Singapore strict laws: సినిమా హాళ్లలో.. రైల్వే స్టేషన్లలో.. కొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఎక్కడ చూసినా గుట్కా మరకలు కనిపిస్తూ ఉంటాయి. కొంతమంది గుట్కా తింటూ ఇష్టం వచ్చినట్లు ఉమ్మేస్తుంటారు. అయితే రైల్వే స్టేషన్లలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ చాలామంది ప్రయాణాలు చేస్తుంటారు. ఈ క్రమంలో ఎక్కువమంది రైల్వే స్టేషన్లలో.. రైళ్లలో గుట్కాలు అమ్ముతూ ఉంటారు. ఇలా ఎంతోమంది గుట్కాలు ఉమ్మిన దానిని క్లీన్ చేయడానికి భారతీయ రైల్వే బోర్డ్ నెలకు రూ. 1200 కోట్లు ఖర్చు చేస్తోంది. అంతేకాకుండా ఈ ఖర్చులు తగ్గించుకోవడానికి కొత్తగా కెమికల్ ను కూడా తయారు చేయడానికి పరిశోధనలు చేస్తుంది. అయితే ఒక దేశంలో మాత్రం గుట్కా ఉమ్మడంపై కఠిన నిబంధనలు ఉన్నాయి. ఇక్కడ గుట్కా ఉమ్మితే రూ. 3,80,000 జరిమానా విధిస్తారు. ఆ తర్వాత కూడా ఏం చేస్తారంటే?
గుట్కా ఉమ్మడంపై భారత దేశంలో కఠిన చర్యలు లేవు. కానీ ఇతర దేశాల్లో మాత్రం దీనిపై నిబంధనలో కఠినంగా ఉన్నాయి. వీటిలో సింగపూర్ ఒకటి. ఈ దేశంలో గుట్కా రోడ్లపై ఉమ్మితే రూ. 3,80,000 జరిమానా చెల్లించాల్సిందే. అలాగే గుట్కా కాకుండా మామూలుగా ఉమ్మినా కూడా ఇంతే జరిమానా విధిస్తారు. అయితే ఈ జరిమానా కట్టకుండా తప్పించుకోవడానికి ఎటువంటి చాన్స్ ఉండదు. ఎందుకంటే ఈ జరిమానా కట్టకపోతే సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్తారు. ఆ తర్వాత ఆ వ్యక్తికి సంబంధించిన బ్యాంకు లోన్ ఆపేస్తారు.. ఇతర ఆర్థిక వ్యవహారాలను నిలిపివేస్తారు. ఇలాంటి కఠిన నిబంధనలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఎవరు రోడ్డుపై ఉమ్మడానికి ప్రయత్నించరు. అంతేకాకుండా ఇక్కడ చెత్త వేసినా కూడా కఠినమైన నిబంధనలు విధిస్తారు.
అయితే భారతదేశం లో కూడా ఇలాంటి కఠినమైన నిబంధనలు తీసుకురావాలని కొందరు అంటున్నారు. ఎందుకంటే ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీలో ఓ నేత గుట్కా ఉమ్మడంపై దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇక మిగతా ప్రదేశాల్లో ఎక్కడ చూసినా గుట్కాతో ఉన్న మరకలే కనిపిస్తూ ఉంటాయి. అంతేకాకుండా భారతదేశంలో ఇటువంటి వాటిపై భారీగా జరిమానాలు విధిస్తేనే ఈ సమస్యలు ఉండవని అంటున్నారు. భారతదేశంలో స్వచ్ఛ భారత్ పేరిట ఎన్నో రకాల పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయినా కూడా కొందరు చెత్తాచెదారాన్ని రోడ్డుపైనే వేస్తూ.. ఇతరులకు ఇబ్బందిని కలిగిస్తున్నారు. అంతేకాకుండా ఏమాత్రం పరిశుభ్రత పాటించకుండా ఉంటున్నారు. స్వచ్ఛత విషయంలో ప్రభుత్వం మరిన్ని కఠిన నిబంధనలు తీసుకురావాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.