Sleep: ఆరోగ్యంగా ఉండటానికి ఆహారం ఎంత అవసరమో.. నిద్ర కూడా అంతే ముఖ్యం. కంటి నిండా నిద్ర లేకపోతే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. చిన్న పిల్లలకి అయిన పెద్దవాళ్లకైనా సరిపడ నిద్ర అనేది తప్పనిసరి. అయితే ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ వల్ల చాలామంది తక్కువగా నిద్రపోతున్నారు. రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం, ఉదయం లేటుగా నిద్ర లేస్తున్నారు. పగలు ఎంత పడుకున్న.. రాత్రి నిద్ర చాలా ముఖ్యమైనది. ఒక్కరోజు నిద్ర లేకపోతే దాన్ని కవర్ చేసుకోవడానికి దాదాపు నాలుగు నుంచి ఐదు రోజుల నిద్ర అవసరం అవుతుంది. నిద్ర లేకపోతే రోజంతా కాస్త చిరాకుగా ఉంటుంది. ఏ పని మీద కూడా శ్రద్ధ పెట్టలేరు. బాడీకి సరైనా నిద్ర అందకపోతే.. గుండెపోటు, టైప్ 2 డయాబెటిస్, ఉబకాయం, డిప్రెషన్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. నిద్ర తక్కువ అయితే కొంతమందికి మానసిక సమస్యలు కూడా వస్తాయి. మనిషికి సరిపడా నిద్ర తప్పకుండా ఉండాలి. లేకపోతే బరువు పెరుగుతారని కొందరు అంటున్నారు. మరి ఇందులో నిజమెంత? పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
నిద్ర అనేది ఆరోగ్య ప్రయోజనాలకు బాగా మేలు చేస్తుంది. మనిషికి సరిపడా నిద్రలేకపోతే తప్పకుండా బరువు పెరుగుతారని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా మనిషికి 8 గంటల నిద్ర అనేది అవసరం. కానీ కొందరు తక్కువగా నిద్రపోతే, మరికొందరు ఎక్కువగా నిద్రపోతుంటారు. దీనివల్ల బరువు పెరుగుతారని నిపుణులు చెబుతున్నారు. నిద్రలే ఏ మాత్రం తేడాలు వచ్చిన కూడా హార్మోన్లలో మార్పులు వస్తాయి. దీనివల్ల హార్మోన్లు దెబ్బతింటాయి. దీంతో ఆకలిని పెంచే గ్రెలిన్ అనే హార్మోన్ ఎక్కువగా విడుదల అవుతుంది. దీనివల్ల మీకు ఆకలి ఎక్కువగా వేసి గ్యాప్ ఇవ్వకుండా తింటారు. తినేంత అవసరం లేకపోయిన కూడా ఎక్కువగా తింటారు. దీంతో శరీరంలో ఎక్కువగా కొవ్వు పెరిగి బరువు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. నిద్ర తక్కువ కావడం వల్ల జీర్ణ క్రియ కూడా నెమ్మదిస్తుంది. దీనివల్ల జీర్ణ సమస్యలు కూడా వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
శరీరానికి సరిపడా నిద్ర లేకపోతే రోగనిరోధక శక్తి కూడా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే సరిగ్గా నిద్ర ఉన్నప్పుడు శరీరం నుంచి సైటోకిన్‌లు ఉత్పత్త అవుతాయి. అదే నిద్ర తక్కువ అయితే సైటోకిన్‌ల ఉత్పత్తి సామర్థ్యం తగ్గుతుంది. ఇవి పూర్తిగా రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోగనిరోధక శక్తి తగ్గితే అనారోగ్య సమస్యలు పెరుగుతాయి. అలాగే హార్మోన్లపై కూడా ప్రభావం పడుతుంది. నిద తక్కువ అయితే బాడీలో అన్ని పార్ట్స్ యాక్టివ్‌గా పనిచేయవు. లైంగిక ఆసక్తి తగ్గడం, మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉండటం, అలసట, నీరసం వంటి సమస్యలు కూడా వస్తాయి. ఆరోగ్యంగా ఉండటానికి నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. ఎట్టి పరిస్థితుల్లో కూడా నిద్రను లైట్ తీసుకోకూడదు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. వీటిని పాటించే ముందు తప్పకుండా వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.