Sleep Psoriasis: సాధారణంగా కొందరు నిద్రలో నడిచే అలవాటు ఉంటుంది. పడుకున్న తర్వాత వారికి టాయిలెట్ వచ్చిన, వాటర్ తాగాలన్నా కూడా నిద్రలో లేచి నడిచి వెళ్తారు. కానీ వారు ఎదురుగా ఎవరు ఉన్నా కూడా పెద్దగా పట్టించుకోరు. అయితే కొందరు నిద్ర పోయేటప్పుడు ఛాతీపై ఎవరో కూర్చొన్నట్లు అనిపిస్తుంటుంది. దీనినే స్లీప్ పెరాలిసిస్ లేదా పక్షవాతం అంటారు. ఇది సాధారణంగా నిద్రలో జరుగుతుంది. దీన్ని పారాసోమ్నియా అంటారు. అయితే కేవలం ఇది నిద్రలో ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంది. ఇది సాధారణమేనని దీనివల్ల ఎలాంటి సమస్య లేదని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ స్లీప్ పక్షవాతంలో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి ఐసోలేటెడ్ స్లీప్ పక్షవాతం, రెండోద పునరావృత స్లీప్ పక్షవాతం. ఈ రెండు కూడా నిద్ర విషయంలో కాస్త ఆటంకం కలిగిస్తాయట. నిద్రలో ఉన్నప్పుడు ఎవరో ఒకరు ఛాతీపై ఉన్నప్పుడు కూర్చోవడం, ఉండటం వంటి లక్షణాలు అన్ని కనిపిస్తాయట. అలాగే కొందరికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీలో నొప్పి, ఒత్తిడి, భయం, అలసట వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయట.
ఈ స్లీప్ పక్షవాతంతో ఇబ్బంది పడేవారు ఎక్కువగా కలలో భయపడుతుంటారు. కొందరు నిద్రపోతున్నప్పుడు భయపడితే దాన్ని హిప్నాగోజిక్ భ్రాంతులు అని లేదా తెలివిగా ఉన్నప్పుడు నిద్రపోతే హిప్నోపోంపిక్‌గా భావిస్తారు. ఇందులో మళ్లీ మూడు రకాలు ఉంటాయి. కొందరు నిద్రలో ఉన్నప్పుడు గదిలో ఎవరైనా ఉన్నారని భయపడుతుంటారు. మరికొందరు ఊపిరాడకుండా ఎవరో చేస్తున్నారని భయపడుతుంటారు. అలాగే కొందరు బయట కాకుండా శరీరం లోపల భావాలు కలిగి ఉంటారు. అయితే ప్రతీ ఒక్కరూ కూడా ఏదో ఒక సమయంలో ఈ స్లీప్ పక్షవాతాన్ని అనుభవిస్తారట. కొందరికి ఎక్కువగా బాల్యం లేదా యవ్వనంలో ఈ సమస్య వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. అసలు ఈ సమస్య ఉందని కూడా కొందరికి తెలియదట. ఈ సమస్యకి పెద్దగా భయపడక్కర్లేదని నిపుణులు చెబుతుంటారు. కానీ స్లీప్ పెరాలసిస్ వల్ల నిద్రకు భంగం కలిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
స్లీప్ పెరాలసిస్ సమస్య నుంచి విముక్తి చెందాలంటే ముఖ్యంగా పాటించాల్సినది మన దినచర్య. రోజూ ఒకే సమయానికి నిద్రపోవడం, లేవడం వంటివి చేయడం వల్ల ఈ సమస్య నుంచి విముక్తి చెందుతారట. అలాగే నిద్రపోయేటప్పుడు గదిలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. కెఫిన్, మద్యపానం వంటి వాటికి దూరంగా ఉండాలి. నిద్రపోయే ముందు స్మార్ట్ ఫోన్‌కి చాలా దూరంగా ఉండాలి. ముఖ్యంగా రెండు గంటల ముందే రేడియేషన్ కళ్లపై పడకుండా చూసుకోవాలి. సరిగ్గా నిద్రపట్టడానికి వ్యాయామం వంటివి చేయడం అలవాటు చేసుకోవడం ఉత్తమం. ఇలాంటి నియమాలు పాటిస్తూ ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహిస్తే తప్పకుండా ఈ స్లీప్ పెరాలసిస్ సమస్య నుంచి బయట పడతారని నిపుణులు చెబుతున్నారు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.