Sitz bath: మనలో చాలా మందికి సిట్జ్ బాత్ గురించి పెద్దగా తెలియదు. ఈ సిట్జ్ బాత్‌ను ఎక్కువగా మలద్వారం సమస్యలకు వాడుతారు. కూర్చోవడానికి వీలుగా ఉండే టబ్‌లో హాట్ వాటర్ వేసి కూర్చుంటారు. దీనినే సిట్జ్ బాత్ లేదా హిప్ బాత్ అని అంటారు. ఇలా వేడినీటిలో కూర్చోవడం వల్ల ఫైల్స్, మలబద్ధకం, ఫెరియానల్ ఫిస్టులాస్, మూత్రాశయం వ్యాధులు, యోని ఇన్ఫెక్షన్లకి ఎక్కువగా ఈ సిట్జ్ బాత్ చేస్తుంటారు. ముఖ్యంగా పైల్స్, ఫిస్టులా ఆపరేషన్ చేయించుకున్న వారు, ఈ సమస్యలతో బాధపడే వారు నొప్పి నుంచి విముక్తి చెందడానికి ఈ సిట్జ్ బాత్ బాగా ఉపయోగపడుతుంది. గోరువెచ్చని నీటిలో కూర్చోవడం వల్ల మలద్వారం దగ్గర ఎలాంటి ఇన్ఫెక్షన్లు ఉన్నా తగ్గుతాయని నిపుణులు చెబుతుంటారు. వేడి నీటికి ఆ భాగంలో నొప్పి, దురద ఏవి ఉన్నా కూడా తగ్గుతాయి. ఆ ప్రదేశం కూడా శుభ్రం అవుతుంది. మలద్వారం, యోని సమస్యలతో బాధపడేవారికి ఈ సిట్జ్ బాత్ బాగా ఉపయోగపడుతుంది.
ఈ సిట్జ్ బాత్‌ను హేమోరాయిడ్లు, ఆసన పగుళ్లు, పెరియానల్ ఫిస్టులాస్, మల శస్త్రచికిత్స, ఎపిసియోటమీ, గర్భాశయ తిమ్మిరి, ఇన్‌ఫ్లమేటరీ ప్రేగు వ్యాధి, పైలోనిడల్ తిత్తులు, మూత్రాశయం, ప్రోస్టేట్ లేదా యోని అంటువ్యాధులు, ఇన్ఫెక్షన్ ఉన్నవారు ఎక్కువగా చేస్తారు. ఈ సమస్యల నుంచి దీర్ఘకాలికంగా బాధపడుతుంటే సిట్జ్ బాత్ ఉపశమనం కల్పిస్తుంది. అయితే ఈ సిట్జ్ బాత్‌ను ఎక్కువగా చేయకూడదు. మూత్ర విసర్జనలో తీవ్రంగా నొప్పి ఉంటే రోజుకి ఒక పది నిమిషాలు చేయాలి. తక్కువగా ఉంటే వారానికొకసారి అలా చేయాలి. సిట్జ్ బాత్ చేసిన తర్వాత జననాంగాలను కాటన్ క్లాత్‌తో మొత్తగా తుడవాలి. ఎక్కువ గట్టిగా రుద్దకుండా మెల్లగా చేయాలి. గర్భిణులు అయితే వైద్యుని సూచనల మేరకు మాత్రమే సిట్జ్ బాత్ చేయాలి.
జీవనశైలిలో మార్పుల వల్ల ఈ మధ్య కాలంలో చాలా మంది మలబద్ధకంతో ఇబ్బంది పడుతున్నారు. ఇది కాస్త తీవ్రం అయ్యి, పైల్స్‌కి దారి తీస్తుంది. వాటర్ ఎక్కువగా తాగకపోవడం, ఆహారంలో ఫైబర్ లేకపోవడం, మాంసాహారం, ఫాస్ట్‌ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల బాడీ డీహైడ్రేట్‌కి గురై ఈ సమస్య వస్తుంది. దీనిని తగ్గించుకోవడానికి ఎన్ని మందులు వాడిన వ్యర్థమే. ఒక్కసారి వస్తే ఇక జీవితాంతం సమస్య ఉన్నట్లే. కొందరు దీనికి శస్త్ర చికిత్స కూడా చేసుకుంటారు. అయినా కూడా మళ్లీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ సమస్య బారిన పడకుండా ఉండాలంటే జ్యూస్‌లు ఎక్కువగా తాగడం, ఆహారంలో ఫైబర్ యాడ్ చేయడం, తృణ ధాన్యాలు తీసుకోవడం, వాటర్ ఎక్కువగా తాగడం వంటివి చేయాలి. అప్పుడే సమస్య నుంచి బయటపడతారు. లేకపోతే ఈ సమస్య తీవ్రమై.. కొన్నిసార్లు చనిపోయే ప్రమాదం కూడా ఉంది.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.