Sleep: చలికాలం ప్రారంభమైంది. ప్రస్తుతం చలి తీవ్రత కూడా రోజురోజుకీ పెరుగుతుంది. దీంతో చాలా మంది శరీరమంతా దుప్పటి కప్పుకుని పడుకుంటారు. ఇలా నిద్రపోవడం వల్ల కాళ్లు, చేతులకు గాలి తగలకుండా ఉంటుందని చేస్తారు. అయితే ముఖం నిండి కప్పుకుని నిద్రపోవడం వల్ల చలి ఉండదు.. హాయిగా నిద్రపోవచ్చని భావిస్తారు. కానీ దీనివల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొందరు కేవలం చలికాలంలోనే కాకుండా ప్రతీ సీజన్‌లో కూడా ముఖం నిండా కప్పుకుని నిద్రపోతారు. అయితే ఏ సీజన్‌లో అయిన ఇలా కప్పుకుని నిద్రపోవడం వల్ల చర్మం దెబ్బతింటుంది. బయట గాలి లోపలికి రాకుండా దుప్పటి మొత్తం కప్పుకుని నిద్రపోతారు. కానీ దుప్పటి లోపల ఉండే అపరిశుభ్రమైన గాలి మాత్రం బయటకు వెళ్లదు. ఈ గాలిని పీల్చడం వల్ల శరీర ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు చర్మ ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. మీ స్కిన్ కలర్ ఈజీగా మారిపోతుంది. అలాగే ముఖంపై మొటిమలు, మచ్చలు వంటివి ఏర్పడతాయి. వీటితో పాటు వృద్ధాప్య ఛాయలు కూడా తొందరగా వస్తాయని నిపుణులు చెబుతున్నారు.
కొంచెం కూడా ఖాళీ లేకుండా ముఖం మొత్తానికి దుప్పటి కప్పడ వల్ల ఊపిరితిత్తులకు పూర్తిగా గాలి అందదు. దీనివల్ల అవి కుంచించుకుపోతాయి. దీంతో మీకు ఆస్తమా, తలనొప్పి, జలుబు, దగ్గు వంటి సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పూర్తిగా గాలి లోపలికి వెళ్లకపోవడం వల్ల కొందరికి ఊపిరి కూడా ఆడదు. దీనివల్ల శ్వాసకోశ సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే శరీర భాగాలకు ఆక్సిజన్ అందదు. దీంతో గుండె పోటు వచ్చే ప్రమాదం కూడా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొందరికి తలనొప్పి, వికారం, వాంతులు కూడా అయ్యే ప్రమాదం ఉంటుంది. ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే తప్పకుండా శరీర భాగాలకు ఆక్సిజన్ అందాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉంటారు. కానీ దుప్పటి ఇలా కప్పుకోవడం వల్ల ఆక్సిజన్ అందక రక్తప్రసరణ జరగదు. దీంతో మెదడు పనితీరు తగ్గుతుంది. దుప్పటి లోపల ఆక్సిజన్ లేకపోవడం వల్ల కార్బన్ డై ఆక్సైడ్ లెవెల్స్ పెరుగుతాయి. దీంతో ఆలోచన శక్తి పూర్తిగా తగ్గిపోతుంది.
ఇలా ముఖం మొత్తం దుప్పటి కప్పుకుని నిద్రపోవడం వల్ల కొందరి నిద్రకు భంగం కలుగుతుంది. ఎందుకంటే ఫుల్‌గా కప్పుకుంటే కొన్నిసార్లు చెమటలు పడతాయి. దీంతో సరిగ్గా నిద్రపోలేరు. అలాగే లోపలికి గాలి వెళ్లకపోవడం వల్ల జుట్టు కూడా రాలిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిండుగా దుప్పటి కప్పుకుని నిద్రపోవడం వల్ల లోపల గాలిని పీల్చవలసి వస్తుంది. దీంతో గొంతు ఎక్కువగా పొడిబారుతుంది. అలాగే అలసట కూడా కలుగుతుంది. లేచిన వెంటనే నీరసంగా అనిపిస్తుంది. కాబట్టి గాలి చొరబడకుండా మొత్తం దుప్పటి కప్పుకుని నిద్రపోవద్దు. కాస్త లోపలికి గాలి వెళ్లేలా ప్లాన్ చేసుకోండి.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.