Tea Business Success Story: సాధించాలనే తపన ఉండాలే గాని చిన్న చిన్న ఆలోచనలతో కూడా పెద్ద పెద్ద సక్సెస్‌లను సాధించవచ్చు. జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన వారు తమ ఆలోచనలకు పదును పెట్టి అదేస్థాయిలో కష్టపడి ఎవరూ ఊహించని ఎత్తుకు ఎదిగిన వారు అనేక మంది మన కళ్ళ ముందే కదలాడుతున్నారు. ఇప్పుడు ఇలాంటి ఓ జంట గురించి తెలుసుకుందాం. అందరిలాగే వీళ్ళు కూడా ఎన్నో కష్టాలు పడి చివరకు తమ ఆలోచనలకు కార్యరూపం ఇచ్చి కోట్లు సంపాదించే దిశగా దూసుకు పోతున్నారు. కరోనా కష్ట సమయంలో వారికి వచ్చిన ఆలోచన వారి జీవితాన్ని మార్చేసింది.

హైదరాబాద్ కు చెందిన అద్దెపల్లి జయ కిరణ్, సంతోషిలు దంపతులు. అయితే అందరిలాగే వీరు కూడా కరోనా సమయంలో ఇబ్బంది పడ్డారు. ఈ క్రమంలో టీ బిజినెస్ చేయాలనే ఆలోచన వారికి వచ్చింది. టీ, కాఫీ తో పాటుగా ఇతర మిల్క్ షేక్ లను అమ్మే విధంగా మీరు ఒక బ్రాంచ్ ను స్టార్ట్ చేశారు. దాని పేరు డికాక్షన్ ది టీ బార్. 2020 అక్టోబర్ లో వీరు స్టార్ట్ చేసిన ఈ ఈ సంస్థ.. 2021 మార్చి వచ్చేసరికి ఏకంగా 50 బ్రాంచ్ లతో దూసుకెళ్లేలా వారు కష్టపడ్డారు.
Also Read: Punjab Election Exit Poll: పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ ఎలా గెలవబోతోంది?
ప్రస్తుతం ఈ సంస్థ ఏకంగా 100 కేంద్రాలతో సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. తెలంగాణ, ఆంధ్రాలో దాదాపు 25 నగరాల్లో వీరి కేంద్రాలు ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ బ్రాంచ్ ను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కర్ణాటక నుంచి ఎంక్వయిరీలు వస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ జయ కిరణ్ వెల్లడించారు. తాను గతంలో లో మ్యూజిక్ ఆర్టిస్ట్ గా పని చేశానని.. కరోనా సమయంలో అవకాశాలు రాక ఈ బిజినెస్ ప్లాన్ చేసినట్టు వెల్లడించారు.

ప్రస్తుతం ఒక్క హైదరాబాద్ లోనే 25 బ్రాంచీలు ఉన్నాయని, ఒక్కో కేంద్రంలో నలుగురు వరకు ఉపాధి పొందుతున్నట్టు మరో డైరెక్టర్ సంతోషి తెలిపారు. ప్రస్తుతం వీరి బిజినెస్ మూడు పూవులు ఆరు కాయలు అన్నట్టు లాభాల్లో సాగుతోంది. చూసారా ఒక చిన్న ఐడియా వారి జీవితాన్ని ఎలా మార్చేసిందో. ఈ వార్త గురించి తెలుసుకున్న తర్వాత చాలామంది తమ కలల జీవితం కోసం పోరాడేందుకు ఇదో పెద్ద ఉదాహరణ అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి లేట్ ఎందుకు మీరు కూడా లక్ష్యం కోసం పోరాడడం ఇప్పటి నుంచే మొదలు పెట్టేయండి.
Also Read: AP Assembly Session 2022: వైసీపీని నిలదీసేందుకు టీడీపీ ప్రయత్నించినా కుదరలేదా?