https://oktelugu.com/

Sleep: స్నానం చేసిన వెంటనే నిద్రపోతే.. వామ్మో ఇంత డేంజర్ హా!

శరీరానికి సరిపడ నిద్ర అనేది తప్పనిసరి. అయితే ఈ నిద్ర బాగా పట్టాలని కొందరు స్నానం చేసి పడుకుంటారు. స్నానం చేసి నిద్రపోతే హాయిగా పడుకుంటారు. కానీ ఆరోగ్యానికి ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి స్నానం చేసి నిద్రపోవడం వల్ల కలిగే నష్టాలేంటో ఈ స్టోరీలో చూద్దాం.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 8, 2024 / 10:18 PM IST

    sleep

    Follow us on

    Sleep: ఆరోగ్యంగా ఉండటానికి ఆహారం ఎంత అవసరమో.. నిద్ర కూడా అంతే ముఖ్యం. కంటి నిండా నిద్ర లేకపోతే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. చిన్న పిల్లలకి అయిన పెద్దవాళ్లకైనా సరిపడ నిద్ర అనేది తప్పనిసరి. అయితే ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ వల్ల చాలామంది తక్కువగా నిద్రపోతున్నారు. రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం, ఉదయం లేటుగా నిద్ర లేస్తున్నారు. పగలు ఎంత పడుకున్న.. రాత్రి నిద్ర చాలా ముఖ్యమైనది. ఒక్కరోజు నిద్ర లేకపోతే దాన్ని కవర్ చేసుకోవడానికి దాదాపు నాలుగు నుంచి ఐదు రోజుల నిద్ర అవసరం అవుతుంది. నిద్ర లేకపోతే రోజంతా కాస్త చిరాకుగా ఉంటుంది. ఏ పని మీద కూడా శ్రద్ధ పెట్టలేరు. బాడీకి సరైనా నిద్ర అందకపోతే.. గుండెపోటు, టైప్ 2 డయాబెటిస్, ఉబకాయం, డిప్రెషన్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. నిద్ర తక్కువ అయితే కొంతమందికి మానసిక సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి శరీరానికి సరిపడ నిద్ర అనేది తప్పనిసరి. అయితే ఈ నిద్ర బాగా పట్టాలని కొందరు స్నానం చేసి పడుకుంటారు. స్నానం చేసి నిద్రపోతే హాయిగా పడుకుంటారు. కానీ ఆరోగ్యానికి ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి స్నానం చేసి నిద్రపోవడం వల్ల కలిగే నష్టాలేంటో ఈ స్టోరీలో చూద్దాం.

    సాధారణంగా పగటి సమయంలో స్నానం చేసిన వెంటనే ఎవరూ నిద్రపోరు. కానీ రాత్రి సమయంలో మాత్రం నిద్రపోయే తప్పకుండా స్నానం చేస్తారు. ఎందుకంటే హాయిగా నిద్ర పడుతుందని భావనతో స్నానం చేస్తారు. అయితే ఇలా స్నానం చేసి నిద్రపోవడం వల్ల మెదడు దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిద్రపోయే సమయంలో బాడీలో ఉష్ణోగ్రతలు మారడంతో మెదడు ఆరోగ్యం దెబ్బతింటుంది. కొందరు అయితే చల్లని నీటితో కాకుండా వేడి నీటితో స్నానం చేస్తారు. ఇలా చేయడం వల్ల వెంటనే నిద్ర పడుతుంది ఏమో. కానీ గుండె పోటు వచ్చే ప్రమాదం ఉందట. శరీర ఉష్ణోగ్రత ఒక్కసారిగా పెరిగి రక్తపోటు పెరుగుతుంది. దీంతో గుండె పోటు వచ్చే ప్రమాదాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే బాడీలో అలసట పెరిగి ఒత్తిడి, డిప్రెషన్‌లోకి వెళ్లడం కూడా జరుగుతుంది.

    కొందరు భోజనం చేసిన తర్వాత స్నానం చేసి నిద్రపోతారు. సాధారణంగా రాత్రిపూట తిని నిద్రపోతే బరువు పెరుగుతారు. అలాగే జీర్ణ సమస్యలు కూడా వస్తాయి. తిని, స్నానం చేసి నిద్రపోవడం వల్ల ఆహారం జీర్ణం కాదు. దీంతో అసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణ స్నానం చేస్తే మరికొందరు తలస్నానం చేసి నిద్రపోతారు. దీనివల్ల జుట్టు రాలిపోతుంది. ఎందుకంటే జుట్టు పొడిగా కాకుండా తేమగా ఉంటే తొందరగా వెంట్రుకలు రాలిపోతాయి దీంతో తలపై దురద, చుండ్రు వంటివి వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి స్నానం చేసి వెంటనే నిద్ర పోవద్దు.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. వీటిని పాటించే ముందు తప్పకుండా వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.