https://oktelugu.com/

Sleep: భారీ దుప్పటి లేదా తేలిక దుప్పటి కప్పుకోవడం మంచిదా?

తేలిక దుప్పటి కప్పుకుంటే అసలు చలి కాయదని.. ఎక్కువగా భారీ దుప్పటిలకు ప్రాధాన్యత ఇస్తారు. అందులోనూ ఉత్తర భారత దేశంలో అయితే అసలు తేలిక దుప్పటిలు కనిపించవు. ఎందుకంటే ఇక్కడ చలి తీవ్రతను తట్టుకోవాలంటే భారీ దుప్పటిలే పనికొస్తాయి. అయితే నిద్రపోయేటప్పుడు భారీ దుప్పటి కప్పుకోవడం మంచిదేనా? లేకపోతే తేలిక దుప్పటి కప్పుకోవడం మంచిదా? అనే పూర్తి విషయాలు ఈ స్టోరీలో చూద్దాం.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 14, 2024 / 07:46 AM IST
    sleep

    sleep

    Follow us on

    Sleep: చలికాలం వచ్చేసింది. ప్రస్తుతం అన్ని చోట్ల చలి తీవ్రత పెరిగిపోయింది. బయట వాతావరణంలోనే కాకుండా ఇంట్లో ఉన్నా కూడా చలి ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో అయితే ఉష్ణోగ్రతలు కూడా చాలా తక్కువ అయ్యాయి. ఏ సమయంలో బయటకు వెళ్లిన కూడా చల్లని గాలులు వీస్తాయి. చలి వల్ల చాలా మందికి జలుబు, దగ్గు వంటివి వస్తాయి. దీనికి తోడు ఇంట్లో కూడా చల్లగా ఉండే ఈ సమస్య పెరుగుతుంది. ఈ సమస్య నుంచి విముక్తి చెందడానికి చాలా మంది బయటకు వెళ్లకుండా ఉంటారు. ఏదో తప్పని పరిస్థితుల్లో మాత్రమే బయటకు వెళ్తుంటారు. లేకపోతే ఇంట్లోనే దుప్పటి కప్పి పడుకుంటారు. అయితే చలికాలంలో ఎక్కువగా చాలా మంది భారీ దుప్పటులు వాడుతుంటారు. ఇవి అయితే చలి నుంచి కాపాడుతాయని నమ్ముతారు. తేలిక దుప్పటి కప్పుకుంటే అసలు చలి కాయదని.. ఎక్కువగా భారీ దుప్పటిలకు ప్రాధాన్యత ఇస్తారు. అందులోనూ ఉత్తర భారత దేశంలో అయితే అసలు తేలిక దుప్పటిలు కనిపించవు. ఎందుకంటే ఇక్కడ చలి తీవ్రతను తట్టుకోవాలంటే భారీ దుప్పటిలే పనికొస్తాయి. అయితే నిద్రపోయేటప్పుడు భారీ దుప్పటి కప్పుకోవడం మంచిదేనా? లేకపోతే తేలిక దుప్పటి కప్పుకోవడం మంచిదా? అనే పూర్తి విషయాలు ఈ స్టోరీలో చూద్దాం.

    సాధారణ దుప్పటి కంటే బరువుగా ఉండే దుప్పట్లను చలికాలంలో వాడాలని నిపుణులు చెబుతున్నారు. తేలిక దుప్పటి నుంచి గాలి చల్లగా తగులుతుంది. దీనివల్ల చలి తీవ్రత పెరుగుతుంది. అదే పూసలు, గుళికలు, పత్తి, అనేక ఇతర వస్తువులు ఉపయోగించి భారీ దుప్పట్లను వాడటం వల్ల చలి నుంచి విముక్తి పొందడమే కాకుండా ఒత్తిడి నుంచి కూడా బయటపడతారని నిపుణులు చెబుతున్నారు. బరువైన దుప్పటి కప్పుకున్నప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. అలాగే బాగా నిద్రపడుతుందని నిపుణులు అంటున్నారు. బరువైన దుప్పటి మన శరీరంపై ఉన్నప్పుడు కౌగిలించుకునే ఫీలింగ్ కలుగుతుంది. దీనివల్ల ఒత్తిడి, ఆందోళన వంటివి దూరం అవుతాయని నిపుణులు అంటున్నారు. ఎప్పుడైనా దుప్పటిని ఎంచుకునేటప్పుడు మన శరీర బరువులో 10 శాతం ఉండేలా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అయితే నవజాత శిశువులు లేదా చిన్న పిల్లలకు భారీ దుప్పట్లు కప్పకూడదు. వీటివల్ల పిల్లలు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడతారు.

    నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్న వారిపై పరిశోధనలు చేశారు. ఈ పరిశోధనల్లో తేలికపాటి దుప్పట్లతో పోలిస్తే బరువైన దుప్పట్లు కప్పుకున్న వారికే మంచి నిద్ర పడుతుందని తేలింది. అధిక బరువు ఉన్న దుప్పటి హాయిగా నిద్రపోయేలా చేస్తుందని నిపుణులు తెలిపారు.అలాగే దీర్ఘకాలిక నొప్పులతో బాధపడుతున్న వారికి కూడా బరువు దుప్పట్లు బాగా సహాయపడతాయి. ఇవి నొప్పులను తగ్గించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. కేవలం చిన్న పిల్లలు మాత్రమే బరువు దుప్పట్లను ఉపయోగించకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. వీటిని పాటించే ముందు తప్పకుండా వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.