Face Beauty Tips: ప్రతీ వంటింట్లో ఉండే ఆహార పదార్థాల్లో అల్లం ఒకటి. రోజూ వండేకూరలతో పాటు అప్పుడప్పుడు టీ లో కూడా అల్లం వేసుకుంటారు. అలాగే అల్లంతో అల్లపు రబ్బ వంటి ఇతర పదార్థాలు కూడా తయారుచేస్తారు. అయితే అల్లం రసం తాగడం వల్ల అజీర్తి సమస్యలు తొలగిస్తాయి. జీర్ణ క్రియ సక్రమంగా ఉండాలంటే అల్లం టీని తాగమని ఆరోగ్య నిపుణులు సూచిస్తూ ఉంటారు. అయితే ఇలా రకరకాల మార్గాల ద్వారా అల్లం ను తీసుకుంటే శరీరానికి ఆరోగ్యమే కాకుండా ముఖానికి అందాన్ని కూడా ఇస్తుందని కొందరు చెబుతున్నారు. ఇంతకీ అందంగా మారేంత అల్లంలో ఏముంది? ఇది తింటే ఎందుకు అందంగా మారుతారు?
ఇప్పుడున్న చాలా మంది అందంగా ఉండాలని కోరుకుంటున్నారు. ఈ క్రమంలో ఫేస్ కు ఏవేవో క్రిములు రాస్తున్నారు. ఫలితంగా స్కిన్ ఇన్ఫెక్షన్లు వచ్చి ఇబ్బందులు పడుతున్నారు. అందంగా కావడానికి ప్రత్యేకంగా స్కిన్ క్రీమ్స్ కొనకుండా ఇంట్లోనే అల్లంతో కలిపి క్రీమ్ లాంటి పదార్థాన్ని తయారు చేసుకోవచ్చు. అల్లంలో తేనె, పంచదార కలిపి పేస్టులా తయారు చేయాలి. ఇలా తయారు చేసిన తరువాత ఫేస్ కు అప్లై చేయాలి. దీని వల్ల మృత కణాలు తొలిగిపోతాయి.
అలాగే అల్లం రసంలో చక్కెర లేదా సముద్రపు ఉప్పును కలుపుకొని తాగాలి. ఇలా కొన్ని రోజుల పాటు తీసుకోవడం వల్ల చర్మం మృదువుగా తయారవుతుంది. తరిగిన అల్లంలో ఆలివ్ నూనె లేదా కొబ్బరి నూనె కలుపుకొని జుట్టుకు రాసుకోవడం వల్ల మెరిసే జుట్టులా తయారవుతుంది. మొటిమల సమస్యతో బాధపడేవారు అల్లంలో తేనే కలిపి మొటిమలు ఉన్న చోట రాయాలి. ఇలా రాయడం వల్ల ఎరుపుగా ఉండే మొటిమలు మాయమవుతాయి.
స్నానం చేసే నీటిలో అల్లం రసంను కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగ్గా ఉంటుంది. అల్లంలో ఆలివ్ నూనెను కలిపి.. ఈ మిశ్రమాన్ని శరీరానికి మసాజ్ చేసినప్పుడు ఉపయోగించుుకోవడం వల్ల ఎంతో మేలు చేస్తుంది. అల్లం టీ లో దూదిని ముంచి ఫేస్ కు రాసుకుంటే ఫేస్ కాంతివంతంగా మారుతుంది.