https://oktelugu.com/

Health Tips: రాత్రి నిద్ర పట్టడం లేదా.. అయితే ఇలా చేయండి..

నిద్ర రాకపోవడం అనేది సాధారణ సమస్యగా మారింది. ఎంత ట్రై చేసినా నిద్ర పట్టదు. దీనితో అనేక అనార్యో సమస్యలు కూడా వస్తాయి. వీటి నుంచి బయటపడేందుకు ఇవి పాటించండి.

Written By:
  • Raj Shekar
  • , Updated On : February 19, 2024 / 03:04 PM IST
    Follow us on

    Health Tips: ప్రస్తుత కాలంలో నిద్రలేమి అతిపెద్ద సమస్యగా మారింది. ఉరుకులు పరుగుల జీవితం, మానసిక ఒత్తిడి, సమస్యలు, ఆర్థిక ఇబ్బందుల, అనారోగ్య సమస్యలు ఇలా కారణం ఏదైనా కావొచ్చు.. చాలా మంది నిద్రలేమితో బాధపడుతున్నారు. రాత్రిపూట గంటలతరబడి మంచంపై పడుకున్నా నిద్ర పట్టక ఇబ్బంది పడుతున్నారు. నిద్ర రావడానికి పోరాడుతున్నారు. అయితే కొందరు నిద్రమాత్రలు, మత్తు పదార్థాలు తీసుకుంటున్నారు. ఇవి సైడ్‌ ఎఫెక్ట్‌ చూపుతాయంటున్నారు వైద్యులు. ఇతర అనారోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిద్ర పట్టడానికి కొన్ని చిట్కాలు తెలుసుకుందాం.

    నిద్ర రావడానికి చిట్కాలు
    నిద్ర రాకపోవడం అనేది సాధారణ సమస్యగా మారింది. ఎంత ట్రై చేసినా నిద్ర పట్టదు. దీనితో అనేక అనార్యో సమస్యలు కూడా వస్తాయి. వీటి నుంచి బయటపడేందుకు ఇవి పాటించండి.

    – మీకు గాఢ నిద్ర కావాలంటే.. తిన్న వెంటనే నిద్రపోవద్దు. మంచి నిద్ర కోసం రాత్రి భోజనం చేసిన తర్వాత కనీసం 2 గంటలు నిద్రకు సమయం ఇవ్వాలి. తిన్న వెంటనే పడుకోవడం వలన గ్యాస్‌ లేదా వాంతులు అయ్యే అవకాశం ఉంటుంది.

    – రాత్రి నిద్ర పట్టక ఇబ్బంది పడుతుంటే.. పడుకునే ముందు బాదం పాలు తాగాలి. ఇందులో నిద్రకు తోడ్పడే పోషకాలు ఉంటాయి.

    – నిద్ర సమస్య ఉన్నవారు రాత్రివేళ చెర్రీస్‌ను డైట్‌లో చేర్చుకోవాలి. ఇందులో మెలటోనిన్‌ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరానికి విశ్రాంతి ఇస్తుంది. మంచి నిద్రకు సహాయపడుతుంది. నిద్రపోయే గంట ముందు చెర్రీ జ్యూస్‌ తాగడం వలన మంచి నిద్ర పడుతుంది.

    – ఇక రాత్రి నిద్రపోయే ముందు పాలు తాగాలి. ఇది ఆరోగ్యం మరుగు పర్చడంతోపాటు మంచి నిద్రకు దోహదపడుతుంది. పసుపు కలిపిన పాలు తాగడం ఇంకా మంచిది.

    – ఇక నిద్రపోయే ముందు ధాన్యం చేయడం చాలా మంచిది. ఒత్తిడిని దూరం చేస్తుంది. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. మెలటోనిన్, సెరోటోనిన్‌లను పెంచుతుంది. రక్తపోటు, హృదయ స్పందనను తగ్గిస్తుంది.

    – ఇక మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే పడుకునే ముందు గదిలో ఫోన్, ల్యాప్‌టాప్, ఇతర ఎలక్ట్రానిక్‌ వసుత్వులు ఉండకుండా చూసుకోవాలి. రాత్రి ఫోన్లు చూడడం, ల్యాప్‌టాప్‌ చూడడం వలన ఒత్తిడి పెరుగుతుంది. క్రైం, హర్రర్‌ సినిమాలు చూడడం వలన టెన్షన్‌ పెరుగుతుంది. పడుకున్నా.. మనసులో అవే ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి.

    – పడుకునే ముందు 10 సార్లు శ్వాస తీసుకుని వదిలివేయండి. ఇలా కనీసం 5 సార్లు చేయండి. మీ దృష్టిని మీ శ్వాసపై కేంద్రీకరించండి. ఈ సమయంలో మీ మనసులో ఏదైనా ఆలోచన వస్తే, మీ శ్వాసపై పూర్తి దృష్టి పెట్టండి.

    – త్వరగా పడుకోవాలి. లేదంటే చాలా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనాల్సి వస్తుంది. త్వరగా నిద్రపోతే శరీరానికి విశ్రాంతి లభిస్తుంది. మళ్లీ తిరిగి శక్తి పొందడానికి సహాయం చేస్తుంది. మెరుగైన మానసిక స్థితికి తోడ్పడుతుంది. తగినంత నిద్రతో మధుమేః, గుండె జబ్బులు, ఊబకాయం వంటి సమస్యలకు దూరంగా ఉండొచ్చు.

    – త్వరగా పడుకోవడం వలన శరీరంలోని హార్మోన్లు, ముఖ్యంగా ఒత్తిడికి సంబంధించిన హార్మోన్లు నియంత్రణలో ఉంటాయి. ఒత్తిడికి కారణమయ్యే కార్టిసాల్‌ హార్మోన్‌ సహజంగా రాత్రి ఎక్కువగా ఉంటుంది. త్వరగా పడుకోవడం వలన కార్టిసాల్‌ స్థాయి తగ్గించబడుతుంది. ఇది మన ఆరోగ్యం, శ్రేయస్సుపై సానుకూల ప్రభావం చూపుతుంది.