Homeలైఫ్ స్టైల్Solo Brathuke So Better: సోలో బతుకే సోబెటరు.. ఒంటరిగా మిగిలిపొతున్న మహిళలు!

Solo Brathuke So Better: సోలో బతుకే సోబెటరు.. ఒంటరిగా మిగిలిపొతున్న మహిళలు!

Solo Brathuke So Better: దేశంలో ఒంటరి మహిళల సంఖ్య పెరుగుతోంది. అనుభవం నేర్పిన పాఠాలు, సమాజం పోకడలు, వినకూడని, కనకూడని సంఘటనలు తెలిశాక, కుటుంబ సభ్యులే ఎదుర్కొంటున్న సమస్యలు.. కలహాల కాపురాలు, జైలు జీవితాలు, వరకట్నపు వేధింపులు, అనుమానాలు, వివాహేతర సంబంధాలు, హత్యలు తెలిశాక వైవాహిక జీవితంపై విరక్తి చెందుతున్నారు. తెలిసీ తెలియని వయసు నుంచి కట్టుకున్న పెళ్లి అనే కలల సౌధం కూలిపోతోంది. దీంతో ఇక సోలో బతుకే సో బెటర్‌ అనుకుంటున్నారు. ఇలా నేటి సమాజంలో పెళ్లి చేసుకోవడం కంటే.. ఒంటరిగా ఉండటమే నయమనుకుంటున్నారు. ఇటీవల ప్రభుత్వ సర్వేలో ఈ విషయమే తేలింది.

Solo Brathuke So Better
Single Women

పెరుగుతున్న ఒంటరి జీవులు..

స్టాటిస్టిక్స్‌ అండ్‌ ప్రోగ్రాం ఇంప్లిమెంటేషన్‌ మంత్రిత్వ శాఖ జూలైలో విడుదల చేసిన ‘యూత్‌ ఇన్‌ ఇండియా 2022’ రిపోర్టులో అన్ని వయసుల వారిలోనూ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండే స్త్రీ పురుషుల సంఖ్య పెరుగుతోందని వెల్లడైంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే 25–29 సంవత్సరాల వయసులో ఉన్నవారు కూడా పెళ్లి చేసుకోవడానికి ముందుకు రావట్లేదు. 2011–2019 మధ్య అవివాహిత మహిళల శాతం దాదాపు రెండింతలు పెరిగింది. పురుషుల్లో 12 శాతం పెరిగిందని ఈ సర్వే తెలిపింది. ఈ ఏడాది మార్చిలో విడుదలైన ‘శాంపిల్‌ రిజిస్ట్రేషన్‌ సర్వే రిపోర్ట్‌ 2019’ ప్రకారం దేశంలో ఒంటరి పురుషులు కేవలం 1.5 శాతం ఉండగా ఒంటరి మహిళలు 5.2 శాతం ఉన్నారు. ఒంటరి మహిళలు అంటే విడాకులు తీసుకున్నవారు భర్త చనిపోయినవారు లేదా పెళ్లయి వేరుగా ఉన్నవారు.

కేరళ, తమిళనాడు టాప్‌..

రాష్ట్రాల ప్రకారం చూస్తే ఒంటరి మహిళల శాతం కేరళ తమిళనాడు రాఫ్రష్టాలు ముందు వరుసలో ఉన్నాయి. కేరళలో 9.2 శాతం, తమిళనాడులో 8.9 శాతం మంది ఒంటరి మహిళలు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌ తెలంగాణలలో 7.6, 7.0 శాతాలుగా నమోదైంది. దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ ఒంటరిగా ఉన్న పురుషుల సంఖ్య కన్నా మహిళల సంఖ్యే ఎక్కువగా ఉంది.

కారణాలు అనేకం..

మహిళలు ఒంటరిగా ఉండాలనుకోవడానికి కారణాలు చాలా ఉన్నాయని మానసిక నిపుణులు చెబుతున్నారు. లవ్‌ మ్యారేజ్‌ అయినా.. అరేంజ్డ్‌ మ్యారేజ్‌ అయినా స్త్రీలకు ఎన్నో ఆంక్షలు పరిమితులు ఉండటం వల్లే వాళ్లు వివాహ బంధానికి నో అంటున్నారని తెలిపారు. ఇష్టం లేకపోయినా పిల్లల్ని కనడం వాళ్ల బాధ్యతలను స్త్రీలు మాత్రమే నెత్తిన వేసుకోవడం పర్సనల్‌ స్పేస్‌ లేకపోవడం వంటి కారణాలతో కూడా కొందరు పెళ్లంటే భయపడుతున్నారని చెప్పారు. అయితే కొందరు మాత్రం తమకు నచ్చిన వాడు తమ మనసును అర్థం చేసుకుని ఆడవాళ్లని మనుషులుగా గౌరవించే వాళ్లు దొరికితే తప్పకుండా పెళ్లి చేసుకుంటామంటున్నారు. కానీ ఈ సమాజ పోకడ తమపై రుద్దే వాళ్లు మాత్రం తమకు వద్దని గంటాపథంగా చెబుతున్నారు. తమ ముందు తరం ఆడవాళ్లు చాలా నష్టపోయారని.. పరువు కోసం తల్లిదండ్రుల కోసం కుటుంబం కోసం కష్టాలు పడుతూ నచ్చని పనిని చేస్తూ తమ జీవితాన్ని నరకం చేసుకుని బతికున్న శవాల్లా గడిపారని.. తాము మాత్రం అలా ఉండబోమని చెబుతున్నారు.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
RELATED ARTICLES

Most Popular