Hero Movie: మేనమామ ప్లేస్ లో నేనున్నానంటూ వస్తున్న గల్లా అశోక్…

Hero Movie:  సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు, ఎంపి గల్లా జయదేవ్ తనయుడు అశోక్ గల్లా హీరోగా ఒక మూవీ ఒక తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమాకు” హీరో ” అనే టైటిల్ ని కూడా ఫిక్స్ చేశారు. సూపర్ స్టార్ కృష్ణ, గల్లా అరుణకుమారి సమర్పణలో… అమర్ రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై పద్మావతి గల్లా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శ్రీరామ్ ఆదిత్య ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.ఈ ఇప్పుడు తాజాగా అదిరిపోయే […]

Written By: Raghava Rao Gara, Updated On : November 13, 2021 6:49 pm
Follow us on

Hero Movie:  సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు, ఎంపి గల్లా జయదేవ్ తనయుడు అశోక్ గల్లా హీరోగా ఒక మూవీ ఒక తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమాకు” హీరో ” అనే టైటిల్ ని కూడా ఫిక్స్ చేశారు. సూపర్ స్టార్ కృష్ణ, గల్లా అరుణకుమారి సమర్పణలో… అమర్ రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై పద్మావతి గల్లా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శ్రీరామ్ ఆదిత్య ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.ఈ ఇప్పుడు తాజాగా అదిరిపోయే అప్డేట్ ని ప్రకటించారు.

కాగా ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 26న విడుదల చేయనున్నట్టు చిత్ర బృందం తెలిపింది. గణతంత్ర దినోత్సవం కానుకగా ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు మూవీ టీమ్ ప్రకటించింది ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో అందాల భామ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. అలానే జిబ్రాన్ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.

వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట’ సినిమా విడుదల కావలసింది.అయితే రాజమౌళి ఆర్ఆర్ఆర్ విడుదల కానుండటంతో మహేష్ బాబు మూవీ ఏప్రిల్ కు వాయిదా వేశారు. కానీ ఈ తరుణంలో అశోక్ నటించిన ఈ సినిమా విడుదల అవుతుండటంతో ఘట్టమనేని అభిమానులు సందడి వాతావరణం నెలకొంది. ఈ చిత్రంలో సూపర్ స్టార్ కృష్ణ నటించిన సినిమాలోని ఒక పాటను రీమేక్ చేసిన విషయం తెలిసిందే, ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్రం నుండి ఇప్పటికే విడుదలైన పోస్టర్ పాటలకు మంచి స్పందన లభించింది.