Kidney Stones: ఏదైనా అనారోగ్య సమస్య వస్తున్నప్పుడు కచ్చితంగా సింటమ్స్ వస్తుంటాయి. ఆ లక్షణాలను తెలుసుకొని తొందరగా డాక్టర్ వద్దకు వెళ్తే వ్యాధి నయం అవుతుంది. ఆలస్యం చేస్తే రిస్క్ లో పడే అవకాశాలు ఉంటాయి. అయితే ఈ మధ్య చాలా మందికి కామన్ గా కిడ్నీలో రాళ్లు వస్తున్నాయి. మరి ఈ రాళ్లు వచ్చే ముందు ఎలాంటి లక్షణాలు ఉంటాయి? వాటిని మనం గుర్తించవచ్చా లేదా అనే విషయాలు తెలుసుకుందాం. శరీరంలో కొన్ని అనారోగ్యాలు కనిపిస్తే కిడ్నీల్లో రాళ్లు ఉన్నట్టే అంటున్నారు నిపుణులు.
వీపు, వెన్నెముక కింద నొప్పి వస్తుందంటే రాళ్ల వల్ల అని గుర్తించాలట. నడుపు, పొత్తికడుపులో నొప్పి వచ్చిన అనుమానించాలి. మూత్రవిసర్జన చేసేటప్పుడు మంట వచ్చినా ఆలోచించాలి. మూత్రం ఎరుపు లేదా బ్రౌన్ కలర్ లో వచ్చినా కూడా కిడ్నీలో రాళ్ల సమస్య అని గుర్తించాలట. అంతేకాదు పదేపదే మూత్రం వచ్చినా కూడా సంకోచించాలి. కడుపులో తిప్పి ఆ తర్వాత వాంతులు అవుతుంటాయట.
చలితో కూడిన జ్వరం, మూత్రంలో దుర్వాసన, నిత్యం అలసట, నీరసంగా అనిపించడం వంటివి కిడ్నీలో రాళ్లు ఉన్నాయని తెలిపే సంకేతాలు అంటున్నారు నిపుణులు. మరి ఈ లక్షణాలు ఉంటే కచ్చితంగా సంకోచించండి. ఇలాంటి లక్షణాలు ఉంటే దగ్గరలో ఉన్న మీ వైద్యుడి సలహా తీసుకొని టెస్టులు చేసుకోండి. సందేహ పడినట్టు రాళ్లు అయితే తొందరగా వ్యాధి నయం అవుతుంది. కానీ నార్మల్ గా వచ్చాయంటే మీరు లక్కీనే కదా..అయినా ఇలాంటి లక్షణాలు మాత్రమే కాదు. ఈ మధ్య ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించకపోవడమే బెటర్ అని గుర్తు పెట్టుకోండి.