Jabardast New Anchor: ఈటీవీలో ప్రసారమయ్యే వినోదాత్మక కార్యక్రమాల్లో జబర్దస్త్ ఒకటి.. అప్పటి వరకూ సీరియల్స్‌తో బోర్ కొట్టిన ప్రేక్షకులకు.. బుల్లితెరపై వినోద కార్యక్రమాలకు మూలంగా నిలిచింది. జబర్దస్త్. హాయిగా నవ్వుకునేలా సుదీర్ఘంగా ప్రసారమవుతున్న ఈ కార్యక్రమానికి యాంకర్ అనసూయ ఇటీవలే గుడ్‌బై చెప్పింది. ఆమె స్థానంలో మల్లెమాల ప్రొడక్షన్స్ కొత్త యాంకర్‌ను తీసుకొస్తోంది. రాబోయే యాకంర్ వీడియోను రిలీజ చేసి వీక్షకుల్లో ఆసక్తి పెంచింది నిర్మాణ సంస్థ.

సోషల్ మీడియాలో వైరల్..
బుల్లితెర భారీ పాపులారిటీ షో జబర్దస్త్‌కి సంబంధించిన ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవలి కాలంలో ఈ షో నుంచి ఒక్కొక్కరుగా బయటకు వెళ్లిపోతున్నారు. ఇది జనాల్లో హాట్ టాపిక్ అయింది. యాంకర్ అనసూయ కూడా ఇటీవలే గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. తాను జబర్దస్త్ నుంచి బయటకు రాబోతున్నట్లుగా గనెల రోజులుగా హింట్స్ ఇస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే ఇటీవల జరిగిన ఓ జబర్దస్త్ ఎపిసోడ్ లో ఆ విషయాన్ని కన్ఫర్మ్ చేసేసింది. అనసూయ చివరి ఎపిసోడ్ లో ఆమెపైనే స్కిట్ వేశారు జబర్దస్త్ కమెడియన్లు. జబర్దస్త్ కోసం అనసూయ ఎలా కష్టపడిందో చెబుతూనే ఆమెపై కొన్ని సెటైర్స్ కూడా వేశారు. పిల్లలను తల్లి వద్ద వదిలి కూడా జబర్దస్త్ షోకు వచ్చావ్.. అంటూ ఆమె కష్టాన్ని గుర్తు చేశారు. ఇక అనసూయను మిస్ అవుతున్నామని అంటూ జడ్జి ఇంద్రజ కూడా ఎమోషనల్ అయ్యారు. కెమెరాలు మొత్తం అనసూయ చుట్టూ తిప్పినా ఈ యాంకర్ నుంచి కన్నీళ్లు రాలేదు. అసలు ఏ మాత్రం కంటి చుక్క కార్చకుండా అనసూయ బైబై చెప్పేసింది.

న్యూ యాంకర్‌పై ఉత్కంఠ..
జబర్దస్త్‌కు అనసూయ స్థానంలో ఏ యాంకర్ వస్తుంది? జబర్దస్త్ పూర్వ వైభవంతో కొనసాగేనా? అనే సందేహాలు జనాల్లో మొదలయ్యాయి. ఇంతలో జబర్దస్త్ మేనేజ్‌మెంట్ తీరుపై కిర్రాక్ ఆర్ఫీ చేసిన కామెంట్స్ కూడా దుమారం రేపాయి. ఈ పరిస్థితుల నడుమ ఎక్కడ చూసినా జబర్దస్త్ కొత్త యాంకర్ ఎవరనే చర్చే జరుగుతోంది. అందరి ఉత్కంఠకు తెర దించేలా తాజాగా జబర్దస్త్ ప్రోమో రిలీజ్ చేశారు. ఇందులో జబర్దస్త్ కొత్త యాంకర్ రాబోతోంది అని చెప్పేశారు.
ఆగస్టు 4న డిఫరెంట్‌గా ఎంట్రీ..
ఆగస్టు 4న ప్రసారం కానున్న ఎపిసోడ్ లో జబర్దస్త్ కొత్త యాంకర్ కనువిందు చేయనుంది. ఈ నేపథ్యంలోనే ఆమెను పల్లకిలో తీసుకొస్తూ జబర్దస్త్‌కి స్వాగతం చెబుతున్నట్లు డిఫరెంట్ ప్రోమోను ఇటీవల రిలీజ్ చేసింది జబర్దస్త్ మేనేజ్‌మెంట్. కొత్త యాంకర్ వస్తుందని చెప్పారు కానీ ఆమె ముఖం మాత్రం కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. దీంతో జబర్దస్త్ కొత్త యాంకర్ ఎవరై ఉంటారబ్బా అనే సందేహాలు జనం మెదళ్లలో మెదులుతున్నాయి.మంజూష అయి ఉంటుందని కొంత ప్రచారం జరుగుతోంది. ఎవరనేది కన్ఫర్మ్ కావడానికి ఆగస్టు 4 వరకు వేచి చూడాల్సిందే. మంజూషనే పరిచయం చేస్తారా లేక ఏదన్నా ట్విస్ట్ ఇస్తారా అనేది నెక్ట్స్ గురువారం తేలిపోతుంది.
[…] […]