Bananas : మనిషి ఆరోగ్యంగా ఉండడానికి ఆహారంతో పాటు నిద్ర కూడా చాలా అవసరం. ప్రతిరోజు ఒక వ్యక్తి 8 గంటల పాటు నిద్రపోవడం వల్ల ఆరోగ్యంగా ఉండగలుగుతాడు. అంతేకాదు సరైన సమయంలో నిద్రపోతేనే మనసు ప్రశాంతంగా మారుతుంది. కానీ నేటి కాలంలో చాలామంది రాత్రులు ఎక్కువసేపు మెలకువ ఉంటూ నిద్రపోవడం లేదు. కొందరు ఫోన్ లేదా ఇతర వ్యసనాలతో నిద్రకు భంగం కలిగిస్తున్నారు. ఇలా చేయడం వల్ల తాత్కాలికంగా ఇలాంటి నష్టం జరగకపోయినా భవిష్యత్తులో మాత్రం అనేక అనారోగ్యాలకు దారితీస్తుంది. అందువల్ల సరైన నిద్రపోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే కొందరికి రాత్రిలో నిద్ర పోదామని అనుకున్న నిద్ర పట్టదు. ఇలాంటివారు తీవ్ర ఆందోళనకు చెందుతారు. ఇటువంటి సమయంలో అరటి పళ్ళు తినడం వల్ల నిద్ర బాగా పడుతుందని అంటున్నారు. ఎందుకంటే?
Also Read : నల్ల మచ్చలున్న అరటిపండ్లు ఆరోగ్యానికి మంచివేనా.. వైద్యులేం చెప్పారంటే?
మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే రోజు తినే ఆహారంతో పాటు పండ్లు కూడా తీసుకోవాలని వైద్యులు చెబుతూ ఉంటారు. పండ్లు తీసుకోవడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. అలాగే కొన్ని పనులలో విటమిన్లు, ప్రోటీన్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల అదనపు శక్తిని పొంది నిత్యం ఆరోగ్యంగా ఉండగలుగుతారు. పండ్లలో ప్రధానంగా అరటిపండు గురించి చెప్పుకోవచ్చు.
అరటిపండు తినడం వల్ల ఎన్నో రకాలుగా ప్రయోజనాలు ఉన్నాయి. జీర్శ శక్తిని పెంపొందించడానికి ఈ పండ్లు ఎంతో ఉపయోగపడతాయి. అయితే ఇవి బాగా నిద్ర పట్టడానికి కూడా ఉపయోగపడతాయని కొందరు నిపుణులు తెలుపుతున్నారు. పడుకునే ముందు అరటి పండ్లు తినడం వల్ల మంచి నిద్ర వస్తుందని తెలుపుతున్నారు. ఎందుకంటే అరటి పండ్లల్లో కావలసిన ఖనిజాలు ఉంటాయి. ఇందులో పొటాషియం తో పాటు కాల్షియం ఉంటుంది. అలాగే రాత్రి భోజనం చేసిన తర్వాత అరటి పండ్లు తినడం వల్ల జీర్ణక్రియ సక్రమంగా సాగుతుంది. దీంతో కడుపులో ఎలాంటి అలజడి లేకుండా శరీరానికి కావాలని శక్తిని అందిస్తుంది. ఈ క్రమంలో రక్తప్రసరణ కూడా మెరుగ్గా మారుతుంది.
అయితే రక్త ప్రసరణ మెరుగ్గా మారిన సమయంలో మెదడు ప్రశాంతంగా మారుతుంది. దీంతో నిద్ర పోవడానికి అవకాశం ఉంటుంది. మంచి నిద్ర కావాలంటే మనసు ప్రశాంతంగా మారాలి. అరటిపండు తినడం వల్ల మనసు ఎలాంటి అలజడి లేకుండా ఉంటుంది. అందువల్ల నిద్ర సక్రమంగా వస్తుందని అంటున్నారు.
అయితే రాత్రి సమయంలో అరటిపండు తినడం అందరికీ ఆమోదయోగ్యం కాదు. అస్తమా సమస్య ఉన్నవారు అరటి పండు తినడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. అంతేకాకుండా కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు అరటి పండ్లకు దూరంగా ఉండాలని అంటున్నారు. మిగతావారు కూడా నిద్ర కోసం అరటి పండ్లను ఎక్కువగా తీసుకోకుండా తగిన మోతాదులో మాత్రమే తీసుకోవాలి. లేకుంటే కొత్త ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే అరటి పండ్లు తింటేనే కాకుండా ధ్యానం చేయడం వల్ల.. లేదా రిలాక్స్ గా మారిన తర్వాత కూడా ప్రశాంతమైన నిద్రపోవచ్చు. అరటి పండ్లు తినలేని వారు ఈ రకంగా ప్రయత్నించి ప్రశాంతంగా నిద్రపోవాలి.
Also Read : అవునా.. ఈ అరటిపండ్లు తింటే నిజంగా చనిపోతారా.. అసలు నిజాలు ఇవీ..