Skin Health: పటిక గురించి అందరికీ తెలిసిందే. ఇంటి ముందు దిష్టికి పెట్టడం, గోరింటాకు బాగా పండటానికి ఉపయోగిస్తుంటారు. చాలామంది దీనిని అనేక ప్రయోజనాల కోసం వాడుతుంటారు. ముఖ్యంగా వృద్ధులు అయితే షేవింగ్ చేసుకున్న తర్వాత ముఖానికి పటికను పూస్తుంటారు. ఇలా చేయడం వల్ల చర్మం ఎలాంటి సమస్యలకు గురి కాకుండా ఉంటుందని నమ్ముతారు. అయితే పటిక కేవలం ఆరోగ్యానికి, చర్మానికి ఎంతో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. చర్మాన్ని మెరుగుపరచి, ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరచడంతో సమస్యలను తగ్గిస్తుందని నిపుణులు అంటున్నారు. పటికలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ బయోటిక్ గుణాలు చర్మం, జుట్టు ఆరోగ్యాలని మెరుగుపరుస్తాయి. అయితే చాలా మంది అమ్మాయిలు చర్మ సౌందర్యాన్ని పెంచుకోవడానికి రకరకాల టిప్స్ పాటిస్తుంటారు. ముఖ్యంగా ముఖానికి క్రీంలు రాస్తుంటారు. వీటికి బదులు ఈ పటికతో ఈ చిన్న టిప్ పాటిస్తే ఎలాంటి చర్మమైన మెరుస్తుంది. ముఖ్యంగా ఇందులో నిమ్మరసం కలిపి ముఖానికి అప్లై చేస్తే అందం మీ సొంతం అవుతుంది. మరి పటికలో నిమ్మకాయను కలిపి ముఖానికి అప్లై చేస్తే కలిగే ప్రయోజనాలేంటో చూద్దాం.
డెడ్ స్కిన్ క్లియర్
సాధారణంగా కొందరి చర్మం పొడిబారుతుంది. దీంతో ముఖంపై మొటిమలు, మచ్చలు వస్తాయి. దీనివల్ల అసలు అందంగా కూడా కనిపించరు. అయితే ముఖానికి నిమ్మకాయ, పటిక కలిపి పెడితే చర్మంపై ఉండే మృత కణాలు అన్ని కూడా తొలగిపోతాయి. దీన్ని అప్లై చేసి కాస్త మసాజ్ చేస్తే ముఖం మెరుస్తుంది. వారానికి ఒకసారి అయిన కూడా ఇలా చేయడం చర్మ ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు.
ముఖంపై మచ్చలు
ముఖంపై కొందరికి మొటిమలు అయితే వాటిని నొక్కుతారు. దీంతో ముఖంపై మచ్చలు ఉండిపోతాయి. ఇలాంటి వారు పటిక, నిమ్మరసం కలిపి ముఖానికి అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల మొటిమలతో పాటు మచ్చలు కూడా తగ్గుతాయి. ఫేస్‌పై ఎలాంటి డెడ్ స్పాట్స్ లేకుండా క్లియర్ అవుతాయి. అలాగే మీ ముఖ సౌందర్యం కూడా పెరుగుతుంది.
ముడతలు తగ్గుతాయి
కొందరికి వయస్సు పెరిగిపోయినట్లు తొందరగా ముడతలు వస్తాయి. దీంతో యంగ్‌గా కనిపించరు. అలాంటి వారు చర్మానికి పటిక, నిమ్మరసం కలిపి అప్లై చేయడం వల్ల అందంగా కనిపిస్తారు. మీ ముఖంపై ఉండే ముడతలు అన్ని కూడా క్లియర్ అవుతాయి. ఎలాంటి ముడతలు లేకుండా ఎప్పటికీ యంగ్ లుక్‌లో కనిపిస్తారు.
జుట్టు మెరుస్తుంది
జుట్టు విషయంలో కూడా పటిక బాగా ఉపయోగపడుతుందని నిపుణులు అంటున్నారు. ఇందులోని పోషకాలు జుట్టును మృదువుగా ఉంచడంలో బాగా సహాయపడతాయి. పటిక, నిమ్మరసం వల్ల జుట్టు మెరుస్తుంది. వారానికి ఒకసారి అయిన కూడా జుట్టుకి పటిక పెట్టడం వల్ల ఆరోగ్యంగా ఉంటుంది. రాలిపోయే సమస్య కూడా క్లియర్ అవుతుంది.
చుండ్రును తొలగిస్తుంది
పటిక, నిమ్మకాయల రసం కలిపి జుట్టుకు అప్లై చేయడం వల్ల చుండ్రు తగ్గుతుంది. ఇందులోని యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు చుండ్రును తగ్గించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. అలాగే స్కాల్ప్‌లో ఎలాంటి బ్యాక్టీరియా, ఇన్‌ఫెక్షన్లకు గురికాకుండా కాపాడతాయి.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. వీటిని పాటించే ముందు తప్పకుండా వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.