Sleeping Timings: ప్రస్తుతం అంతా డిజిటల్ మయం అయిపోతుంది. ఏ పని అయినా ఫాస్ట్ గా చేస్తేనే లక్ష్యాన్ని చేరుతారు. ఇదే సమయంలో టార్గెట్ ను రోజురోజుకు పెంచుకుంటూ పోతూ మినిమం అవర్స్ కంటే ఎక్కువగా పని చేస్తున్నారు. కానీ లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో ఆరోగ్యంపై నిర్లక్ష్యం వహిస్తున్నారు. విధులను టార్గెట్ చేసి నిద్రకు దూరమవుతున్నారు. దీంతో చాలా మంది కనీసం 6 గంటల నిద్రకు దూరమవుతున్నారు. ప్రతీ వ్యక్తి మధ్య వయసులో 6 గంటలు కచ్చితంగా కునుకు తీయాలని వైద్యులు చెబుతున్నారు. కానీ దీనిని పట్టించుకోకుండా అనేక అనారోగ్యాలు తెచ్చుకుంటున్నారు. అసలు మనుషుకు నిద్ర దూరమైతే ఎలాంటి అనారోగ్యాలు వస్తాయంటే?
రోజుకు కనీసం 6 గంటలు నిద్రపోకపోతే తలనొప్పి వస్తుంది. ఆ తరువాత ఇది మైగ్రేన్ కు దాని తీస్తుంది. మైగ్రేన్ తో ఏ పని చేయడానికి అనుకూల వాతావరణం ఉండదు. ఎవరు మాట్లాడినా చికాకు అనుపిపిస్తుంది. సాధారణంగా ఇది జన్యుపరంగా ఏర్పడుతుంది. కానీ నిద్రలేమి కారణంగానూ మైగ్రేన్ వచ్చే అవకాశం ఉంది. ఇది ఎక్కువా మహిళలల్లో రావొచ్చు. వీరు ఎక్కువడా డిప్రెషన్ కు లోనవుతూ.. సరైన గంటలు నిద్రించకపోవడం వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది.
మనిషికి సరైన నిద్ర లేకపోవడం వల్ల హార్ట్ కు సంబంధించిన సమస్యలు వస్తాయి. మనం నిద్రిస్తున్నప్పుడే గుండెకు విశ్రాంతి దొరుకుతుంది. దీంతో హార్ట్ బీట్ పెరగకుండా నార్మల్ స్టేజీలో ఉంటుంది. అయితే నిద్రలేమి కారణంగా గుండె నిరంతర ప్రక్రియలో ఉండడం వల్ల సమస్యలు ఏర్పడుతాయి. దీంతో హార్ట్ ఎటాక్ కూడా రావొచ్చు. అయితే 6 గంటల కంటే తక్కువ సమయం నిద్రించేవారిలో మాత్రమే ఈ సమస్య ఏర్పడుతుంది.
నిద్రలేమి కారణంగా శరీరంలో నిరోధక శక్తి తగ్గుతుంది. నిద్ర కరువవడం వల్ల గ్రోత్ హార్మోన్లు విడుదల కావు. దీని వల్ల కండరాలు బలహీనపడుతాయి. ఇలా ఎక్కువగా కొనసాగితే అల్జీమర్స్ వచ్చే ప్రమాదం ఉంది. అలాగే శరీరంలోని స్ట్రెస్ విడుదలయ్యే చర్మం, ముఖంపై ముడుతలు ఏర్పడుతాయి. దీంతో చిన్న వయసులోనే కళ కోల్పోతారు. అందువల్ల ప్రతిరోజూ కచ్చితంగా 6 గంటలు నిద్రించేలా ప్లాన్ చేసుకోండి..