Online Shopping: ఆన్ లైన్ లో షాపింగ్ చేస్తున్నారా? ఈ జాగ్రత్తలు పాటించకపోతే డబ్బులు గోవిందా..!

ఒక వస్తువును ఆన్ లైన్ లో కొనుగోలు చేసేటప్పుడు ఆ వస్తువుపై ఎంత ఆఫర్ ఉందో తెలుసుకోండి. ఈ క్రమంలో అధిక ధరలు కలిగిన విలువైన వస్తువులపై భారీ డిస్కౌంట్లు ఉండడం వల్ల ఈ వస్తువులు కొనుగోలు చేస్తే భారీగా లాభం జరుగుతుంది.

Written By: Chai Muchhata, Updated On : August 8, 2024 5:19 pm

Online Shopping

Follow us on

Online Shopping: ఆషాఢం మాసం వెళ్లిపోయి శ్రావణ మాసం వచ్చేసింది. శ్రావణ మాసం అంటే పండుగలు, వ్రతాలతో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిస్తుంది. శుభకార్యాలు, పెళ్లిళ్లు జోరుగా ఉంటాయి.ఈ నేపథ్యంలో వస్తువుల కొనుగోళ్లు జరుగుతాయి. దీంతో షాపింగ్ మాళ్లు, ఇతర వస్తువుల దుకాణాలు కళకళలాడుతూ ఉంటాయి. ఈ తరుణంలో ఆన్ లైన్ ఈ కామర్స్ సంస్థలు ఈ సమయంలో సేల్స్ ను పెంచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. దీంతో శ్రావణ మాస ప్రత్యేక సేల్స్ ను అందిస్తుంటాయి. శ్రావణ మాసం జూలై లేదా ఆగస్టు నెలలో వస్తూ ఉంటుంది. ఈసారి ఆగస్టు 5న ప్రారంభం అయింది. ఇదే నెలలో నాగపంచమి, రాఖీ పౌర్ణమి, వరలక్ష్మీ వ్రతం లాంటి శుభదినాలు రానున్నాయి. ఇదే సమయంలో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే కూడా రాబోతుంది. భారత స్వాత్రంత్ర్య దినం రోజున ప్రత్యేక వేడుకలు నిర్వహించుకుంటూ ఉంటాం. ఈసందర్భంగా తాజాగా కొన్ని ఈకామర్స్ సంస్థలైన ఆమెజాన్, ఫ్లిప్ కార్టు సంస్థలు ‘ప్రీడమ్ సేల్స్’ పేరిట కొన్ని వస్తువులకు ఆఫర్లు ప్రకటించాయి. ఇండిపెండెన్స్ డే వరకు వస్తువులు కొనుగోలు చేస్తే కొన్ని ప్రకటించిన వస్తువులు తక్కువ ధరకే లభించనున్నాయి. అయితే నేటి కాలంలో ఆన్ లైన్ షాపింగ్ లోనూ భారీ మోసాలు ఎదుర్కొంటున్నారు వినియోగదారులు. ఈ నేపథ్యంలో నిజమైన సంస్థలు ఏవో తెలుసుకోలేకపోతున్నారు. ఈ తరుణంలో ఆన్ లైన్ షాపింగ్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా ఆఫర్స్ విషయంలో తొందరపడి కొనుగోలు చేయొద్దు. మరి ఆన్ లైన్ షాపింగ్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం..

ఒక వస్తువును ఆన్ లైన్ లో కొనుగోలు చేసేటప్పుడు ఆ వస్తువుపై ఎంత ఆఫర్ ఉందో తెలుసుకోండి. ఈ క్రమంలో అధిక ధరలు కలిగిన విలువైన వస్తువులపై భారీ డిస్కౌంట్లు ఉండడం వల్ల ఈ వస్తువులు కొనుగోలు చేస్తే భారీగా లాభం జరుగుతుంది. ఉదాహరణకు రిప్రిజిరేట్లు, టీవీల వంటి వస్తువులపై ఎక్కువ పర్సంటేజీ డిస్కౌంట్ ప్రకటిస్తే కొనుగోలు చేయొచ్చు. చిన్న చిన్న వస్తువులై తక్కువగా డిస్కౌంట్లు ప్రకటించినా వాటి అసవరం లేకుండా కొనుగోలు చేస్తే ఫలితం ఉండదు.

ప్రముఖ సంస్థలైన ఆమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి సంస్థలు ప్రస్తుతం భారీ ఆఫర్స్ ప్రకటించాయి. అయితే వీటి పేరుతో కొన్ని సంస్థలు లింక్ తయారు చేసి మెసేజ్ చేస్తుంటాయి. వీటిని క్లిక్ చేయడం వల్ల తక్కువ ధరకే వస్తువులు అందించడడుతాయని ఫేక్ మెసేజ్ లు పంపిస్తుంటాయి. ఇలాంటి ఆఫర్స్ కనిపిస్తే వెంటనే గూగుల్ లోకి వెళ్లి అధికారిక వెబ్ సైట్ లో చెక్ చేయండి. అక్కడ ఆఫర్ తో వస్తువు కనిపిస్తేనే కొనుగోలు చేయండి.

కొన్ని వస్తువులపై నేరుగా డిస్కౌంట్లు ఇవ్వకుండా క్యాష్ బ్యాక్ అందిస్తుంటాయి. అయితే ఈ క్యాష్ బ్యాక్ నేరుగా బ్యాంకులో జమ అవుతుందా? లేదా ఏదైనా వస్తువు కొనుగోలు చేయడానికి అవకాశం ఇస్తారా? అనేది చెక్ చేసుకోవాలి. ఏదైనా వస్తువు కొనుగోలు చేయడానికి అవకాశం ఇస్తే అ వస్తువు మీకు అనవసరం అయితే దీని జోలికి వెళ్లకుండా ఉండడం మంచిది.

కొన్ని యాప్ లు పండుగల సందర్భంగా ప్రత్యేక ప్రయోజనాలు కల్పిస్తూ ఆఫర్లు ప్రకటిస్తాయి. ఇవి ప్రముఖ సంస్థలకు చెందినవా? లేక ఇతర సంస్థలకు చెందినవా? చెక్ చేసుకోవాలి. సాధారణ సంస్థలు అయితే మోసం చేసే అవకాశాలు ఎక్కువ అందువల్ల వీటి జోలికి వెళ్లకుండా ఉండడమే మంచిది.

ఏదైనా వస్తువుపై ఆఫర్ ప్రకటించినప్పుడు ముందుగా బుక్ చేసుకుంటే ఫ్రీ ఆఫర్ అందిస్తారు. అయితే ఇలాంటి సమయంలో ధరతో సంబంధం లేకుండా వస్తువులను కొనుగోలు చేయొచ్చు. ఇవి తక్కువగా అందుబాటులో ఉంటాయి. వీటిని కోనుగోలు చేయడం వల్ల ఆ తరువాత వాటిని దక్కించుకున్నవారవుతారు. లేకుండా ఆ తరువాత వీటి ధరలు పెరిగే అవకాశం ఉంది.