మన దేశంలోని ప్రజలకు ఎంతో ముఖ్యమైన కార్డులలో ఆధార్ కార్డ్ ఒకటనే సంగతి తెలిసిందే. ఆధార్ కార్డ్ అనేది మనకు ఎంతో ముఖ్యమైన గుర్తింపు కార్డులలో ఒకటని చెప్పవచ్చు. ఆధార్ కార్డ్ సహాయంతో ఎన్నో ముఖ్యమైన పనులను సులభంగా పూర్తి చేయడం సాధ్యమవుతుంది. కొత్త మొబైల్ నంబర్ ను తీసుకోవాలని అనుకున్నా, బ్యాంక్ అకౌంట్ ను ఓపెన్ చేసినా ఆధార్ కార్డ్ ఎంతో ముఖ్యమనే సంగతి తెలిసిందే.
ఆధార్ కార్డులో మన పేరు, తండ్రి పేరు, అడ్రస్ కు సంబంధించిన వివరాలు ఉంటాయి. ప్రజలకు ఆధార్ కార్డ్ ఎంతో ముఖ్యమైన పత్రం కావడంతో పాటు ఆధార్ కార్డ్ వల్ల ఎటువంటి సాధారణంగా ఎటువంటి మోసాలు జరగవు. అయితే మనకు సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని ఆధార్ కార్డ్ నంబర్ కలిగి ఉంటుంది. ఆధార్ నంబర్ సహాయంతో మన గోప్యతను నేరస్థులు వినియోగించే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.
ఆధార్ కార్డ్ హోల్డర్స్ తమ గుర్తింపును ప్రూవ్ చేసుకోవడానికి ప్రతిచోటా ఆధార్ కార్డులను వినియోగిస్తూ ఉండటం గమనార్హం. పాన్ కార్డ్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, బ్యాంక్ చెక్ ల కోసం ఆధార్ కార్డ్ నంబర్ ను వినియోగించడం జరుగుతుంది. అయితే ఈ సమాచారాన్ని బహిర్గతం చేయబోమని యూఐడీఏఐ చెబుతోంది. ఆధార్ కార్డ్ ను అవసరానికి మాత్రమే వినియోగించాలని యూఐడీఏఐ చెబుతోంది.
ఆధార్ కార్డును బహిర్గతపరచడం వల్ల రహస్య సమాచారం లీక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆధార్ కార్డు ద్వారా బ్యాంకింగ్ లావాదేవీలను సులభంగా జరపవచ్చనే సంగతి తెలిసిందే.