Sleeping Tips: మనిషి ఆరోగ్యానికి ఆహారం ఎంత ముఖ్యమో.. నిద్ర కూడా అంతే అవసరం. చిన్న పిల్లలు 8 గంటలు.. పెద్దవాళ్లు 6 నుంచి 7 గంటలు కచ్చితంగా ప్రతిరోజు నిద్రపోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కానీ నేటి కాలంలో స్కూలు కెళ్లే విద్యార్థుల నుంచి బడా వ్యాపారుల వరకు ప్రతి ఒక్కరూ ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. దీంతో నిత్యం ఆందోళనతో కనిపిస్తున్నారు. ఈ ఆందోళన నిద్రలేమికి గురి చేస్తుంది. నిద్రలేమితో బాధపడేవారు అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. ఒక్కోసారి గుండె సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే చాలా మంది రాత్రిళ్లు నిద్రపట్టడం లేదని చెబుతూ ఉంటారు. త్వరగా నిద్ర రావడానికి కొన్ని మార్గాలున్నాయి. అవేంటంటే?
ఒక క్షణం మంచి నిద్రకు ఉపక్రమిస్తే మనసుకు ఎంతో హాయిగా ఉంటుంది. అంతేకాకుడా నిద్రపోయిన సమమంలో గుండెకు విశ్రాంతి దొరుతుకుంది. దీంతో కండరాలు రిలాక్స్ అవుతాయి. గంట సేపు నిద్రపోతే ఎంతో శక్తి వచ్చినట్లు అవుతుంది. అందుకే చాలా మంది టైం దొరికినప్పుడల్లా ఒక కునుకు తీస్తారు. అయితే వేళా పాళా లేకుండా నిద్రిస్తే శరీరం రిలాక్స్ అవదు. కచ్చితంగా రాత్రి 9 నుంచి ఉదయం 4 గంటల లోపు నిద్రపోవడం ఎంతో మంచిదని అంటున్నారు.
అయితే కొందరు రాత్రిళ్లు విధుల్లో ఉన్నవారు.. ఇతర పనులతో బిజీగా ఉన్నవారు సరైన సమయంలో నిద్రించరు. దీంతో అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. కొన్ని రోజుల పాటు రాత్రిళ్లు నిద్ర లేకపోవడంతో ఇలాగే అలవాటై.. ఆ తరువాత నిద్రించాలన్న నిద్రపట్టదు. ఒకవేళ వీరు నిద్రించినా మనసులో కలతలు ఉంటాయి. దీంతో తీవ్ర మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటారు. ఇలాంటి సమస్యలు ఎదుర్కొనేవారు కొన్ని టిప్స్ పాటించడం వల్ల తొందరగా నిద్రపడుతుంది. వాటిలో కొన్ని ముఖ్యమైన వాటి గురించి..
మొబైల్ ఎంట్రీ ఇచ్చిన తరువాత పుస్తకాలు కనుమరుగైపోతున్నాయి. కానీ నిత్యం మొబైల్ చూడడం వల్ల కళ్లకు ఎఫెక్ట్ అవుతుంది. దీంతో మానసకి సమస్యలు వస్తాయి. అయితే ఒక మంచి పుస్తకం కొనుక్కొని రోజూ గంట పాటు చదివే ప్రయత్నం చేయండి. రోజూ బుక్ చదవడం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది.
నిద్ర పట్టకపోవడానికి చుట్టూ వాతావరణం బాగుండాలి. అంటే నిద్రపోయే ప్రదేశంలో వస్తువులు చిందరవందరగా ఉంటే మనసు ప్రశాంతంగా ఉండదు. అందువల్ల ఎక్కడైతే నిద్రించాలని అనుకుంటున్నారో అక్కడ ప్రశాంత వాతావరణం ఉండేలా చూసుకోవాలి. అప్పుడే మంచి నిద్ర పడుతుంది.
రాత్రి పడుకునే ముందు కొందరు టీ, కాఫీ తాగుతూ ఉంటారు.ఇందులో ఉండే కెఫిన్ నిద్రను చెడగొడుతుంది. అందువల్ల నిద్రపోయే ముందు ఇలాంటి పదార్థాలను తీసుకోకుండా జాగ్రత్తపడాలి. పాలు లేదా సాప్ట్ ఫుడ్ తీసుకోవాలి. దీంతో ఎలాండి డైజేషన్ సమస్యలు లేకుండా హాయిగా నిద్రపడుతుంది.