసేవారు దీనిపై కచ్చితంగా అవగాహన ఉండాలి.
క్యాబ్ లో ప్రయాణించడం చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. కంపెనీలు సైతం కొన్ని సమయాల్లో ఆఫర్లు అందించి ప్రయాణికుల నుంచి తక్కువ మొత్తంలో వసూలు చేయడానికి సహకరిస్తారు. కానీ కొందరు డ్రైవర్లు మాత్రం ఈ విషయంలో వేరే విధంగా ఆలోచిస్తారు. అయితే క్యాబ్ లో ప్రయాణం చేసే ముందు ఛార్జీల విషయంలోనే కాకుండా భద్రత విషయంలో కేర్ తీసుకోవాలి. ఎక్కువగా క్యాబ్ లో పర్సనల్ విషయాలు మాట్లాడకుండా ఉండాలి. కుటుంబ సభ్యులకు సంబంధించిన విషయాలు చర్చించకుండా ఉండాలి.