Smart Watch: ప్రస్తుతం మోడ్రన్ యుగం నడుస్తోంది. అందరూ కూడా స్మార్ట్‌గా ఉండాలని భావిస్తున్నారు. దీంతో ఎక్కువగా గ్యాడ్జెట్స్‌ను ఉపయోగిస్తున్నారు. అందంగా కనిపించాలనే ఉద్దేశం కంటే కాస్త ఫ్యాషన్‌గా కనిపించాలని చాలా మంది సార్ట్ వాచ్‌లను వాడుతున్నారు. వీటివల్ల టైమ్ తెలియడంతో పాటు మొబైల్‌లా ఉపయోగించుకోవచ్చు. అలాగే మన బీపీ ఎంత ఉందనే విషయాలు అన్ని కూడా తెలియజేస్తుంది. ప్రస్తుతం రోజుల్లో టైమ్ తెలుసుకోవడం కంటే టెక్నాలజీ పరంగానే ఎక్కువగా ఆలోచించి స్మార్ట్ వాచ్‌లు ఎక్కువగా వాడుతున్నారు. వీటివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని చాలా మంది అనుకుంటారు. కానీ స్మార్ట్ వాచ్ ధరించడం వల్ల నష్టాలే ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. వీటిని ధరించడం వల్ల ఎక్కువగా అనారోగ్య సమస్యల బారిన పడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి స్మార్ట్ వాచ్‌ను ధరించడం వల్ల వచ్చే ఆ సమస్యలేంటో చూద్దాం.
స్మార్ట్ వాచ్ ధరించడం వల్ల చర్మ సమస్యలు, క్యాన్సర్ వంటివి వస్తాయని నిపుణులు చెబుతున్నారు. స్మార్ట్ వాచ్ తయారీకి పాటీ ఫ్లోరో అల్కైల్, పర్‌ప్లోరో హెక్సనోయిక్ యాసిడ్స్ వంటివి ఉపయోగిస్తారు. ఇవి ఆరోగ్యానికి హాని చేస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ రసాయనాల వల్ల కిడ్నీ సమస్యలతో పాటు సంతానోత్పత్తి సమస్యలు కూడా వస్తాయని నిపుణులు అంటున్నారు. సుమారుగా 21 రకాల స్మార్ట్ వాచెస్‌పై పరిశోధనలు జరిపారట. ఎవరైతే ఎక్కువగా స్మార్ట్ వాచెస్ ధరిస్తారో వారికి ఎక్కువగా రోగాలు వస్తాయని నిపుణులు అంటున్నారు. ఇవి కేవలం ఫ్యాషన్‌కు మాత్రమేనని.. ఆరోగ్యాన్ని మెరుగుపరచలేవని నిపుణులు చెబుతున్నారు. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను ఎక్కువగా ధరించవద్దు. వీటిని ధరించాలనిపిస్తే వాకింగ్ చేసే సమయంలో మాత్రమే ధరించండి. ఎందుకంటే వీటివల్ల మీరు ఎంత సమయం నడిచారనే పూర్తి విషయాలు కూడా తెలుస్తాయి. అయితే కొందరు తక్కువ ఖరీదు ఉండే చీప్ స్మార్ట్ వాచ్‌లను వాడుతుంటారు. ఇవి ఏమాత్రం ఆరోగ్యానికి మంచివి కావు. మంచి బ్రాండ్‌లను వాడటం మంచిదని నిపుణులు చెబుతున్నారు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. వీటిని పాటించే ముందు తప్పకుండా వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.