https://oktelugu.com/

Skin: ఈ ఆకుతో సొగసైన అందం మీ సొంతం.. ఎలా అంటే?

మునగాకు తినడం వల్ల కేవలం ఆరోగ్య ప్రయోజనాలు మాత్రమే కాకుండా.. చర్మ సౌందర్యాన్ని కూడా పెంచుకోవచ్చు. కేవలం మునగాకు మిమ్మల్ని మీరే గుర్తుపట్టలేనంతగా కూడా మారవచ్చు. అసలు ఈ ఆకులతో ఎలా అందాన్ని పెంచుకోవచ్చో తెలియాలంటే మీరు ఈ ఆర్టికల్ చదవాల్సిందే.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : October 23, 2024 / 02:15 AM IST

    Drumsticks

    Follow us on

    Skin: ఆరోగ్యానికి మేలు చేసే ఆకుకూరల్లో మునగాకు ఒకటి. ఇందులో ఉండే పోషకాలు శరీర ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. డైలీ ఈ మునగాకులను వండుకుని తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి కీళ్ల నొప్పులు, ఉబ్బసం, అజీర్ణం, జ్వరం వంటి ఎన్నో సమస్యల నుంచి విముక్తి కల్పిస్తుంది. వీటితో పాటు జుట్టు రాలే సమస్యను కూడా తగ్గించడంలో బాగా ఉపయోగపడుతుంది. ఇలా ఒకటేంటి.. చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే చాలా మంది మునగాకు తినడానికి అంతగా ఇష్టపడరు. బయట దొరికే ఫాస్ట్‌ఫుడ్ తినడానికి చూపించేంత ఇంట్రెస్ట్ వీటి మీద ఉండదు. ఇదిలా ఉండగా.. మునగాకు తినడం వల్ల కేవలం ఆరోగ్య ప్రయోజనాలు మాత్రమే కాకుండా.. చర్మ సౌందర్యాన్ని కూడా పెంచుకోవచ్చు. కేవలం మునగాకు మిమ్మల్ని మీరే గుర్తుపట్టలేనంతగా కూడా మారవచ్చు. అసలు ఈ ఆకులతో ఎలా అందాన్ని పెంచుకోవచ్చో తెలియాలంటే మీరు ఈ ఆర్టికల్ చదవాల్సిందే.

     

    అందరిలో అందంగా కనిపించాలని అమ్మాయిలు ఎక్కువగా రసాయనాలు ఉండే ప్రొడక్ట్స్ వాడుతుంటారు. దీనివల్ల ముఖంపై మొటిమలు, మచ్చలు వస్తుంటాయి. దీనివల్ల ఉన్న అందం కూడా పాడవుతుంది. ఇలా మొటిమలతో ఎవరైనా బాధపడుతున్నట్లయితే.. మునగాకు బాగా ఉపయోగపడుతుంది. మునగాకును ఆహారంలో చేర్చుకుంటే అందులోని పోషకాల వల్ల మొటిమలు తగ్గుతాయి. ఇందులో యాంటీ ఏజింగ్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి వృద్ధాప్యం తొందరగా రాకుండా కాపాడటంతో పాటు యంగ్‌ లుక్‌లో ఉండేలా చేస్తుంది. డైలీ వీటిని తినడం వల్ల యవ్వనంగా ఉంటారు. మార్కెట్లో దొరికే రసాయనాలు వాడటం కంటే సహజంగా ఇలాంటి చిట్కాలను పాటిస్తే.. మొటిమల నుంచి తొందరగా బయటపడతారు.

     

    మునగాకును తినడం వల్ల మాత్రమే కాకుండా వాటి పేస్ట్‌తో కూడా సొగసైన అందాన్ని పెంచుకోవచ్చు. తాజా మునగాకుని తీసుకుని పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను ముఖానికి పట్టించిన లేకపోతే, దాని నుంచి తీసిన రసాన్ని అయిన ముఖానికి అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై ఉండే ట్యాన్ అంతా తగ్గిపోతుంది. చర్మం కాంతివంతంగా ఉంటుంది. అయితే ఈ చిట్కాలను కనీసం వారానికొకసారి అయిన చేస్తే చర్మం కాంతివంతంగా మెరుస్తుంది. ఇలా పేస్ట్ చేసుకునేంత సమయం లేదని భావిస్తే.. కనీసం ఆహారంలో అయిన చేర్చుకోండి. అయితే మునగాకు రసం మార్కెట్లో దొరుకుతుంది. కానీ ఇది సహజంగా ఉండదు. ఎన్నో రసాయనాలు కలిపి దీనిని తయారు చేస్తారు. కాబట్టి ఇంట్లోనే సహజంగా చేసుకోవడం మేలు. దీనివల్ల చర్మం కాంతివంతంగా ఉండటంతో పాటు ఆరోగ్యంగా కూడా ఉంటారు. ఎన్నో రకాల వ్యాధుల నుంచి విముక్తి కల్పించడంలో మునగాకు ముఖ్య పాత్ర వహిస్తుంది. కాబట్టి తప్పనిసరిగా మునగాకును డైట్‌లో చేర్చుకోవడం మంచిది.

     

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.