https://oktelugu.com/

Skin: చలికాలంలో చర్మాన్ని రక్షించాలంటే.. ఎలాంటి చిట్కాలు పాటించాలో మీకు తెలుసా?

ఇంట్లోనే కొన్ని చిట్కాలు పాటిస్తే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. వీటివల్ల ముఖంపై ఉండే మొటిమలు తగ్గిపోవడంతో పాటు కాంతివంతంగా మెరుస్తుంది. మరి ఈ చలికాలంలో చర్మ విషయంలో పాటించాల్సిన ఆ సహజ చిట్కాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 4, 2024 4:42 pm
    skin glow

    skin glow

    Follow us on

    Skin: సాధారణంగా చాలామంది చర్మ ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ముఖ్యంగా చలికాలం వచ్చిందంటే చెప్పక్కర్లేదు. ఎంత కేర్ తీసుకున్న కూడా దెబ్బతింటుంది. చర్మం ఎంత ఆరోగ్యంగా ఉంటే అంత అందంగా కనిపిస్తారు. చర్మ విషయంలో అసలు జాగ్రత్త వహించకపోతే చర్మంపై మెటిమలు, మచ్చలు వస్తు్ంటాయి. అయితే అందంగా ఉండాలని కొందరు మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ వాడుతుంటారు. ఇవి చర్మ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్‌లో రసాయనాలు కలిపి తయారు చేస్తారు. ఇవి చర్మ సంబంధిత సమస్యలు వచ్చేలా చేస్తాయి. ఇలాంటి రసాయనాలు ఉండే ప్రొడక్ట్స్ వాడకుండా ఇంట్లోనే కొన్ని చిట్కాలు పాటిస్తే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. వీటివల్ల ముఖంపై ఉండే మొటిమలు తగ్గిపోవడంతో పాటు కాంతివంతంగా మెరుస్తుంది. మరి ఈ చలికాలంలో చర్మ విషయంలో పాటించాల్సిన ఆ సహజ చిట్కాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

    సహజ చందనం
    చందనం కర్రతో సహజంగా రంగదీసి దాన్ని ముఖానికి అప్లై చేస్తే చర్మం అందంగా ఉంటుంది. చలికాలంలో చర్మానికి ఎలాంటి మాయిశ్చరైజింగ్ కూడా వాడవసరంలేదు. ఇందులో పాలు కలిపి ముఖానికి అప్లై చేస్తే ట్యాన్ అంతా పోతుంది. అయితే మార్కెట్లో దొరికే గంధం పొడి కాకుండా సహజంగా చందనాన్ని తయారు చేసుకుని రాస్తేనే మంచి ఫలితం ఉంటుంది.

    బార్లీ పిండి
    ఆరోగ్యానికి మేలు చేసే బార్లీ పిండితో కూడా ముఖాన్ని అందంగా ఉంచుకోవచ్చు. ఇందులోని పోషకాలు ముఖంపై మొటిమలు రాకుండా కాపాడుతుంది. ఒక చెంచా బార్లీ పిండిలో పాలు కలిపి ఆ మిశ్రమాన్ని స్క్రబ్‌లా ఉపయోగించాలి. దీన్ని చర్మానికి అప్లై చేయడం వల్ల మృత కణాలు అన్ని తొలగిపోతాయి. చర్మం కాంతివంతంగా ప్రకాశిస్తుంది.

    శనగపిండి
    శనగపిండిలో చర్మాన్ని కాంతివంతంగా ఉంచే పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ శనగపిండిలో పసుపు, పెరుగు కలిపి ప్యాక్ తయారు చేసుకోవాలి. ఈ ప్యాక్‌ను చర్మానికి అప్లై చేస్తే ముఖం చాలా శుభ్రంగా ఉంటుంది. పసుపులో యాంటీ సెప్టిక్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అలాగే శనగపిండి కూడా ఎక్స్‌పోలియేటింగ్ ఏజెంట్‌గా కూడా పనిచేస్తుంది. దీనివల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. ముఖంపై ఏవైనా మొటిమలు, మచ్చలు ఉన్నా కూడా తొలగిపోతాయి. చాలా క్లియర్‌గా ఫేస్ ఉంటుంది.

    కాఫీ పౌడర్
    చర్మంపై ఎలాంటి మెటిమలు, మచ్చలు లేకుండా క్లియర్‌గా ఉండాలంటే కాఫీ పౌడర్ బాగా ఉపయోగపడుతుంది. కాఫీలోని యాంటీ ఏజింగ్ లక్షణాలు చర్మాన్ని శుభ్రం చేస్తాయి. కాఫీ పౌడర్‌లో రోజ్ వాటర్ కలిపి ముఖానికి ప్యాక్ వేయాలి. నెమ్మదిగా చర్మాన్ని మర్దన చేసి ఒక పది నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడిగేయాలి. ఇలా వారానికొకసారి చేస్తే చర్మం కాంతివంతంగా మెరుస్తుంది. ఇందులో పాలు, పెరుగు, పసుపు కూడా కలుపుకోవచ్చు. వీటిన్నింటిలోని పోషకాలు చలి కాలంలో చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

     

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.