https://oktelugu.com/

Shoes: ఈ షూస్ ధరిస్తున్నారా.. అయితే మీకు ప్రమాదం తప్పదు

సాధారణంగా హై హీల్స్ వేస్తేనే కాళ్లకు అంత మంచిది కాదు. అలాంటిది షూస్‌లో హై హీల్స్ వేయడం అసలు మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. హై హీల్స్ షూస్ వేయడం వల్ల కాళ్ల నొప్పులు తీవ్రం అయ్యి ప్రమాదం పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 31, 2024 / 04:16 AM IST

    Footwear shoes

    Follow us on

    Shoes: కాళ్లకు చెప్పులు ధరించాలనే ఉద్దేశంతో కంటే ఫ్యాషన్‌ను ఫాలో ధరించే వాళ్లు ఎక్కువగా ఉంటారు. ప్రస్తుతం అయితే మార్కెట్‌లో రకరకాల మోడల్స్ ఉన్నాయి. చెప్పులు, షూస్ ఇలా చాలా రకాలు అందుబాటులో ఉన్నాయి. సందర్భాన్ని బట్టి ఒక్కోరు వీటిని ఒక్కో రకం షూస్‌ను ధరిస్తుంటారు. చెప్పులు కంటే షూస్ చాలా ఫ్రీగా ఉంటాయి. ఎక్కడికైనా కూడా ఈజీగా వేసుకుని వెళ్లవచ్చు. అయితే ఈ షూస్‌లో కూడా కొన్ని కంఫర్ట్ ఉన్నవి, లేనివి ఉంటాయి. ఎవరికి ఏ షూస్ నచ్చితే ఆ షూస్ ధరిస్తారు. ఒకరికి కంఫర్ట్ ఉన్నవి వేరే వాళ్లకి కంఫర్ట్ అనిపియ్యవు. అయితే కొందరు స్టైల్‌గా ఉండాలని షూస్‌లో ఎక్కువ ఎత్తు ఉన్నవి ధరిస్తారు. అబ్బాయిలకు షూస్‌ తక్కువ ఎత్తుతోనే ఉంటాయి. కానీ అమ్మాయిలకు మాత్రం హై హీల్స్ కూడా ఉంటాయి. సాధారణంగా హై హీల్స్ వేస్తేనే కాళ్లకు అంత మంచిది కాదు. అలాంటిది షూస్‌లో హై హీల్స్ వేయడం అసలు మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. హై హీల్స్ షూస్ వేయడం వల్ల కాళ్ల నొప్పులు తీవ్రం అయ్యి ప్రమాదం పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

    తక్కువ ఎత్తు ఉండే ప్లాట్ షూస్ ధరించడం వల్ల ఎలాంటి ప్రమాదం లేదు. కానీ ఎత్తు ఎక్కువగా ఉండే హై హీల్డ్ షూస్‌ను ధరించడం వల్ల ప్రమాదం ఉంటుందని, వారికే ఎక్కువగా గాయాలు అవుతాయని తాజాగా పరిశోధనల్లో తేలింది. తక్కువ ఎత్తు ఉండే షూస్‌ను ఎక్కువగా రన్నింగ్‌కి ఉపయోగిస్తారు. ఎక్కువగా ఎత్తు ఉండే షూస్‌తో రన్నింగ్ చేస్తే కాళ్లు నొప్పులు వస్తాయి. కాబట్టి తక్కువ ఫ్లాట్ ఉండే హైక్వాలిటీ ఉండే షూస్‌ను రన్నింగ్‌కి ఉపయోగించాలని నిపుణులు చెబుతున్నారు. కాళ్లకు సరైన షూస్ ధరించకపోతే ఆర్థరైటిస్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ మిస్టేక్స్ చేయవద్దు. కొందరు షూస్ ధరించేటప్పుడు టైట్‌గా ఉండే వాటిని వేసుకుంటారు. ఇలా చేయడం వల్ల కాళ్లలో పుండ్లు ఏర్పడతాయని నిపుణులు చెబుతున్నారు.

    ఎప్పుడైనా కూడా షూస్ కాళ్లకు టైట్‌గా కాకుండా ఫ్రీగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే కాళ్లకు ఎలాంటి సమస్యలు రావు. కేవలం స్టైల్ మాత్రమే కాకుండా ఆరోగ్యం కూడా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఒక్క స్టైల్ కావాలని హై హీల్స్ ఉండే షూస్ ధరించారు అనుకోండి.. ఇక మీరు సమస్యల బారిన పడటం తప్పదు. కాళ్లకు చెప్పులు అనేవి అవసరం. ఇవి సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. కొందరు కాళ్లకు పలుచని షూస్ కూడా ధరిస్తారు. వీటివల్ల రాళ్లు ఏవైనా గుచ్చుకునే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. మరీ పలచగా ఉండే చెప్పులను అసలు ధరించవద్దు. అలాగని మరీ ఎక్కువ ఎత్తు ఉండే హై హీల్స్ ధరించవద్దని నిపుణులు అంటున్నారు.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహాలు తీసుకోగలరు.