https://oktelugu.com/

Sleep : రాత్రిపూట ఈ టైమ్‌లో నిద్రపోతే.. క్యాన్సర్ సమస్యలన్నీ మటుమాయం

దీంతో సంతాన సమస్యలు వస్తాయి. అలాగే నిద్రలేమి వల్ల అండం నాణ్యత తగ్గిపోతుంది. కాబట్టి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్లు తప్పకుండా రోజుకి 8 నుంచి 9 గంటలు నిద్రపోవాలి.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 25, 2024 / 09:30 PM IST

    Sleeping in Light or Dark

    Follow us on

    ప్రస్తుతం రోజుల్లో చాలా మంది నైట్ షిఫ్ట్‌లు చేస్తున్నారు. వ్యక్తిగత కారణాలు, ప్రాంతాలు బట్టి డైలీ కాకపోయిన అప్పుడప్పుుడు అయిన కూడా నైట్ షిఫ్ట్‌లు చేస్తున్నారు. మరికొందరు మొబైల్ యూజ్ చేస్తూ, సినిమాలు చూస్తూ వంటి కారణాల వల్ల రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోతున్నారు. నిజం చెప్పాలంటే రాత్రిపూ ఆలస్యంగా కాదు.. రాత్రిపూట అసలు నిద్రపోవడం లేదు. ప్రస్తుతం యువత ఎక్కువగా నిద్రలేమి సమస్యలతో ఇబ్బంది పడుతోంది. సోషల్ మీడియా వినియోగం వల్ల రోజంతా మొబైల్‌లోనే గడుపుతున్నారు. వాటి నుంచి వచ్చిన కిరణాల వల్ల నిద్రపట్టక పోవడంతో పాటు కళ్లకు హాని జరుగుతుంది. ఈ కిరణాల వల్ల ఎంత నిద్రపోవాలని అనుకున్న కూడా రాత్రంతా నిద్రపట్టదు. వేకువ జామున అందరూ లేచే సమయానికి కొందరు నిద్రపోతున్నారు. ఇలా నిద్రపోవడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని తెలిసిన కూడా జీవనశైలిని మార్చడం లేదు. అయితే రాత్రిపూట నిద్ర అనేది చాలా ముఖ్యం. ఎవరి వయస్సుకు తగ్గట్లుగా బాడీకి సరిపడా నిద్రపోవాలి. కొందరు నైట్ షిఫ్ట్ చేసేవాళ్లు అయితే పూర్తిగా రాత్రి నిద్రపోకా ఉదయం నిద్రపోతున్నారు. ఇలాంటి వాళ్లకు వచ్చే అనారోగ్య సమస్యలు ఏంటో మరి చూద్దాం.

    నైట్ షిఫ్ట్‌లలో పనిచేసేటప్పుడు బయోలాజికల్ క్లాక్ మిస్ అవుతుంది. దీనివల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిద్రపోయేటప్పుడు అర్థ రాత్రి 2 గంటల నుంచి 5 గంటల లోపు మెలటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. దీనివల్ల అనేక రకాల క్యాన్సర్ల సమస్య క్లియర్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఎలాంటి క్యాన్సర్‌ను అయిన ఈ మెలటోనిన్ తగ్గిస్తుందని నిపుణులు అంటున్నారు. కాబట్టి రాత్రి ఈ సమయాల్లో తప్పకుండా నిద్రపోండి. దీనివల్ల కేవలం క్యాన్సర్ మాత్రమే కాకుండా అన్ని రకాల దీర్ఘకాలిక సమస్యల నుంచి విముక్తి పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. బాడీకి సరిపడా నిద్ర లేకపోతే గుండె పోటు వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిద్రలేమి వల్ల రక్తంలోని చక్కెర స్థాయిలు పెరుగుతాయి. దీంతో డయాబెటిస్ వస్తుంది. కాబట్టి రోజుకి కనీసం 8గంటల నిద్ర తప్పనిసరి. అది రాత్రి సమయాల్లో తప్పకుండా నిద్రపోవాలి. నిద్ర తక్కువైతే మానసికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. మెదడు పనితీరుపై ప్రభావం చూపుతుంది. దీంతో జ్ఞాపకశక్తి తగ్గుతుందని నిపుణులు అంటున్నారు.

    నిద్రలేమి వల్ల ఆకలి ఎక్కువగా పెరుగుతుంది. దీంతో అధికంగా ఆహారం తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారు. ఇది ఊబకాయానికి దారితీస్తుంది. మనిషికి నిద్ర అనే చాలా ఇంపార్ట్‌టెంట్. పగలు ఎంత నిద్రపోయినా సరే.. రాత్రి నిద్ర అనేది తప్పనిసరి. రాత్రి నిద్రలేకపోతే డిప్రెషన్‌కి దారితీస్తుంది. నిద్రలేమి శరీరంలోని హార్మోన్లపై ప్రభావం చూపుతుంది. దీంతో అవయవాల పనితీరు తగ్గి.. లైంగికంగా ఆసక్తి తగ్గడం, మూడ్ స్వింగ్స్ మారడం వంటి సమస్యలు కూడా వస్తాయి. ముఖ్యంగా మహిళల్లో ప్రత్యుత్పత్తి వ్యవస్థ దెబ్బతింటుంది. అయితే నిద్రకు సాయపడే మెలటోనిన్ హార్మోన్‌కి, ప్రత్యుత్పత్తి వ్యవస్థకు దగ్గర సంబంధం ఉంది. నిద్రకు ఆటంకం కలిగితే ప్రత్యుత్పత్తి హార్మోన్లపై ప్రభావం చూపుతుంది. దీంతో సంతాన సమస్యలు వస్తాయి. అలాగే నిద్రలేమి వల్ల అండం నాణ్యత తగ్గిపోతుంది. కాబట్టి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్లు తప్పకుండా రోజుకి 8 నుంచి 9 గంటలు నిద్రపోవాలి.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. వీటిని పాటించే ముందు తప్పకుండా వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.