Virat Kohli Back-to-Back Sixes: ప్రపంచకప్ టీ20లో పాకిస్తాన్ పై భారత్ విజయం ఒక అద్భుతం.. ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది మన విరాట్ కోహ్లీ. టీ20 ప్రపంచ కప్ లో ఆదివారం జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్‌పై 4 వికెట్ల తేడాతో టీమిండియా ఉత్కంఠభరితమైన విజయాన్ని సాధించింది. విరాట్ కోహ్లీ భారత్‌ను ఒంటిచేత్తో పోరాడి గెలిపించిన జ్ఞాపకాలు ఇప్పటికీ అభిమానుల మనస్సులలో తాజాగా ఉన్నాయి. మ్యాచ్ చివరి బంతి వరకూ ఉండి చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను ఓడించడంలో.. భారత్ ను గెలిపించడంలో దిగ్గజ బ్యాటర్ కోహ్లీ వీరోచిత పోరాటం దేశ ప్రజల మనసు గెలుచుకుంది. 82 పరుగులతో నాటౌట్ గా ఉండి విరాట్ కోహ్లీ ఆడిన ఆట అద్భుతం అనే చెప్పాలి. పాక్ భీకర బౌలర్ హారిస్ రవూఫ్ బౌలింగ్ కోహ్లీ కొట్టిన ఈ రెండు సిక్సర్‌లే భారత్ ను గెలిపించడంలో కీలక పాత్ర పోషించాయి. క్రికెట్ బుక్ లోనే లేని విభిన్నమైన ఆ షాట్ లకు సోషల్ మీడియాలో అభిమానుల నుంచి ప్రశంసలను పొందుతున్నాయి. ఇప్పుడు ఆ రెండు సిక్స్ లతోపాటు భారత్ విన్నింగ్ మూవెంట్ పై రూపొందించిన స్లో-మోషన్ వీడియో వైరల్‌గా మారింది. ఇంటర్నెట్ ను ఊపేస్తోంది.

ఆఖరి మూడు ఓవర్లలో 50 పరుగులు కావాల్సిన దశలో భారత్ గెలుస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. 19వ ఓవర్‌లో బౌలింగ్ కు దిగిన పాక్ బౌలర్ హరీస్ రవూఫ్ బౌలింగ్ లో కోహ్లీ కొట్టిన సిక్స్ లే మ్యాచ్ ను మలుపుతిప్పాయి.. రౌఫ్ వేసిన ఓవర్ చివరి రెండు బంతుల్లో విరాట్ కోహ్లీ చేసిన పరుగులే ఆట గమనాన్ని మార్చేశాయి.
రవూఫ్ వేసిన ఓవర్‌లో 5వ బంతి మరియు 6వ బంతిని వరుసగా రెండు సిక్సర్లు బాదిన కోహ్లి ఆఖరి 6 బంతుల్లో 16 పరుగులకు లక్ష్యాన్ని తగ్గించగలిగాడు. ఆ ఓవర్‌లో కోహ్లీ రెండు సిక్సర్ల వీడియోను అభిమానులు వైరల్ చేస్తూ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేసి వైరల్ చేస్తున్నారు. ఆ రెండు షాట్‌ల స్లో-మోషన్ వీడియో మరింత మెస్మరైజింగ్‌గా ఉంది.
మ్యాచ్ ముగిసిన తర్వాత ఇదే విషయంపై కోహ్లీ తన ప్లాన్ వివరించడం విశేషం. రవూఫ్ ఓవర్ చివరి రెండు బంతుల్లో రెండు సిక్సర్లు కొట్టాలని తనకు తెలుసని, లేదంటే భారత్‌కు గెలవదనే ఇలా చేశానని కోహ్లీ వివరించాడు.

“ఇది సవాలు అని తెలుసు., కానీ నేను హార్దిక్‌కి ఒక విషయం చెప్పాను, పాక్ నంబర్ 1 బౌలర్ హారిస్‌ను లక్ష్యంగా చేసుకుంటే, పాకిస్తానీ ఆటగాళ్లు భయాందోళన చెందుతారు. చివరి 8 బంతుల్లో మాకు 28 పరుగులు అవసరమైనప్పుడు, నేను రెండు సిక్సర్లు కొట్టాలి అని చెప్పాను. లేకపోతే ఆటను కోల్పోతామని హార్ధిక్ తో డిస్కస్ చేశాను ”అని అతను స్పోర్ట్స్‌తో చాట్‌లో కోహ్లీ చెప్పాడు.
టీ20 ప్రపంచ కప్‌లో భారత్ తన 2 మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌తో ఈరోజు తలపడుతోంది. మరో ‘కోహ్లీ స్పెషల్’ ఇన్నింగ్స్ కోసం అభిమానులంతా ఎదురుచూస్తున్నారు..
https://twitter.com/Thalanikki/status/1584592411065339905?s=20&t=HEuze3r2ENBmeZV11j782g