Sleeping Benefits: నేటి కాలంలో చాలా మంది శారీరకంగా కష్టపడడానికి ఇష్టపడం లేదు. ఎండ తగలకుండా.. ఏసీలో ఉండే కంప్యూటర్ జాబ్ చేయాలి చాలా మంది అనుకుంటున్నారు. ఆదాయం కోసం జాబ్ ఏది చేసినా పర్వాలేదు. కానీ కూర్చుని జాబ్ చేసేవారు కాస్త వ్యాయామం చేయాలని ఆరోగ్య నిపుణులు ఇప్పటికే సూచించారు. జాబ్ చేసేవారితో పాటు కొందరు వ్యక్తులు అదే పనిగా కూర్చోవాలనుకుంటారు. సమయం దొరికినప్పుడల్లా రిలాక్స్ కావడానికి కుర్చీలో లేదా సోఫా సెట్ లో సెటిలవుతారు. ముఖ్యంగా ఇళ్లల్లో ఉండే పెద్దవారు ఒకే చోట ఎక్కువ సేపు కూర్చుంటున్నారు. అయితే ఇలా కూర్చోవడం కంటేనిలబడడం గానీ లేదా నడవడం ఎంతో ఆరోగ్యమని అంటున్నారు. కూర్చోవడం కంటే నిలబడి ఉన్నవారే ఎక్కువగా ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తేల్చారు. ఆ వివరాల్లోకి వెళితే..
తాజాగా యూరోపియన్ హార్ట్ జనరల్ లో పబ్లిష్ అయిన కథనం ప్రకారం.. పెద్దవారు రోజుకు కనీసం 9 నుంచి 9.30 గంటలు కూర్చుంటున్నారని శాస్త్రవేత్తలు గుర్తించారు. కొందరు పెద్దవారు వివిధ కారణాల వల్ల ఎక్కువ సేపు నడవ లేరు. మరికొందరు మోకాళ్ల నొప్పులు, తదితర కారణాలతో నడవకుండా ఒకే చోట ఎక్కువగా కూర్చుంటారు. ఇంకొందరు వయసు ప్రభావంతో అటూ ఇటూ నడవకుండా ఒకే చోట కూర్చుంటారు.
ఇలా కదల కుండా ఒకే చోట కూర్చోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని పరిశోధకులు తెలిపారు. రోజుకు కనీసం 5 నుంచి 10 నిమిషాలైనా శ్రమతో కూడిన పని చేయాలని పేర్కొన్నారు. ఏ పని లేకపోతే అటూ ఇటూ నడవాలని అంటున్నారు. అయితే ఆ పరిస్థితి కూడా లేనప్పుడు పడుకోవడం బెటరని అంటున్నారు. నిత్యం పడుకోవడం ఇబ్బంది అయినప్పుడు కాసేపు కూర్చోవడం పెద్ద సమస్యేమీ కాదు. కానీ అదేపనిగా ఒక్కచోట కదలకుండా కూర్చోవడం ద్వారా సమస్యలు వస్తాయని అంటున్నారు. అందువల్ల ప్రతీరోజూ ఎక్కువ సేపు కూర్చునేవారు నిలబడడం లేదా నిద్రించడం అలవాటు చేసుకోవాలని అంటున్నారు.
పెద్ద వారు మాత్రమే కాకుండా ఒకే చోట కూర్చొని పనిచేసేవారు సైతం కనీసం అరగంటకోసారి లేచి అటూ ఇటూ తిరగాలని సూచిస్తారు. ముఖ్యంగా కార్యాలయాల్లో కదలకుండా కూర్చునేవారు టీ బ్రేక్, లంచ్ కోసం బయటకు వెళ్లాలని, అలాగే లిప్ట్ ను కాకుండా మెట్లను ఉపయోగించాలని సూచిస్తున్నారు. ఖాళీ సమయం దొరికినప్పుడు సహోద్యోగులతో ఉల్లాసంగా మాట్లాడడం వల్ల ఆరోగ్యంగా ఉండగలుగుతారని చెబుతున్నారు.