https://oktelugu.com/

Sleeping: రాత్రిపూట ప్రశాంతంగా నిద్ర పట్టడం లేదా? అయితే ఇలా చేయండి

మనిషికి నిద్ర లేకపోతే నీరసంగా అయిపోయి.. ఏ పని కూడా సరిగ్గా చేయలేరు. రోజంతా చిరాకుగా, నీరసంగా ఉంటుంది. మరి ఎలాంటి ఇబ్బంది లేకుండా కళ్లు మూసిన వెంటనే నిద్ర పట్టాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. మరి ఆ చిట్కాలేంటో ఈరోజు తెలుసుకుందాం.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : October 28, 2024 / 08:40 PM IST

    sleepless

    Follow us on

    Sleeping: ప్రస్తుతం ఉన్న బిజీ షెడ్యూల్‌ లేదా మారిన జీవనశైలి వల్ల చాలామంది సరిగ్గా నిద్రపోవడం లేదు. మనిషికి తిండి, నీరు ఎంత ముఖ్యమూ నిద్ర కూడా అంతే ముఖ్యం. తిండి లేకపోయిన కొన్ని రోజులు బ్రతకగలరు ఏమో.. కానీ నిద్ర లేకపోతే బ్రతకలేరు. ఒక్క రోజు నిద్ర తక్కువైన మనిషి చాలా నీరసంగా అయిపోతారు. ఏ పని కూడా సరిగ్గా చేయలేరు. అంత ఇంట్రెస్ట్ కూడా ఉండదు. ఈ రోజుల్లో అయితే ఎక్కువగా సోషల్ మీడియాకు బానిస అయ్యి.. పగలు, రాత్రి తేడా లేకుండా వాడుతున్నారు. మొబైల్ నుంచి వచ్చే ఆ కిరణాల వల్ల తొందరగా నిద్ర పట్టదు. దీనివల్ల చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. మనిషికి నిద్ర లేకపోతే నీరసంగా అయిపోయి.. ఏ పని కూడా సరిగ్గా చేయలేరు. రోజంతా చిరాకుగా, నీరసంగా ఉంటుంది. మరి ఎలాంటి ఇబ్బంది లేకుండా కళ్లు మూసిన వెంటనే నిద్ర పట్టాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. మరి ఆ చిట్కాలేంటో ఈరోజు తెలుసుకుందాం.

    వ్యాయామం చేయాలి
    రాత్రి పూట తొందరగా, హాయిగా నిద్రపట్టాలంటే వ్యాయామం చేయాలి. రోజూ ఉదయం లేదా సాయంత్రం పూట వ్యాయామం చేయడం వల్ల బాడీ బాగా అలసిపోతుంది. దీంతో రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపడుతుంది. బాడీకి శారీరక శ్రమ లేకపోవడం వల్ల కూడా రాత్రిపూట నిద్రపట్టదు. కాబట్టి వ్యాయామం, జిమ్, రన్నింగ్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

    కాఫీ, టీ తక్కువగా తీసుకోవాలి
    సాయంత్రం పూట టీ, కాఫీ ఎక్కువగా తీసుకోవడం వల్ల రాత్రిపూట సరిగ్గా నిద్రపట్టదు. నిద్రలేమి సమస్యతో ఇబ్బంది పడుతున్నట్లయితే వీటిని తీసుకోకపోవడం మేలు. రాత్రిపూట సరిగ్గా నిద్రపట్టాలంటే డార్క్ చాక్లెట్‌ను పడుకునే ముందు తినాలని నిపుణులు అంటున్నారు.

    తొందరగా భోజనం చేయాలి
    రాత్రి తొందరగా నిద్ర పట్టాలంటే ఆలస్యంగా భోజనం చేయవద్దు. తొందరగా భోజనం చేయడం వల్ల తినే ఆహారం జీర్ణం అవుతుంది. దీంతో తొందరగా నిద్రపడుతుంది.

    పగలు ఎక్కువ సమయం పడుకోకూడదు
    కొందరు పగటి పూట ఎక్కువ సమయం నిద్రపోతారు. దీనివల్ల రాత్రి పూట సరిగ్గా నిద్రపట్టదు. నీరసంగా అనిపిస్తే పగటి పూట అరగంటకి మించి పడుకోవద్దు. ఎక్కువ సమయం నిద్రపోతే అనారోగ్య సమస్యలు రావడంతో పాటు రాత్రిపూట నిద్ర కూడా పట్టదని నిపుణులు అంటున్నారు.

    నైట్ షిఫ్ట్‌లు చేయవద్దు
    రాత్రంతా మేల్కోని కొందరు ఉద్యోగాలు చేస్తున్నారు. దీనివల్ల లైఫ్ సర్కిల్ మారుతుంది. అందరూ కూడా రాత్రి పూట పడుకుంటే నైట్ షిఫ్ట్‌ వాళ్లకి రాత్రిపూట డే మొదలవుతుంది. రాత్రంతా డ్యూటీ చేయడం వల్ల పగలు పడుకున్న కూడా బాడీ ఫ్రీ కాదు. దీనివల్ల బాడీలో ఏదో నీరసం, అలసటగా అనిపిస్తుంది. ఈ నైట్ షిఫ్ట్‌లకి బాగా అలవాటు కావడం వల్ల కొన్నిసార్లు రాత్రి నిద్ర పట్టదు.

     

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.