Sleep: నిద్ర అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. ఎలాంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉండాలంటే బాడీకి సరిపడా నిద్రపోవాలి. కానీ ఈరోజుల్లో చాలామంది సరిగ్గా నిద్రపోవడం లేదు. మారుతున్న జీవనశైలి, ఆహార పదార్థాలు, ఎక్కువగా మొబైల్ చూడటం వల్ల రేడియేషన్ వల్ల నిద్రలేమితో బాధపడుతున్నారు. కొందరు బాగా సోషల్ మీడియాకి అలవాటు పడి పూర్తిగా నిద్రపోవడం లేదు. దీంతో బాగా ఒత్తిడికి గురై శారీరక, మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. సాధారణంగా 8 గంటల నిద్ర అనేది ప్రతీ ఒక్కరికి ముఖమైనది. అంతకంటే తక్కువగా నిద్రపోతే చాలా అనారోగ్య సమస్యలను ఫేస్ చేయాల్సి వస్తుంది. ఈరోజుల్లో చాలా మంది కేవలం 5 నుంచి 6 గంటలు మాత్రమే నిద్రపోతున్నారు. ఇలా తక్కువ గంటలు నిద్రపోతే వచ్చే 20 ఏళ్లలో ప్రమాదకరమైన మార్పులు చూడాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి అవేంటో తెలుసుకోవాలని ఉందా.. అయితే ఆర్టికల్ చదివేయండి.
బాడీకి సరిపడా కాకుండా తక్కువగా నిద్రపోతే చిన్న వయస్సులోనే వృద్ధాప్య ఛాయలు కనిపిస్తాయని బెన్సర్ ఫర్ బెడ్స్ అనే సంస్థ పరిశోధనల్లో తేలింది. చిన్న వయస్సులో ఇలా కనిపించడంతో పాటు ఎక్కువగా వెన్ను నొప్పితో బాధపడటం, మానసిక సమస్యలు, అంద విహీనంగా కనిపించడం, బాగా సన్నగా మారడం, బాడీలో కేవలం అస్తి పంజరం మాత్రమే కనిపించడం జరుగుతుందని ఈ అధ్యయనాల్లో తేలింది. వచ్చే 20 ఏళ్లలో చూడటానికి మనుషులు లాగా కాకుండా ఏదో కొత్త ప్రపంచాన్ని చూసినట్లు ఉంటుందని నిపుణులు అంటున్నారు. నిద్రలేమి సమస్య ఉంటే రోగనిరోధక శక్తి కూడా పూర్తిగా తగ్గిపోతుంది. దీంతో జ్వరం, దగ్గు, ఇన్ఫెక్షన్లతో పాటు గుండె జబ్బులు, డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక సమస్యల బారిన పడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఒక మనిషి ఆరోగ్యంగా జీవించాలంటే మాత్రం ఫుడ్‌తో పాటు నిద్ర కూడా చాలా ముఖ్యమైనది. కాబట్టి మొబైల్, వర్క్ అని నిద్రను పక్కన పెట్టవద్దు. బాడీకి సరిపడా ఎంత ఎక్కువగా నిద్రపోతే ఆరోగ్యానికి అంత మంచిది. కాబట్టి రాత్రిపూట తప్పనిసరిగా 8గంటలు నిద్రపోయేలా ప్లాన్ చేసుకోండి. అలాగే నిద్రపోయే రెండు నుంచి మూడు గంటల ముందు మొబైల్, టీవీ, ల్యాప్‌ట్యాప్ వంటి రేడియేషన్‌ను చూడవద్దు. వీటి నుంచి వచ్చే కిరణాల వల్ల నిద్ర సరిగ్గా పట్టదు. అలాగే సాయంత్రం సమయాల్లో కెఫిన్ ఉండే కాఫీ, టీ వంటివి కూడా అసలు తీసుకోవద్దు. ఇవి నిద్రకు భంగం కలిగిస్తాయని నిపుణులు చెబుతున్నారు. వీటితో పాటు రాత్రిపూట తొందరగా భోజనం చేసేలా ప్లాన్ చేసుకోండి. మీరు నిద్రపోవడానికి రెండు గంటల ముందు భోజనం చేస్తే తినే ఫుడ్ జీర్ణం అవుతుంది. దీంతో మీకు హాయిగా నిద్రపడుతుంది.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. వీటిని పాటించే ముందు తప్పకుండా వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.