https://oktelugu.com/

Soap: సబ్బు కొనుగోలు చేసే ముందు.. ఈ విషయాలు తెలుసుకోవడం మరిచిపోవద్దు

మన దేశంలో ఎక్కువగా టాయిలెట్ క్లీనింగ్‌కి వాడే సబ్బులు ఉపయోగిస్తున్నారు. సబ్బు ఎంత రేటు ఉంది? దాని బట్ట అది మంచిదా? కాదా? అని ఫిక్స్ అయ్యి తీసుకుంటారు. కానీ అది చర్మ ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుంది? మంచిదేనా? కాదా? అనే విషయం ఆలోచించరు. మరి సబ్బు తీసుకునే ఏయే విషయాలు తెలుసుకోవడం మరిచిపోకూడదో ఈ స్టోరీలో చూద్దాం.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 19, 2024 / 05:57 AM IST

    Soaps

    Follow us on

    Soap: అందానికి అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా ప్రాధాన్యత ఇస్తారు. అందరిలో అందంగా కనిపించాలని ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ క్రమంలో చర్మ సౌందర్యాన్ని పెంచుకోవడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. చర్మం శుభ్రంగా ఉండాలంటే మాత్రం ఫస్ట్ డైలీ చేయాల్సిన పని స్నానం చేయడం. అయితే స్నానం చేసేటప్పుడు సాధారణంగా అందరూ సబ్బు వాడుతుంటారు. కొందరు తక్కువ రేటు సబ్బు వాడితే మరికొందరు ఎక్కువ రేటు సబ్బు ఉపయోగిస్తారు. ఎందుకంటే ఎక్కువ రేటు సబ్బు అయితే చర్మ ఆరోగ్యానికి మంచిదని భావిస్తారు. తక్కువ రేటు సబ్బు వల్ల చర్మం మంచిగా ఉండదని అనుకుంటారు. సబ్బు ఎంత ఎక్కువ రేటు ఉంటే చర్మం అంతగా తళతళ మెరిసిపోతుందని భావిస్తారు. అయితే మన దేశంలో ఎక్కువగా టాయిలెట్ క్లీనింగ్‌కి వాడే సబ్బులు ఉపయోగిస్తున్నారు. సబ్బు ఎంత రేటు ఉంది? దాని బట్ట అది మంచిదా? కాదా? అని ఫిక్స్ అయ్యి తీసుకుంటారు. కానీ అది చర్మ ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుంది? మంచిదేనా? కాదా? అనే విషయం ఆలోచించరు. మరి సబ్బు తీసుకునే ఏయే విషయాలు తెలుసుకోవడం మరిచిపోకూడదో ఈ స్టోరీలో చూద్దాం.

    స్నానానికి ఉపయోగించే సబ్బు తీసుకునే ముందు తప్పకుండా చూడాల్సినది టీఎఫ్‌ఎం. అంటే టోటల్ ఫ్యాటీ మ్యాటర్. దీన్ని బట్టే సబ్బు నాణ్యత ఉందా? లేదా? చర్మ ఆరోగ్యానికి మెరుగుపడుతుందా? లేదా? అనే తెలుసుకోవాలి. ఈ టోటల్ ఫ్యాటీ మ్యాటర్ ఎంత ఎక్కువగా ఉంటే ఆ సబ్బు అంత మంచిదని అర్థం చేసుకోవాలి. సబ్బు నాణ్యతను ఇది తెలియజేస్తుంది. అయితే ఈ టోటల్ ఫ్యాటీ మ్యాటర్ సబ్బులో ఉండే కొవ్వు పదార్థం. ఇదే చర్మాన్ని అందంగా మార్చడంలో ఉపయోగపడుతుంది. అయితే టోటల్ ఫ్యాటీ మ్యాటర్‌లో కొన్ని గ్రేడ్‌లు ఉంటాయి. దాని బట్టి సబ్బు మంచిదో కాదో తెలుసుకోవాలి. స్నానానికి ఉపయోగించే సబ్బుల్లో గ్రేడ్ 1 సబ్బులకు 76 శాతం టోటల్ ఫ్యాటీ మ్యాటర్, గ్రేడ్ 2 సబ్బులకు కనీసం 70 శాతం టోటల్ ఫ్యాటీ మ్యాటర్, గ్రేడ్ 3 సబ్బులకు కనీసం 60 శాతం టోటల్ ఫ్యాటీ మ్యాటర్ ఉంటుంది. గ్రేడ్ 1లో 76 శాతం లేదా అంతకంటే ఎక్కువ టోటల్ ఫ్యాటీ మ్యాటర్ ఉన్న సబ్బులను మాత్రమే స్నానానికి వాడాలి. దీనికంటే తక్కువగా ఉన్న సబ్బులను అసలు స్నానానికి వాడకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎక్కువ టోటల్ ఫ్యాటీ మ్యాటర్ ఉన్న సబ్బులు వాడటం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే పొడి చర్మం, మొటిమలు బారిన పడకుండా మృదువుగా ఉంటుంది. లేకపోతే చర్మం దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సబ్బుపైన ఉండే లేబుళ్లలో ఈ వివరాలు ఉంటాయి. మీరు స్నానానికి సబ్బు తీసుకునే ముందు తప్పకుండా టోటల్ ఫ్యాటీ మ్యాటర్ ఎంత ఉందో చెక్ చేసుకుని తీసుకోవడం బెటర్.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. వీటిని పాటించే ముందు తప్పకుండా వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.