Sleep: ఆరోగ్యంగా ఉండటానికి ఆహారం ఎంత అవసరమో.. నిద్ర కూడా అంతే ముఖ్యం. కంటి నిండా నిద్ర లేకపోతే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. చిన్న పిల్లలు లేదా పెద్దవాళ్లు అయిన కూడా సరిపడా నిద్ర ఉండాలి. అయితే ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ వల్ల చాలామంది తక్కువగా నిద్రపోతున్నారు. రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం, ఉదయం లేటుగా లేస్తున్నారు. పగలు ఎంత పడుకున్న.. రాత్రి నిద్ర చాలా ముఖ్యమైనది. ఒక్కరోజు నిద్ర లేకపోతే దాన్ని కవర్ చేసుకోవడానికి దాదాపు నాలుగు నుంచి ఐదు రోజుల నిద్ర అవసరం అవుతుంది. నిద్ర లేకపోతే రోజంతా కాస్త చిరాకుగా ఉంటుంది. ఏ పని మీద కూడా శ్రద్ధ పెట్టలేరు. బాడీకి సరైనా నిద్ర అందకపోతే.. గుండెపోటు, టైప్ 2 డయాబెటిస్, ఊబకాయం, డిప్రెషన్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. నిద్ర తక్కువ అయితే కొంతమందికి మానసిక సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి శరీరానికి సరిపడ నిద్ర అనేది తప్పనిసరి. అయితే చాలామందికి ఈ రోజుల్లోకి కళ్లు మూసిన వెంటనే నిద్రపట్టదు. వ్యక్తిగత కారణాల వల్ల ఆలోచించడం లేదా రేడియేషన్ వల్ల లేటుగా నిద్రపడుతుంది. బెడ్ మీదకు వెళ్లిన వెంటనే నిద్రపట్టాలంటే ప్రతీ ఒక్కరూ కూడా ఈ నియమం పాటించాల్సిందే. ఇంతకీ ఆ నియమం ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
చాలా మంది నిద్రపోయే ముందు కూడా టీ, కాఫీ వంటివి తాగుతుంటారు. వీటివల్ల నిద్రకు భంగం కలుగుతుంది. ఇలా కాకుండా ఉండాలంటే 10-3-2-1 రూల్ పాటించాలని నిపుణులు చెబుతున్నారు. నిద్రపోవడానికి పది గంటల ముందు కాఫీ, టీ వంటివి తాగకూడదు. అలాగే నిద్రపోవడానికి మూడు గంటల ముందు భోజనం పూర్తి చేయాలి. రెండు గంటల ముందు పని చేయడం ఆపేయాలి. గంట ముందు మొబైల్ చూడటం ఆపేయాలని నిపుణులు చెబుతున్నారు. ఇలా డైలీ పాటిస్తే బెడ్ మీదకు వెళ్లిన వెంటనే నిద్రపడుతుంది. చాలా మంది ఈ రోజుల్లో నిద్రపోయే వరకు కాఫీ తాగడం, మొబైల్ ఎక్కువగా వాడుతుంటారు. దీంతో ఆ కిరణాల వల్ల నిద్రపట్టదు. అలాగే కళ్ల సమస్యలు కూడా వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం జీవనశైలి అంతా మారిపోయింది. అందరూ ఆలస్యంగా నిద్రపోవడం, బయట ఫాస్ట్ ఫుడ్ తినడం వంటి కారణాల వల్ల చాలా మందికి ఈ అలవాటు మొదలైంది. ఈ అలవాటును మార్చుకోవాలంటే రోజూ ఒకే సమయానికి లేచి, ఒకే సమయానికి నిద్రపోవాలని నిపుణులు చెబుతున్నారు.
రాత్రిపూట సరిగ్గా నిద్రపట్టకపోతే అలసట, నీరసం, జీర్ణ సమస్యలు వంటివి వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సరిగ్గా నిద్రలేకపోతే జీర్ణ క్రియ దెబ్బతిని కడుపు, ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలు బారిన పడాల్సి వస్తుంది. కాబట్టి డైలీ తప్పకుండా తొందరగా నిద్రపోవడం అలవాటు చేసుకోండి. కొందరు రాత్రిపూట ఎక్కువగా పిండి పదార్థాలు తీసుకుంటారు. ఇలా చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే వీటిలో ఉండే పదార్థాలు వల్ల తొందరగా బరువు పెరగడంతో పాటు నిద్ర కూడా పట్టదు. అలాగే బాగా వేయించిన ఫుడ్, సిట్రిక్ ఆమ్లం వంటివి కూడా తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. వీటితోపాటు రాత్రి ఎక్కువ వాటర్ కంటెంట్ ఉండే పదార్థాన్ని అస్సలు తీసుకోకూడదు. ఎందుకంటే వీటి వల్ల రాత్రిపూట సరిగ్గా నిద్ర పట్టదు. ఎక్కువసార్లు టాయిలెట్‌కి వెళ్లవలసి వస్తుంది. దీంతో మీ నిద్రకు భంగం కలుగుతుంది.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. వీటిని పాటించే ముందు తప్పకుండా వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.