Pimples: వయసులో ఉన్నప్పుడు ముఖంపై మొటిమలు రావడం సహజమే. దీంతో మొటిమలతో ఎంతో ఇబ్బందిగా ఫీలవుతారు. ముఖంపై మొటిమలు రావడానికి కారణాలేంటో తెలుసా? మనం మొబైల్ ను ముఖానికి దగ్గరగా పెట్టుకుని మాట్లాడుతుంటే వాటి నుంచి వెలువడే బ్యాక్టీరియాతో మొటిమలు ఏర్పడతాయని చెబుతున్నారు. మొటిమలు రాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. లేదంటే నలుగురిలో తిరగాలంటే కూడా ఇబ్బందిగా మారుతుంది. ఈ నేపథ్యంలో మొటిమలు రాకుండా ఏం చేయాలో తెలుసుకుంటే మంచిది. వచ్చిన వాటిని కూడా తొలగించుకునేందుకు ప్రయత్నించాలి.

మొటిమలు పోవాలంటే బేకింగ్ సోడాను నీటిలో కలపండి దాన్ని వాటిపై రాసి పది నిమిషాల తరువాత శుభ్రం చేసుకుంటే మొటిమల సమస్యను దూరం చేసుకోవచ్చు. మొటిమల నివారణకు నిమ్మకాయ కూడా ఉపయోగపడుతుంది. నిమ్మకాయ సగం చెక్క తీసుకుని మొటిమలు ఉన్న ప్రాంతంలో రాస్తే నిమ్మకాయలో ఉండే సిట్రిక్ యాసిడ్ మొటిమలను తగ్గించుకోవచ్చు. ముఖంపై ఉన్న మొటిమల నివారణకు బంగాళాదుంపలు స్లయిస్ చేయాలి. బంగాళాదుంపలో ఉండే యాంటీ ఇన్నమేటర్ గుణాలు ఉండటంతో మొటిమలను తొలగించుకోవచ్చు.
పటిక కూడా మొటిమలను తగ్గిస్తుంది. పటికను మొటిమల మీద పెడితే వాటిని వేగంగా నివారిస్తుంది. ఆపిల్ సైడర్ వెనిగర్ కూడా మొటిమలను రాకుండా చేస్తుంది. దీన్ని తక్కువగా వాడాలి. ఎక్కువగా వాడితే చర్మానికి హాని కలిగిస్తుంది. ముఖం మీద ఆపిల్ సైడర్ వెనిగర్ ను రాసి పది నిమిషాల తరువాత నీటితో శుభ్రపరిస్తే ఫలితం ఉంటుంది. మొటిమల నివారణకు ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఇందులో భాగంగానే పలు విధాలైన చర్యలతో మొటిమలు దూరం చేసుకోవచ్చు.

చర్మాన్ని అప్పుడప్పుడు చర్మాన్ని స్క్రబ్ చేయడం ద్వారా మృత కణాలు తొలగిపోతాయి. దీంతో మొటిమలు రావు. మొటిమలు ఉన్నవాళ్లు స్క్రబంగ్ చేయకపోవడమే మంచిది. జంక్ ఫుడ్స్ ఎక్కువగా తింటే మొటిమలు పెరుగుతాయి. తాజా పండ్లు, కూరగాయలు, నీరు ఎక్కువగా తాగుతుండాలి. దీంతో మొటిమలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. తద్వారా మొటిమలు రాకుండా చేసుకునే వీలు కలుగుతుంది. వైద్యుల సలహా మేరకు కచ్చితమైన పద్ధతులు పాటించి మొటిమలు రాకుండా నిరోధించుకోవచ్చు.