https://oktelugu.com/

Skin Health: గొడ్డు మాంసం కొవ్వుతో ముఖ సౌందర్యం.. ఎలాగంటే?

పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు ఉండే ఈ పదార్థాలను తీసుకోవడం వల్ల కేవలం అందం మాత్రమే పెరగడంతో పాటు శరీర ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అయితే ఈ మధ్య కాలంలో చర్మ సౌందర్యాన్ని పెంపొందించుకోవడానికి గొడ్డు మాంసం కొవ్వును ఉపయోగిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. వీటి నుంచి కొవ్వులతో అసలు చర్మ సౌందర్యం పెంచుకోవడం ఎలాగో మనం ఈ స్టోరీలో చూద్దాం.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 13, 2025 / 03:31 AM IST

    skin glow

    Follow us on

    Skin Health: అందానికి అమ్మాయిలు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. అందరిలో అందంగా కనిపించాలని ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ముఖ్యంగా చర్మం కాంతివంతంగా మెరవడానికి ఎన్నో బ్యూటీ ప్రొడక్ట్స్ వాడటంతో పాటు చిన్న చిన్న సహజ చిట్కాలు కూడా పాటిస్తుంటారు. అయితే అందంగా కనిపించాలంటే కేవలం ఇలా బ్యూటీ ప్రొడక్ట్స్ మాత్రమే వాడితే సరిపోదు. ఆహారంలో కూడా కొన్ని రకాల పదార్థాలు చేర్చుకోవాలి. వీటివల్ల తొందరగా ముసలితనం రాకుండా యంగ్ లుక్‌లో కనిపిస్తారు. పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు ఉండే ఈ పదార్థాలను తీసుకోవడం వల్ల కేవలం అందం మాత్రమే పెరగడంతో పాటు శరీర ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అయితే ఈ మధ్య కాలంలో చర్మ సౌందర్యాన్ని పెంపొందించుకోవడానికి గొడ్డు మాంసం కొవ్వును ఉపయోగిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. వీటి నుంచి కొవ్వులతో అసలు చర్మ సౌందర్యం పెంచుకోవడం ఎలాగో మనం ఈ స్టోరీలో చూద్దాం.

    గొడ్డు మాంసం కొవ్వుతో పాటు ఇతర జంతువులో కూడా కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. ఇవి చర్మ రంధ్రాలను మూసుకుపోయే విధంగా చేస్తుంది. దీంతో చర్మంపై మొటిమలు రాకుండా కాపాడుతుంది. ఈ కొవ్వు చర్మానికి హాని కలిగిస్తుందని కొందరు భావిస్తారు. కానీ వీటి వల్ల చర్మ సౌందర్యం మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. గొడ్డు మాంసం కొవ్వులో హైలురోనిక్ యాసిడ్, రెటినాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మం మెరిసేలా చేస్తాయి. ఈ కొవ్వుతో తయారు చేసిన పదార్థాలను వాడటం వల్ల ముఖంపై ఉండే మొటిమలు, మచ్చలు అన్ని కూడా తొలగిపోతాయి. దీంతో ముఖం ప్రకాశవంతంగా తయారు అవుతుందని నిపుణులు చెబుతున్నారు.

    గొడ్డు మాంసం కొవ్వును గాలి వెళ్లని గాజు కంటైనర్‌లో నిల్వ ఉంచుకోవాలి. ఇలా ఉంచితేనే చర్మానికి ప్రతిఫలం ఉంటుంది. లేకపోతే ముఖంగా జిడ్డుగా ఉండటంతో మొటిములు ఎక్కువగా అవుతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే కొందరికి వీటివల్ల అలెర్జీలు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి వీటిని చర్మానికి అప్లై చేసి ఒక 24 గంటల పాటు చూడాలి. ఆ తర్వాత చర్మంపై ఎలాంటి దద్దర్లు రాకపోతే వాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. వీటిని పాటించే ముందు తప్పకుండా వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.